ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి నేతలను చేర్చుకోవడం దేవుడెరుగు ఉన్నవాళ్ళని కాపాడుకోవమే చాలా కష్టంగా తయారవబోతోందని సమాచారం. సెప్టెంబర్ రెండో వారం నుండి బీజేపీలోని నేతలే కాంగ్రెస్ లోకి వెళ్ళేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం మొదలైంది. సెప్టెంబర్ 2వ వారం అంటే ప్రత్యేకత ఏమిటంటే కాంగ్రెస్ లో టికెట్లు ఫైనల్ చేయబోతున్నారు. మొదటి లిస్టు సెప్టెంబర్ 1వ వారం తర్వాత బయటకు వస్తుందని అనుకుంటున్నారు. అందుకనే కాంగ్రెస్ లో చేరి …
Read More »ఖమ్మంలో కారు బ్రేక్ డౌన్
తెలంగాణ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కన్నేశారు. అందు కోసం కసరత్తుల్లో మునిగిపోయారు. ముందుగానే 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమర శంఖం పూరించారు. అభ్యర్థుల విజయం కోసం ప్రణాళికల్లో మునిగిపోయారు. అంతా బాగానే ఉంది కానీ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మాత్రం కేసీఆర్ కు ఆందోళన కలిగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి ఇక్కడ ఆ పార్టీ పరిస్థితి అంతంతమాత్రమే. ఇక …
Read More »కేసీఆర్ పై ఈటల, కేటీఆర్ పై బండి
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ను గద్దెదించి కాషాయా కండువా ఎగిరేయాలన్నది బీజేపీ లక్ష్యం. ఆ దిశగా బీజేపీ అధిష్ఠానం కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లోని కీలక నాయకులకు పోటీగా బీజేపీ తెలంగాణలోని ముఖ్య నేతలను పోటీగా దింపాలని చూస్తున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారడం ఖాయం. బీజేపీ తెలంగాణ …
Read More »మామ జిల్లా.. కానీ అక్కడ బాబుకు తలనొప్పి
ఆ జిల్లా పేరేమో తన మామది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం అక్కడ తలనొప్పి తప్పడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం బాబు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఎలాగైనా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి మాత్రం ఏ మాత్రం …
Read More »కాంగ్రెస్ లో ఉదయపూర్ టెన్షన్ ?
వచ్చిన దరఖాస్తులు చూసిన తర్వాత కాంగ్రెస్ సీనియర్లలో ఉదయ్ పూర్ డిక్లరేషన్ టెన్షన్ పెరిగిపోతోంది. ఒకవైపు ఇన్ని దరఖాస్తులు వచ్చినందుకు సంతోషించాలా ? లేకపోతే వీటిని వడపోసి అభ్యర్ధలను ఎంపికచేయటంలో ఉండే కష్టాలను చూసి భయపడాలో అర్ధంకావటంలేదు. ఇంతకీ ఉదయ్ పూర్ డిక్లరేషన్ ఏమిటంటే కుటుంబానికి ఒక్క టికెట్ అని. రాజస్ధాన్లోని ఉదయ్ పూర్లో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఈ డిక్లరేషన్ చేశారు. దీన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాని నిర్ణయించారు. ఇపుడా …
Read More »తుమ్మల రాక.. పొంగులేటికి పొగ
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఒక స్థానం నుంచి కచ్చితంగా పోటీ చేస్తామనే ధీమాతో ఉన్నప్పటికీ మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తప్పుకోక తప్పదు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే మారనుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అందుకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావే కారణంగా మారనున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పాలేరు నియోజకవర్గంలో పోటీ …
Read More »ఒక్కసారిగా హీటు పెంచేసిన మోడీ
దేశరాజకీయాల్లో నరేంద్రమోడీ ఒక్కసారిగా హీటు పెంచేశారు. ఈనెల 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించబోతున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. మంత్రి ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో వెంటనే రాజకీయ పార్టీలన్నీ అప్రమత్తమైపోయాయి. ఈమధ్యనే వర్షాకాల సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. అప్పుడే మోడీ ప్రభుత్వంపై ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం కూడా …
Read More »బీజేపీలో వికాస్ చిచ్చు
అసలే అంతంతమాత్రంగా ఉన్న తెలంగాణా బీజేపీలో వికాసరావు ఎంట్రీ మరింత చిచ్చు రేపుతోంది. వికాసరావు ఎవరంటే కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్రకు గవర్నర్ గా పనిచేసిన సీహెచ్ విద్యాసాగరరావు కొడుకే ఈ వికాసరావు. డాక్టర్ వృత్తిని వదిలిపెట్టి పాలిటిక్స్ లోకి అడుగుపెట్టాలని వికాసరావు, దీప దంపతులు అనుకున్నారు. అందుకు బీజేపీనే అనువైన పార్టీగా ఎంచుకున్నారు. అందుకనే పార్టీ ఆఫీసులో పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. …
Read More »ఈ సారి రోజాకు టికెట్ కష్టమేనా?
