మంత్రివర్గంలో నాగబాబుకు చోటు?

జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబును టీటీడీ ఛైర్మన్ చేయబోతున్నారని చాలాకాలం ప్రచారం జరిగినా…చివరకు బీఆర్ నాయుడును ఆ పదవి వరించింది. దీంతో, నాగబాబును పెద్దల సభకు పంపేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారని ప్రచారం కూడా జరిగింది. అయితే, తాజాగా నాగాబాబును ఏపీ మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారని మరో ప్రచారం తెరపైకి వచ్చింది. నాగబాబుకు బెర్త్ కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది.

ఏపీ కేబినెట్ లోకి 25 మందిని తీసుకునే చాన్స్ ఉండగా…24 మంది మంత్రులను ఆల్రెడీ ఎంపిక చేశారు. మిగిలిన ఆ మంత్రి పదవిని నాగబాబుకు దక్కనుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఆర్. కృష్ణయ్య, టీడీపీ నుంచి బీద మస్తాన్‌రావు, సానా సతీష్‌ లను రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేశారు. ఎన్డీఏ కూటమికి అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం ప్రకారం ఈ మూడు రాజ్యసభ సీట్లు ఏకగ్రీవం అయ్యే అవకాశముంది. రాజ్యసభ తలుపులు మూసుకుపోవడంతో నాగబాబుకు ఏపీ కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ అని తెలుస్తోంది.