Political News

రాహుల్ ఇంకా నేర్చుకోవాలేమో?!

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీకి రాజ‌కీయ పాఠాలు ఎక్క‌డా బోధ‌ప‌డిన‌ట్టు క‌నిపించడం లేదు. తాను ప‌ట్టిన ప‌ట్టుకోస‌మే ఆయ‌న ప‌ట్టుద‌ల‌తో ఉండ‌డంతో ప్ర‌జ‌లు రాహుల్ వైపు మొగ్గు చూపించ‌డం లేదన్న వాద‌న వినిపిస్తోంది. తాజాగా రెండు కీల‌క రాష్ట్రాల అసెంబ్లీల‌కు స‌హా ఇత‌ర 13 రాష్ట్రాల్లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ పేల‌వమైన ఓట్ల‌నే ద‌క్కించుకుంది. ఎక్క‌డా కూడా త‌లెత్తుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. మ‌హారాష్ట్ర‌లో …

Read More »

రేవంత్ రెడ్డి ప్రచారం పని చేయలేదు

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఇస్తూ, కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్రలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించడం దేశవ్యాప్తంగా ఎన్డీఏ శక్తిని చాటిచెప్పిందని వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, మహారాష్ట్రలో రాహుల్ గాంధీ విద్వేష ప్రచారం చేసినా, ప్రజలు వారి అబద్ధాలను …

Read More »

మళ్ళీ నిజమైన కేకే సర్వే..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేకే సర్వే అంచనాలకు దగ్గరగా ఉండడంతో హాట్ టాపిక్ గా మారింది. ఎన్డీయే కూటమి 225 స్థానాల్లో విజయం సాధిస్తుందని కేకే సర్వే స్పష్టంగా పేర్కొనగా, ఫలితాలు కూడా దాదాపు అదే విధంగా ఉండటం విశేషంగా మారింది. తెలుగు వ్యక్తి కేకే, తన అంచనాలతో జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో తెలంగాణ ఎన్నికల్లో ఆయన ఇచ్చిన సర్వే అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. …

Read More »

పవన్ లోకల్ కాదు నేషనల్

ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనల నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఏర్పడడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలకు వచ్చిన ఎంపీ సీట్లు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాయి. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ను ఆంధీ అంటూ ప్రధాని మోదీ కూడా ప్రశంసించారు. జాతీయ స్థాయిలో పవన్ ఇమేజ్ ను వాడుకోవాలని భావించిన మోదీ..మహారాష్ట్ర …

Read More »

మహారాష్ట్రపై కాదు..6 గ్యారెంటీలపై ఫోకస్ చేయి:కేటీఆర్

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ)ల మహా వికాస్ అఘాడీ ఘోర పరాజయం సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రచారాలు, ప్రసంగాలు, బ్యాగులు, ఛాపర్‌లు కాంగ్రెస్ పార్టీని ఘోర పరాజయం నుంచి కాపాడలేకపోయాయని కేటీఆర్ ఎద్ధేవా చేశారు. ఇకనైనా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి …

Read More »

‘మ‌హా’ విజ‌యంలో మోడీ రాజ‌కీయ ప్ర‌భ‌.. !

ఒక గెలుపు పార్టీకి ఎంతో బ‌లాన్నిస్తుంది. ఈ విష‌యంలో సందేహం లేదు. అయితే.. మ‌హారాష్ట్రలో బీజేపీ ద‌క్కించుకున్న సీట్లు, ఈ పార్టీ నేతృత్వంలోని మ‌హాయుతి కూట‌మి ద‌క్కించుకున్న విజ‌యం అప్ర‌తిహ‌తం. గ‌తానికి భిన్నంగా మ‌రాఠా ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకొన్న తీరును విమ‌ర్శ‌కులు సైతం అగీక‌రించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. కీల‌క‌మైన మ‌రాఠా నినాదం, విద‌ర్భ ప్ర‌త్యేక రాష్ట్ర డిమాండ్‌.. దీనికి మించి ఉల్లిపాయ‌ల రైతుల ఆందోళ‌న‌లు.. వంటివి రాష్ట్రాన్ని ఇరుకున ప‌డేశాయి. …

Read More »

చంద్ర‌బాబు ‘సాహ‌స’ యాత్ర‌..!

అదేంటి అనుకుంటున్నారా? ఏపీని వ‌దిలేసి సీఎం చంద్ర‌బాబు సాహ‌సాలు చేసేందుకు యాత్ర‌లు పెట్టుకున్నారా? అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారా? అయితే.. ఇది అలాంటి విన్యాసాల‌తో కూడిన యాత్ర కాదు. ఇది పొలిటిక‌ల్ సాహ‌స యాత్ర‌, అధికార సాహ‌స యాత్ర‌! తాజాగా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ముందు చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం పెట్టిన ప్ర‌తిపాద‌న‌లు చూస్తే.. ఇది సాహ‌స‌మేన‌ని ఒప్పుకోక త‌ప్ప‌దు. రెండు కీల‌క విష‌యాల్లో.. చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం …

Read More »

నొప్పింప‌క తానొవ్వ‌క అన్న‌ట్టుగా చంద్ర‌బాబు..!

