ఏదైనా కేసులో నిందితుడు నిజాలు చెప్పకుంటే… వారి నుంచి నిజాలు రాబట్టేందుకు వారిని తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు కోర్టులను కోరుతూ ఉంటారు. ఇలాంటి కొన్ని సందర్భాల్లో నిందితులను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కోర్టులు తీర్చులు చెబుతూ ఉంటాయి. మరికొన్ని కేసుల్లో కస్టడీ అవసరం లేదని కూడా కోర్టులే చెబుతుంటాయి. అయితే పోలీసు కస్టడీ అంటే…నిందితులను పోలీసులు కొట్టి మరీ నిజాలు రాబడతారన్న వాదనలు ఇటీవలి కాలంలో ఎక్కువైపోయాయి. అది …
Read More »ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా డిప్యూటీగా పర్వేశ్…
దేశమంతా ఆసక్తి రేకెత్తించిన ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠను తెర పడిపోయింది. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి సమవేశమైన బీజేఎల్పీ భేటీలో ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారంతా ఏకగ్రీవంగా రేఖా గుప్తాను సీఎంగా ఎన్నుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఢిల్లీలోని షాలిమార్ భాగ్ నియోజకవర్గం నుంచి గుప్తా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దాదాపుగా 15 రోజుల సుదీర్ఘ కసరత్తు తర్వాత రేఖాను బీజేపీ …
Read More »నేతలకు టార్గెట్లు : కేసీఆర్ పొలిటికల్ స్ట్రాటజీ!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. మరోసారి సెంటిమెంటునే నమ్ముకుంటున్నారు. తెలంగాణ ఉద్యమం.. నాటి పరిస్థితులు.. తెలంగాణ వారికి జరిగిన అవమానాలను ఆయన మరోసారి తెరమీదికి తీసుకురావడం ద్వారా.. ప్రజలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా జరిగిన బీఆర్ ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. పార్టీ నాయకులకు చేసిన దిశానిర్దేశం వంటివి పక్కాగా సెంటిమెంటు దిశగానే మాజీ సీఎం అడుగులు …
Read More »తెలుగు రాష్ట్రాలకు నిధులు… మాపై వివక్ష: తెలంగాణ!
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం విపత్తుల సహాయ నిధులు విడుదల చేసింది. ఏపీ, తెలం గాణ సహా మొత్తం ఐదు రాష్ట్రాల(త్రిపుర, ఒడిశా, నాగాలాండ్)కు ఈ నిధులను విడుదల చేసింది. ఏపీకి 606 కోట్ల రూపాయలను విడు దల చేసిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం 231 కోట్ల రూపాయలను మాత్రమే ఇచ్చింది. ఈ నిధులను విపత్తుల నిర్వహణ, ప్రజల పునరావాసానికి మాత్రమేకేటాయించాలని తేల్చి చెప్పింది. అంతేకాదు.. ఈ నిధులను …
Read More »ఫిట్ గురూ : విద్యార్థులతో షటిల్ ఆడిన లోకేష్!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఏపీ మంత్రి నారా లోకేశ్ రాజకీయంగా, పాలనా పరంగా సత్తా చాటుతున్నారు. 42 ఏళ్ల వయసుకే పార్టీకి రికార్టు విక్టరీ అందించిన లోకేశ్.. గతంలో ఎన్నడూ లేనంత మెజారిటీని చేజిక్కించుకున్నారు. తనతో కలిసి బరిలోకి దిగిన జనసేన, బీజేపీలకు కూడా రికార్డు విజయాలను అందించి అన్ని పార్టీల దృష్టిని ఆకర్షించారు. పాలనలో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టిన లోకేశ్.. తనదైన మార్కును చూపుతున్నారు. …
Read More »కేటినెట్ భేటీని వాయిదా వేసి ఢిల్లీకి చంద్రబాబు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఢిల్లీలో గురువారం జరిగే ఓ కీలక కార్యక్రమంలో పాలుపంచుకునేందుకే ఆయన ఈ పర్యటనకు వెళుతున్నారు. అందుకోసం గురువారం జరగాల్సి రాష్ట్ర మంత్రి మండలి సమావేశాన్ని కూడా ఆయన వాయిదా వేశారు. ఢిల్లీ నుంచి తిరిగి రాగానే… కేబినెట్ భేటీని రీషెడ్యూల్ చేస్తారని సమాచారం. అయినా కేబినెట్ భేటీని వాయిదా వేసుకుని మరీ చంద్రబాబు …
Read More »కేంద్రం నుంచి ఏదొచ్చినా… ఏపీదే అగ్ర తాంబూలం
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు నుంచి విడుదలయ్యే నిధులు ఏవైనా కూడా… వాటిలో ఏపీకి అగ్ర తాంబూలం లభిస్తోంది. మొన్నటికి మొన్న కేంద్ర సాధారణ బడ్జెట్ లో అయినా… ఆ తర్వాత వచ్చిన రైల్వే బడ్జెట్ లో అయినా ఏపీకి భారీ కేటాయింపులు దక్కాయి. ఈ కేటాయింపుల్లో ఏ ఇతర రాష్ట్రంతో పోల్చినా కూడా.. ఏపీకే భారీ కేటాయింపులు లభించాయి. ఏపీకి దక్కుతున్న ప్రత్యేక కేటాయింపులను పక్కనపెట్టినా కూడా ఆయా శాఖల …
Read More »కేసీఆర్ ఎంట్రీతో బీఆర్ఎస్ రాత మారేనా?
