తెలంగాణాలో కాంగ్రెస్ తరపున పోటీచేయబోయే అభ్యర్ధుల మొదటి లిస్టు రెడీ అవుతున్నట్లే ఉంది. సెప్టెంబర్ మొదటివారంలో జాబితా రిలీజ్ అయ్యే అవకాశాలున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. మొదటిజాబితాలో 40 మంది అభ్యర్ధులు ఉంటారని సమాచారం. మొదటిజాబితాలో సిట్టింగ్ ఎంఎల్ఏలు, మాజీ ఎంఎల్ఏలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్ధుల్లో కొందరి పేర్లుంటాయనట. మిగిలిన అభ్యర్ధుల పేర్లు రెండు, మూడో జాబితాలో ఉంటాయట. అత్యంత వివాదాస్పదమైన నియోజకవర్గాలను మూడోజాబితాలో చేర్చారట. గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు …
Read More »బీఆర్ఎస్ లో రివర్స్ సర్వే టెన్షన్
కేసీయార్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడేం మాట్లాడుతారో ఎప్పుడేం చేస్తారో కూడా ఎవరికీ తెలీదు. ఇపుడు విషయం ఏమిటంటే అభ్యర్ధులపై జనాల మనోభావాలు ఏమిటో తెలుసుకునేందుకు సర్వే బృందాలను నియోజకర్గాలకు పంపారట. మామూలుగా ఎవరైనా ఏమిచేస్తారంటే సర్వేలు చేయించుకుని ఆ తర్వాత అభ్యర్ధులను ప్రకటిస్తారు. కానీ ఇక్కడ కేసీఆర్ మాత్రం అభ్యర్ధులను ప్రకటించేసి జనాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు సర్వే బృందాలను రంగంలోకి దింపారు. అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేసే నిమ్మితం …
Read More »ఉత్తమ్ పట్టు.. రేవంత్ బెట్టు!
తెలంగాణ కాంగ్రెస్లో అనుకున్నదే జరుగుతోంది. టికెట్ల కోసం నేతల మధ్య వార్ అంతకంతకూ పెరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే టికెట్లు ఆశించే నాయకులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇక వీటిని వడబోసేందుకు ప్రదేశ్ ఎన్నికల కమిటీ సిద్ధమైంది. మొదటి సమావేశం కూడా నిర్వహించింది. కానీ ఫలితం మాత్రం శూన్యమనే చెప్పాలి. సీటుకు ముగ్గురి చొప్పున అభ్యర్థుల పేర్లను ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఎంపిక చేసి.. స్క్రీనింగ్ కమిటీకి అందజేసి చర్చిస్తారు. ఆ …
Read More »ఎన్నికలు ఎపుడొచ్చినా మోడీ ప్లాన్ సేమ్
రక్షాబంధన్ కానుకగా మహిళలకు నరేంద్రమోడీ ప్రభుత్వం తీపి కబురు చెప్పిందంటు బీజేపీ ఒకటే ఊదరగొడుతోంది. ఇంతకీ ఆ తీపికబురు ఏమిటంటే గ్యాస్ ధర 200 రూపాయలు తగ్గించిందట. అలాగే ఉజ్వల్ పథకంలో గ్యాస్ సిలిండర్ ను ఉపయోగిస్తున్న లబ్దిదారులకు ఏకంగా 400 రూపాయలు తగ్గిందని బీజేపీ నేతల సంబరాలు చేసుకుంటున్నారు. గ్యాస్ ధర తగ్గించటమంటే మోడీ కచ్చితంగా మహిళలకు ఇచ్చిన రక్షాబంధన్ కానుకే అంటున్నారు. కేంద్రప్రభుత్వం తీసుకన్న తాజా నిర్ణయం …
Read More »లోకేష్ పాదయాత్ర చూసి ఏడ్చాను:భువనేశ్వరి
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తన తండ్రి నారా చంద్రబాబునాయుడు, తల్లి నారా భువనేశ్వరి ఆశీర్వాదం తీసుకుని పాదయాత్రను లోకేష్ మొదలుబెట్టారు. ఆ సమయంలో నారా భువనేశ్వరి..లోకేష్ పాదయాత్ర దిగ్విజయం కావాలని ఆశీర్వదించి పంపించారు. ఆ తర్వాత లోకేష్ పాదయాత్రలో భువనేశ్వరి కూడా ఒకరోజు పాల్గొన్నారు. అయితే ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడలేదు. కానీ, తాజాగా కుప్పంలో …
Read More »బీజేపీతో పొత్తుపై తేల్చేసిన చంద్రబాబు
ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీకి అతిపెద్ద సమస్య జగన్ అని, విభజన గాయాల కంటే జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసిన గాయమే ఎక్కువ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఓడిపోతేనే రాష్ట్రం బాగుపడుతుందని …
Read More »పెద్ద ఆఫర్ పట్టేసిన కాంగ్రెస్
తెలంగాణ కాంగ్రెస్ పెద్ద ఆఫర్ పట్టేసినట్లు కనిపిస్తోంది. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నా నేపథ్యంలో వివిధ పార్టీల్లో నాయకుల చేరికల సందడి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా తమ పార్టీలోకి ఓ కీలక నాయకుడి ఎంట్రీతో పాటు బోనస్ గా న్యూస్ ఛానెల్, పేపర్ ను కూడా కాంగ్రెస్కు దక్కించుకోబోతుందని తెలిసింది. అసలు సంగతి ఏమిటంటే.. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి చేరేందుకు రంగం …
Read More »ధర్మ సందేహం.. ‘ధర్మాన’ స్వపక్షమా? విపక్షమా?
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలు గతంలో అధికార పార్టీని పలుమార్లు ఇరకాటంలో పడేసిన సంగతి తెలిసిందే. తెలిసి అంటారో…తెలియక అంటారో తెలియదుగానీ…ధర్మాన మాత్రం స్వపక్షంలో విపక్షం మాదిరిగా వైసీపీ ప్రభుత్వం గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి సొంత ప్రభుత్వంపై, పార్టీ నాయకత్వంపై ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. పార్టీ అధిష్టానంపై, పార్టీ నాయకత్వంపై వైసీపీ కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్న మాట …
Read More »హైదరాబాదులో ఛాయిస్.. ఢిల్లీలో ఫైనల్
తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఇంకా షెడ్యూల్ విడుదల కానప్పటికీ అభ్యర్థుల ప్రకటన, దరఖాస్తుల ప్రక్రియ, చేరికలు అంటూ పార్టీలన్నీ హడావుడి చేస్తున్నాయి. ఇప్పటికే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. రేసులో ముందుంది. ఇక అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్.. టికెట్లు ఆశించే వాళ్ల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇప్పుడు వీటిని వడబోసే కార్యక్రమం మొదలైంది. మొదట తెలంగాణలో ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఈ …
Read More »ఇండియా ముంబై భేటీకి సోనియా?
ముంబైలో జరగబోతున్న ఇండియా కూటమి సమావేశానికి సోనియాగాంధి హాజరవబోతున్నారు. ఈనెల 31వ తేదీన మొదలయ్యే రెండురోజుల సమావేశాలు చాలా కీలకం. అందుకనే కూటమిలోని కొన్నిపార్టీల అధినేతలు సోనియా హాజరవ్వాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అందుకు సోనియా కూడా సానుకూలంగా స్పందించారు. ఇంతకీ అంతటి కీలకం ఏముంటంది ? ఏమిటంటే ఇండియాకూటమి కోసం ప్రత్యేకంగా జెండాను(లోగో) తయారు చేయబోతున్నారట. అలాగే కన్వీనర్ పదవిపైన కూడా చర్చలు, నిర్ణయం ఉంటుంది. ఇంతటి కీలకమైన సమావేశం …
Read More »బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందా?
వివిధ పరిణామాల కారణంగా తెలంగాణాలో బీఆర్ఎస్ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది. ముఖ్యంగా అసెంబ్లీ అభ్యర్ధుల ప్రకటన తర్వాత మరింత స్పీడుగా పడిపోతోంది. రెండు వారాల్లోనే 3 శాతం మద్దతు పడిపోయింది. అన్నీపార్టీలకన్నా ముందుగా అభ్యర్ధులను ప్రకటించాలని కేసీయార్ అనుకున్నారు. దీనివల్ల చాలా లాభాలున్నాయనే అలా డిసైడ్ అయ్యారు. అనుకున్నట్లుగానే 119 నియోజకవర్గాల్లో 115 మంది అభ్యర్ధులను ప్రకటించేశారు. అయితే అలా ప్రకటించటమే ముందుముదు చాలా మైనస్ అయ్యేట్లుగా ఉందని ఇపుడు …
Read More »టార్గెట్ సోనియా?
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ఓడించేందుకు బీజేపీ ఇప్పటినుండే వ్యూహం రచిస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలి పార్లమెంటు స్ధానం నుండి సోనియా అప్రతిహతంగా గెలుస్తునే ఉన్నారు. ఇలాంటి నియోజకవర్గంలో సోనియాను ఓడించేందుకు బీజేపీ ప్రత్యేక వ్యూహాన్ని అమలుచేయబోతోంది. బీజేపీ తరపున పోటీచేయించబోయే అభ్యర్ధికోసం గట్టిగా గాలిస్తోంది. ఒక్క సోనియా అనే కాదు ప్రతిపక్షాల్లోని గట్టి అభ్యర్ధులు ఎవరు అనే విషయమై చర్చించేందుకు బీజేపీ ఒక సమావేశం నిర్వహించింది. బీజేపీ …
Read More »