Political News

చంద్ర‌బాబుకు ‘ఆద‌ర‌ణ’ జోష్ .. !

ఏపీ సీఎం చంద్ర‌బాబు చేప‌డుతున్న వినూత్న ప‌థ‌కాలు.. కార్య‌క్ర‌మాలు ఆయ‌న‌తోపాటు రాష్ట్రంలో పార్టీకి, ప్ర‌భుత్వానికి కూడా జోష్ పెంచుతున్నాయి. ఇప్ప‌టికే చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు.. ఇస్తున్న పింఛ‌న్లు, ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు వంటివి స‌ర్కారు గ్రాఫ్‌ను పైపైకి తీసుకువెళ్లాయి. ఇక‌, అన్నా క్యాంటెన్ల నిర్వ‌హ‌ణ‌తో స‌ర్కారు దూకుడుకు మ‌రిన్ని మంచి మార్కులు సైతం ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ప్ర‌జ‌ల నుంచి రెండు ర‌కాల డిమాండ్లు వినిపిస్తున్నాయి. 1) కులాల వారీగా …

Read More »

జ‌గ‌న్‌.. 2 వేల కోట్లు దుబాయ్‌లో దాచారు: లావు

మద్యం కుంభకోణం…దేశ రాజదాని డిల్లీలో ఆప్ సర్కాను కుప్పకూల్చేసింది. ఇటు తమిళనాడులో అదికార డీఎంకేను ఆత్మ రక్షణలో పడేసింది. ఈ రెంటికి మధ్య అదికారం నుంచి దిగిపోయిన ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీని నేరుగా బోను ఎక్కించేలానే ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా… సోమవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన ప్రసంగం వింటే వైసీపీ త్వరలోనే పెను చిక్కులను ఎదుర్కోక తప్పదని చెప్పాలి. …

Read More »

బోరుగ‌డ్డ.. స‌మాజానికి ప్ర‌మాద‌క‌రం: హైకోర్టు

వైసీపీ నాయ‌కుడు బోరుగ‌డ్డ అనిల్ కుమార్‌కు మ‌రో ఉచ్చు బిగిసుకుంది. తాజాగా హైకోర్టు ఆయ‌న‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. ‘తాము క‌ళ్లుమూసుకుంటే.. ఇంకా ఆడిస్తారు’ అంటూ.. బోరుగడ్డ త‌ర‌ఫు న్యాయ‌వాదిని ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. సోష‌ల్‌ మీడియాలో సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌ను ఉద్దేశించి గ‌తంలో బోరుగ‌డ్డ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. బండ బూతుల‌తో విరుచుకుప‌డ్డారు. ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించారు. ఇళ్ల‌లోని మ‌హిళ‌ల‌ను కూడా కించ‌ప‌రిచారు. …

Read More »

బాబు చెప్పినట్టే… ఉద్యోగుల బకాయిలన్నీ క్లియర్

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఒక్కసారి చెబితే నిజంగానే వంద సార్లు చెప్పినట్టే. అదేదో సినిమా డైలాగ్ లా స్ఫూరించినా…చంద్రబాబు మాట చెప్పారంటే అది జరిగి తీరుతుంది. ప్రభుత్వ పాలనలో కీలక భూమిక పోషిస్తున్న ఉద్యోగుల విషయంలో చంద్రబాబు మరింత శ్రద్ధగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా ఇట్టే స్పందిస్తున్న చంద్రబాబు.. గతంలో వారికి దక్కకుండాపోయిన సర్కారీ నిధులను కూడా విడుదల చేస్తున్నారు. …

Read More »

తెలంగాణ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ.. కీల‌క చ‌ర్చ‌లు!

తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు సిద్ధ‌మైందా? ఆ దిశ‌గా వ‌డివ‌డిగా చ‌ర్య‌లు తీసుకునేందుకు రెడీ అయిందా? అంటే .. తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్రంలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేయాల‌న్న‌ది కొన్నాళ్లు గా వినిపిస్తున్న డిమాండ్‌. సుమారు నాలుగు నుంచి ఐదు కీల‌క శాఖ‌లు.. సీఎం రేవంత్‌రెడ్డి చేతిలోనే ఉన్నాయి. పైగా కీల‌కమైన హోం శాఖ కూడా ఆయ‌న చెంత‌నే ఉంది. ఈ నేప‌థ్యంలో …

Read More »

ఏపీకి అంతర్జాతీయ వర్సిటీ వచ్చేసింది!

తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కనీసం రాజధాని కూడా లేకుండానే సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించిన ఏపీ… టీడీపీ నేతృత్వంలో అన్నీ సమకూరిపోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రానికి నూతన రాజధానిగా ఎంపిక అయిన అమరావతికి నిధులే కాదు… విద్యాలయాలు కూడా క్యూ కడుతున్నాయి. ఇప్పటికే దేశంలోని ప్రసిద్ధ విద్యా సంస్థల్లో కొన్ని తమ క్యాంపస్ లను అమరావతిలో ఏర్పాటు చేశాయి. ఫలితంగా భవిష్యత్తులో అమరావతితో పాటుగా ఏపీ కూడా విద్యా …

Read More »

20 ల‌క్ష‌ల ‘బంగారు కుటుంబాలు: ల‌క్ష్యం ప్ర‌క‌టించిన‌ చంద్ర‌బాబు

విజ‌న‌రీ ముఖ్య‌మంత్రిగా పేరున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా మ‌రో కీల‌క ల‌క్ష్యాన్ని ప్ర‌క‌టించారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల ‘బంగారు కుటుంబాల‌ను’ త‌యారు చేయాల‌ని నిర్దేశించుకున్న‌ట్టు తెలిపారు. ప్ర‌భుత్వ ప్ర‌తిపాదిత పీ-4(ప‌బ్లిక్‌-ప్రైవేటు-పీపుల్స్‌-పార్ట‌న‌ర్ షిష్‌) ప‌థ‌కాన్ని ఈ ఉగాది నుంచి ప్రారంభిస్తున్న‌ట్టు చెప్పారు. దీనిలో భాగంగా ఏడాది కాలంలో 20 ల‌క్ష‌ల పేద కుటుంబాల‌ను సంప‌న్న కుటుంబాలుగా త‌యారు చేయాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించుకున్న‌ట్టు వివ‌రించారు. దీనికి అధికాదాయ వ‌ర్గాలు, …

Read More »

ఎంపీల‌కు చేతినిండా డ‌బ్బు.. మోడీ కీల‌క నిర్ణ‌యం!

ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంటు స‌భ్యుల‌కు మ‌రోసారి వేత‌నాలు పెంచింది. రెండేళ్ల కింద‌ట ఒక‌సారి వేత‌నాలు పెంచిన కేంద్రం.. తాజాగా మ‌రోసారి 24 శాతం మేర‌కు వారికి వేత‌నాలు పెంచుతూ.. ఉత్త‌ర్వులు జారీ చేసింది. ద్ర‌వ్యోల్బ‌ణం ఆధారంగా ఈ వేత‌నాలు పెంచుతున్న‌ట్టు కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. పెంచిన వేత‌నాలు.. గ‌త ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపింది. …

Read More »

ఫ‌ర్లే.. రోడ్డుందిగా: ఏపీ ప్ర‌జ‌ల్లో ఎంత మార్పు.. !

ఏపీ ప్ర‌జ‌ల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అయితే.. ఇది అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల్లోనా.. లేక‌, కొంద‌రిలోనేనా అనే విష‌యాన్ని పక్క‌న పెడితే.. ప్ర‌స్తుతం మెజారిటీ ప్ర‌జ‌లు కూట‌మి స‌ర్కారు తీరుపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. వాస్త‌వానికి ప్ర‌తిప‌క్షం వైసీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరిగింద‌ని.. ఇచ్చిన హామీలు అమలు చేయ‌డం లేద‌ని పెద్ద ఎత్తున ఆరోపిస్తోంది. ఇది కొంత వాస్త‌వ‌మే అయినా.. ప్ర‌జ‌ల్లోనూ మార్పు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం సూప‌ర్ సిక్స్‌లో …

Read More »

ఢిల్లీ లో రేవంత్… ఆ సారైనా గ్రీన్ సిగ్నల్ లభించేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం దేశ రాజధాని డిల్లీ చేరుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి బయలుదేరిన రేవంత్…ఇప్పటికే ఢిల్లీలో ఉన్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను కూడా తమ బృందంతో కలుపుకుని కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలతో భేటీ కానున్నారు. ఈ భేటీపై కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కేబినెట్ లో ఇంకో …

Read More »

పార్లమెంటులో ‘అరకు’!… ఒకటి కాదు, రెండు స్టాళ్లు!

ఏపీ గిరి పుత్రులు పండిస్తున్న సేంద్రీయ అరకు కాఫీ రుచులు విశ్వవ్యాప్తంగా విస్తరించాలన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంకల్పంలో సోమవారం ఓ కీలక ఘట్టం పూర్తి అయ్యింది. చంద్రబాబు కృషితో ఇప్పటికే అరకు కాఫీకి జియో ట్యాగ్ గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే. తాజాగా భారత అత్యున్నత చట్టసభ పారమెంటులోకి అరకు కాఫీ సగర్వంగా ఎంట్రీ ఇచ్చింది. సోమవారం పార్లమెంటు ఆవరణలోని లోక్ సభ, రాజ్యసభ …

Read More »

జగన్ ‘గడప’పై టీడీపీ జెండా ఎగరబోతోందా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గడపగా ముద్రపడ్డ కడపలో వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లాలో విపక్ష కూటమి దాదాపుగా క్లీన్ స్వీప్ చేసినంత పనిచేసింది. ఇప్పుడు కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని చేజిక్కించుకునే దిశగా టీడీపీ మొదలుపెట్టిన చర్యలు వైసీపీని వణికిస్తున్నాయని చెప్పక తప్పదు. టీడీపీ చర్యలతో బెంబేలెత్తిపోయిన వైసీపీ తన జడ్పీటీసీలను ఇప్పటికే బెంగళూరులో ఏర్పాటు చేసిన …

Read More »