వైసీపీ ఫైర్ బ్రాండ్ మహిళా నేత, మంత్రి రోజా…ప్రతిపక్ష నేతలపై దూకుడుగా మాటలదాడి చేస్తారన్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన నేతలపై సందర్భానుసారంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు రోజా. ఇలా ప్రతిపక్ష పార్టీల నేతలపై మాటలు తూటాలు పేల్చే రోజాకు సొంత పార్టీలోనే అసమ్మతి సెగ చాలాకాలంగా తగులుతోంది. నగరిలో మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే శాంతి…రోజాకు వ్యతిరేకంగా చాలా కాలంగా నిరసన గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. …
Read More »బీఆర్ఎస్ టెంపుల్ రాజకీయాలు మొదలుపెట్టిందా ?
ఎన్నికల్లో గెలుపుకోసం బీఆర్ఎస్ అభ్యర్ధులు అందుబాటులో ఉన్న అన్నీ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమపథకాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని ఒకటే ఊదరగొడుతోంది. దీనికి అదనంగా సెంటిమెంటు రాజకీయాలు కూడా మొదలయ్యాయి. నియోజకవర్గాల వారీగా జనాలను దేవాలయాలకు తీసుకెళుతున్నారు బీఆర్ఎస్ ఎంఎల్ఏల అభ్యర్ధులు. ఆర్మూరు ఎంఎల్ఏ జీవన్ రెడ్డి తన నియోజకవర్గంలోని ఓటర్లలో ఆసక్తి ఉన్నవారిని సొంత ఖర్చులతో యాదాద్రి దేవాలయానికి తీసుకెళ్ళారు. ఇదే విధమైన ప్లాన్ సిరిసిల్లలో కూడా …
Read More »డిప్యూటీ సీఎం… షర్మిల అదే పట్టు!
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. తాజాగా ఢిల్లీలో పర్యటించారు. తన భర్త, సువార్తీకుడు అనిల్కుమార్తో కలిసి ఆమె కాంగ్రెస్ అధినేత్రి సోనియా నివాసంలో ఆమెతో సుమారు 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ విషయాలు కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. ప్రధానంగా జగన్ గురించి సోనియా అడిగారని, ఇప్పుడు ఎలాంటి రిలేషన్ లేదని తెలియడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిసింది. ఇక, తెలంగాణ …
Read More »అందరి ఆశలు కేటీయార్ పైనేనా ?
తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ లోని అసంతృప్తుల ఆశలన్నీ మంత్రి కేటీఆర్ పైనే పెట్టుకున్నారు. విదేశాల్లో ఉన్న కేటీయార్ రాష్ట్రంలో జరిగే ప్రతి డెవలప్మెంటును ఎప్పటికప్పుడు తెలుసుకుంటునే ఉన్నారు. అవసరమైనట్లుగా ఎవరితో ఏమి మాట్లాడాలో అలా మాట్లాడుతునే ఉన్నారు. 119 నియోజకవర్గాల్లో 115 స్ధానాల్లో కేసీయార్ అభ్యర్ధులను ప్రకటించేసిన విషయం తెలిసిందే. దాంతో పార్టీలోని అసంతృప్తుల్లో తీవ్రమైన అలజడి మొదలైంది. దాంతో పార్టీలో గందరగోళం పెరిగిపోతోంది. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల …
Read More »