కొన్ని కొన్ని విష‌యాలు చిత్రంగా ఉంటాయి. అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి ఏపీలో జ‌రిగింది. తాజాగా అమెరికాలో కేసులు న‌మోద‌య్యాయ‌ని, సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి భారీ ఎత్తున ముడుపులు ఇచ్చార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీ వ్య‌వ‌హారం.. దేశాన్ని కుదిపేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ వేడి ఇప్పుడు ఏపీని కూడా తాకింది. జ‌గ‌న్ సైతం ముడుపులు తీసుకున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. వాస్త‌వ నివేదిక ఎలా …

Read More »

ఫాలోవర్స్ 56 లక్షలు..ఓట్లు 146

ఈ సోషల్ మీడియా జమానాలో యూబ్యూటర్లు, ఇన్ స్టా ఇన్ ఫ్లూయన్సర్లు, బ్లాగర్లూ ఎక్కువయ్యారు. ఆయా మాధ్యమాల్లో ఎంత ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉంటే అంత క్రేజ్. ఆ క్రేజ్ వల్ల పాపులర్ అయి బిగ్ బాస్ కంటెస్టెంట్, సినిమాల్లో నటించే చాన్స్ కొట్టేసిన వారు కూడా ఉన్నారు. అయితే, ఆ క్రేజ్ వాడుకొని ఎన్నికల్లో గెలవాలనుకుంటే కుదరదన్న సంగతి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో స్పష్టమైంది. ఇన్‌స్ట్రాగ్రామ్‌ లో 56 …

Read More »

మహారాష్ట్ర గెలుపులో పవన్ ఎలివేషన్స్

మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి ఘన విజయాన్ని సాధించింది. ఈ ఎన్నికల ప్రచారంలో టాలీవుడ్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా సోలాపూర్‌లో నిర్వహించిన పవన్ ర్యాలీలు, రోడ్ షోలు అక్కడి ప్రజలను ఆకట్టుకోవడమే కాక, స్థానిక అభ్యర్థులకు బలమైన మద్దతు అందించాయి. తాజాగా సోలాపూర్ నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర రాజేష్ కోతే మీడియాతో మాట్లాడుతూ …

Read More »

ఆ ప‌దిమంది ఎమ‌య్యారు… వాయిస్ లేకుండా పోయిందా?

వైసీపీ ఎమ్మెల్యేల‌కు వాయిస్ లేకుండా పోయిందా? ఎక్క‌డా వారు క‌నిపించ‌క‌పోవ‌డానికి తాడేప‌ల్లిలోని కేంద్ర కార్యాల‌య‌మే కార‌ణ‌మా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీ విప‌క్షంలో ఉన్న‌ప్పు డు.. ఎమ్మెల్యేలు.. స‌భ‌కు వెళ్లి ప్ర‌భుత్వాన్ని నిల‌దీసేవారు. ఆ త‌ర్వాత‌.. వారే.. బ‌య‌ట‌కు వ‌చ్చి.. మీడియా ముందు నిప్పులు చెరిగేవారు. దీంతో టీడీపీ స‌భ్యుల వ్య‌వ‌హారం ప్ర‌జ‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చేది. వారు ఏం చేస్తున్నారో ప్ర‌జ‌ల‌కు తెలిసేది. మీడియాలో కూడా వ‌చ్చేది. …

Read More »

సీఎం సీటుకు కుస్తీలు.. మ‌హారాష్ట్ర‌లో హీటెక్కిన పాలిటిక్స్‌!

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న బీజేపీ కూట‌మి మ‌హాయుతి సంబ‌రాల్లో మునిగిపోయింది. కార్య‌క‌ర్త‌లు, ద్వితీయ శ్రేణి నాయ‌కులు పెద్ద ఎత్తున పండ‌గ చేసుకుంటున్నారు. 288 స్థానాల‌కు గాను ఏక‌ప‌క్షంగా ఈ కూట‌మి 210 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంది. మ‌రోవైపు ఇంకా కౌంటింగ్ జ‌రుగుతోంది. దీంతో అధికారం ఎవ‌రిద‌నేది స్ప‌ష్ట‌మైంది. అయితే.. కార్య‌క‌ర్త‌లు, ద్వితీయ శ్రేణి నాయ‌కులు సంబ‌రాల్లో మునిగిపోతే.. కీల‌క నాయ‌కులు మాత్రం కుస్తీలు ప‌డుతున్నారు. ముఖ్య‌మంత్రి …

Read More »