తెలంగాణలో ఇక రాజకీయం రసవత్తరంగా మారనుందా? విపక్ష బీఆర్ఎస్ మరింతగా చెలరేగిపోనుందా? అధికార కాంగ్రెస్ దూకుడుకు చెక్ పడిపోతుందా? క్రమంగా పుంజుకుంటున్న బీజేపీకి ఇక కష్టకాలమే రానుందా?… ఈ అన్ని ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుంది. ఇందుకు కొంత సమయం పట్టినా… తెలంగాణ రాజకీయాల్లో ఓ స్పష్టమైన మార్పు అయితే కనిపించనుందని చెప్పక తప్పదు. ఎందుకంటే… 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర పెద్దగా బయటకు వచ్చిందే లేదు. …
Read More »కులాన్ని వెలివేసి ప్రతిభకు బాబు పట్టం!
ఏపీలో గడచిన ఐదేళ్ల కాలంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి పదవులు దక్కాయి. ఇతర సామాజిక వర్గాల వారికి నిరాదరణ కరువైంది. ప్రతిభను పట్టించుకున్న నాథుడే రాష్ట్రంలో కరువయ్యాడు. ఇదేమని ప్రశ్నిస్తే.. కేసులు, అరెస్టులు స్వాగతం పలికేవి. ఈ తరహా పాలనకు విద్యకు ఆలయాలుగా ఉన్న విశ్వవిద్యాలయాలు కూడా బలి అయిపోయాయి. రాష్ట్రంలోని చాలా యూనివర్సిటీలకు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే వైస్ ఛాన్సలర్లుగా నియమితులయ్యారు. ఫలితంగా …
Read More »నాకు పోలీసు భద్రత కల్పించలేదు: జగన్
మీర్చికి గిట్టుబాటు ధర లేదని రైతులు వాపోతున్నారని, ఈ క్రమంలోనే గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి రైతులను పరామర్శించేందుకు పులివెందుల ఎమ్మెల్యే జగన్ పర్యటిస్తారని వైసీపీ నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, జగన్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. జగన్ సభ, ర్యాలీ చేయబోరని, కేవలం మిర్చి రైతులతో మాట్లాడారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే పోలీసుల …
Read More »మోడీ నెత్తిన ట్రంప్… కుంపటి??
గత ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న సమయం అది. ఆ సమయంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇవి వరుసగా సాగాయి. ఆ ఇంటర్వ్యూల్లో ప్రధానంగా అమెరికా ఎన్నికలపైనే ఫోకస్ చేశారు. “ట్రంప్ లాంటి బలమైన వ్యక్తి అధ్యక్షుడు అయితే.. మేలు జరుగుతుంది.. అని మేం భావిస్తున్నాం.“ అని ఓ సందర్భంగా చెప్పారు. “ట్రంప్‌కే అధ్యక్ష పగ్గాలు చేపట్టే సత్తా.. అమెరికాను …
Read More »ఎన్నికల్లో పోటీ చేయకుంటే ‘కోడ్’ వర్తించదా…?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరిగే జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ ఎప్పుడో అమలులోకి వచ్చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు పలు కార్యక్రమాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రులు సైతం… కోడ్ అమల్లోకి రాగానే తమ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ లను సర్దబాటు చేసుకున్నారు. కొన్ని కార్యక్రమాలను అయితే ఏకంగా రద్దు చేసుకున్నారు కూడా. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందంటే… …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates