Political News

రాస్కో సాంబ – రాబోయేది టీడీపీ-జేఎస్పీ గవర్నమెంటే

రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన పార్టీల సంయుక్త ప్రభుత్వం ఏర్పడుతుందని… జనసేన పార్టీ (జెఎస్‌పి) అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. వారాహి యాత్ర నాలుగో విడత యాత్ర లో భాగంగా ఆదివారం అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ 2024లో జరిగే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) ఓటమి ఖాయమని అన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని జేఎస్పీ ఎన్నికల్లో పోటీ …

Read More »

ఓటుకు నోటు కేసు : అక్టోబర్ 4వ తేదీన విచారణ

టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ నేప‌థ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు ఎంత వైరల్ అయ్యాయో ఇప్పటికే విన్నాం. ఈ నేపథ్యంలో మరో పరిణామం అందరినీ షాక్ కు గురిచేసింది. అప్పట్లో కొన్నేళ్ల కింద‌ట క‌ల‌క‌లం రేపిన ఓటుకునోటు కేసు విచార‌ణలో జాప్యం జ‌రుగుతోంద‌ని, సీబీఐతో విచారణ జరిపించాలని మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గ‌తంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేశారు. అయితే, ఓటు నోటు కేసు పిటిషన్ తాజాగా …

Read More »

ప‌వ‌న్ వారాహి యాత్రః ప్రభుత్వం పై పవన్ దండయాత్ర

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహి యాత్ర ఈరోజు క్రిష్ణా జిల్లాలో ప్రారంభమైన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టు తర్వాత, జనసేన పొత్తు ప్రకటించిన తర్వాత జరుగుతున్న వారాహి యాత్ర కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ ఏం మాట్లాడుతాడు అన్నదానిపై ఆసక్తి నెలకొని ఉంది. ఊహించినట్లే కృష్ణా జిల్లా అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో పవన్ ప్ర‌సంగం సంచలనంగా ఉంద‌ని విశ్లేష‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈరోజు పవన్ మాట్లాడుతూ …

Read More »

చంద్రబాబు అరెస్టు- జరిగిన డ్యామేజ్ తిరిగొస్తుందా?

చంద్రబాబు అరెస్టు మీద బీఆర్ఎస్ అగ్ర నాయకులు స్పందిస్తున్నారు. బాబు అరెస్టు దురద్రుష్టకరమని బీఆర్ఎస్ ప్రధాన నాయకుడు, మంత్రి హరీష్ రావు తాజాగా పేర్కొన్నారు. మరోవైపు చంద్రబాబు మాటెత్తని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. దివంగత ఎన్టీఆర్ ను మాత్రం కీర్తిస్తున్నారు. అయితే చంద్రబాబు అరెస్టు విషయంలో బీఆర్ఎస్ కు జరుగుతున్న డ్యామేజీని కవర్ చేసేందుకే హరీష్, కేటీఆర్ ఇలా రంగంలోకి దిగారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ నేరుగా …

Read More »

మేనమామకు టికెట్ ఇస్తే.. రంగంలోకి హీరో నితిన్

హీరో నితిన్ రాజకీయ ప్రచారం చేసే అవకాశముందా? కాంగ్రెస్ కు ఓట్లు వేయమని ఆయన ప్రజలను అడుగుతారా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే చెబుతున్నారు. నితిన్ మేనమామ నగేష్ రెడ్డికి వచ్చే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇచ్చే అవకాశం ఉండటమే అందుకు కారణమని చెప్పాలి. నగేష్ రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా పదేళ్లకు పైగా పని చేశారు. వచ్చే తెలంగాణ …

Read More »

ధర్మాన తప్పుకున్నట్లేనా ?

మంత్రి, సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు రాజకీయాల్లో నుండి తప్పుకుంటున్నారా ? ఆయన స్వయంగా చేసిన ప్రకటన చూసిన తర్వాత అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో తాను పోటీచేయటంలేదని స్పష్టంగా ప్రకటించారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుండి ధర్మాన ఇపుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికి చాలా కాలంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న కారణంగా ఇక ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయినట్లు ప్రకటించారు. అయితే తన నిర్ణయానికి …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ ను శాసిస్తున్న డీకే!

జాతీయ పార్టీలను నడిపించేది, దిశా నిర్దేశం చేసేది ఢిల్లీలోని అధిష్టానమే. రాష్ట్రాల్లో ఆయా జాతీయ పార్టీల కార్యకలాపాలు ఢిల్లీ కనుసన్నల్లోనే జరుగుతాయి. కాంగ్రెస్ లోనూ అంతే. కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం వేరేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే… తెలంగాణ టూ ఢిల్లీ వయా బెంగళూరు అన్నట్లు ఇక్కడి కాంగ్రెస్ రాజకీయాలు సాగుతున్నాయనే చెప్పాలి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లోని కీలక నాయకులు, …

Read More »

బండారు వ‌ర్సెస్ రోజా… అడ్డంగా బుక్క‌యిన వ‌ర్మ‌

టీడీపీ నాయ‌కుడు బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి వ‌ర్సెస్ మంత్రి ఆర్కే రోజా విష‌యంలో త‌లెత్తిన వివాదంలో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ వేలు పెట్టిన విష‌యం తెలిసిందే. బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి నోరు పారేసుకున్నార‌ని, ఒక మ‌హిళ గురించి ఎవ‌రైనా బ‌య‌టి వ్య‌క్తులు ఇలా మాట్లాడ‌తారా? అంటూ.. ఆయ‌న వ్యాఖ్యానించారు. అయితే, మ‌హిళ‌ల గురించి ఆర్జీవీ మాట్లాడ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. “మ‌హిళ‌ల ఆత్మ గౌర‌వం …

Read More »

అక్టోబరు 2న భువనేశ్వరి నిరాహార దీక్ష

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన సతీమణి నారా భువనేశ్వరితోపాటు కోడలు నారా బ్రాహ్మణి కూడా యాక్టివ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు మద్దతుగా చేపట్టిన పలు నిరసన కార్యక్రమాలలో అత్తాకోడళ్లు చురుగ్గా పాల్గొని ప్రభుత్వంపై పదునైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా భువనేశ్వరి అక్టోబరు 2న నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. …

Read More »

వారాహి యాత్రకు బాలకృష్ణ సంపూర్ణ మద్దతు

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో ఏపీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిన సంగతి తెలిసిందే. టీడీపీతో జనసేన పొత్తు వ్యవహారం ఓ కొలిక్కి రావడం, చంద్రబాబుకు బాసటగా టీడీపీతో కలిసి పోటీచేస్తానని పవన్ ప్రకటించడంతో అధికార పార్టీకి షాక్ తగిలినట్లయింది. ఈ క్రమంలోనే జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామని లోకేష్ కూడా ప్రకటించారు. మరోవైపు, అక్టోబరు 1వ తేదీ నుంచి నాలుగో విడత వారాహి యాత్రను పవన్ …

Read More »

అక్టోబ‌రు 4న రండి: నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు

ఏపీ సీఐడీ పోలీసులు.. టీడీపీ యువ‌నాయ‌కుడు, మాజీమంత్రి నారా లోకేష్‌కు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. శ‌నివారం ఉద‌యం ఢిల్లీకి చేరుకున్న సీఐడీ పోలీసులు నారా లోకేష్ కోసం వెతికిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ఎక్క‌డున్నార‌నే విష‌యంపై ఆరా తీశారు. అయితే, నారా లోకేష్ ఎక్క‌డ ఉన్నార‌నేది టీడీపీ బ‌య‌ట‌పెట్ట‌లేదు. ఈ క్ర‌మంలో అశోకా రోడ్డు 50 లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో లోకేష్ ఉన్న‌ట్టుగా తెలుసుకున్న …

Read More »

వారాహి విజయ యాత్ర.. ఈ సారి అదే ఆయుధం

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్ గా మారాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో పొలిటికల్ హీట్ రాజుకుంది. రిమాండ్ మీద బాబు జైల్లో ఉండటం.. లోకేష్ ను కూడా అరెస్టు చేస్తారనే ప్రచారం.. టీడీపీతో పొత్తును జనసేన అధినేత పవన్ ప్రకటించడం.. ఇలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడీ పొలిటికల్ హీట్ ను మరింత …

Read More »