ఆయన వయసు 72 ఏళ్లు. నిజానికి రిటైర్మెంట్ వయసు ఎప్పుడో దాటిపోయింది. పైగా ఆయన ఐఏఎస్‌గా చేసి రిటైరయ్యారు. అయినా.. ప్రజలు ఆయనకే పట్టం కట్టారు. ఆయన నేతృత్వంలోని పార్టీనే ఎన్నుకున్నారు. దీనికి కారణం.. శషభిషలు లేకుండా.. వెనుక ముందు.. స్వలాభం కోసం చూసుకోకుండా.. రాష్ట్ర సమస్యలపై నిక్కచ్చిగా వ్యవహరించారు. మోడీ మిత్రుడే అయినా.. రాష్ట్రం విషయం వచ్చే సరికి కాలు దువ్వారు. నువ్వెంత? అన్నట్టుగా వ్యవహరించారు. రాష్ట్ర ప్రయోజనాలు, …
Read More »పొంగులేటి చాలెంజ్ నిలుపుకున్నారా ?
తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసులరెడ్డి తన చాలెంజ్ ను నిలుపుకున్నారు. ఎన్నికలకు ముందు దాదాపు రెండు నెలల క్రితమే కేసీయార్ ను ఉద్దేశించి పొంగులేటి ఒక చాలెంజ్ చేశారు. అదేమిటంటే ఖమ్మం జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ ను గెలవనివ్వనని. తాజాగా వెల్లడైన పలితాల్లో జిల్లాలోని పది నియోజకవర్గాల్లో తొమ్మిది చోట్ల కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐలే గెలిచాయి. కేవలం ఒకే ఒక్క నియోజకవర్గం భద్రాచలంలో మాత్రం …
Read More »ఈటల తప్పుచేశారా ?
బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ తప్పుచేశారనే అనిపిస్తోంది. రెండోచోట్ల పోటీచేయటమే ఆ తప్పు. తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ తో పాటు కేసీయార్ సొంత నియోజకవర్గమైన గజ్వేలులో కూడా పోటీచేశారు. హుజూరాబాద్ లో గెలుపు మీద నమ్మకంతోనే గజ్వేలులో కేసీయార్ పై తొడకొట్టారు. బహుశా ఈటల ఉద్దేశ్యంలో గజ్వేలులో కేసీయార్ ను టెన్షన్ కు గురిచేయటమే అయ్యుండచ్చు. గెలుపు మీద ఆశలు కన్నా గజ్వేలు వదిలేసి ఇతర నియోజకవర్గాల్లో …
Read More »కాంగ్రెస్ విజయం వెనుక మాస్టర్ మైండ్.. ఎవరంటే!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం వెనుక ఎవరున్నారు? ప్రత్యక్షంగా రేవంత్ కనిపిస్తున్నా.. తెరవెనుక ఉన్నది సునీల్ కనుగోలు. ఆయన వ్యూహంతోనే హ్యాట్రిక్ కొట్టాలన్న అధికార బీఆర్ఎస్ పార్టీకి భంగపాటు తప్పలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ఓడిపోవడం ఇదే మొదటిసారి. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా ట్యాగ్ లైన్ ను సొంతం చేసుకున్న సీఎం కేసీఆర్ వంటి రాజకీయ దిగ్గజాన్ని గద్దె దింపిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతమైంది. కాంగ్రెస్ …
Read More »కేసీఆర్ అనధికార రిటైర్మెంట్?
మొత్తానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లే కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగురవేసింది. ఆ పార్టీ స్పష్టమైన ఆదిక్యం సంపాదించడంతో టీఆర్ఎస్ కథ ముగిసింది. ఇరు పార్టీలకు సమాన సీట్లు వస్తే ఎంఐఎం మద్దతుతో.. ఎమ్మెల్యేల కొనుగోలుతో టీఆర్ఎసే అధికారంలోకి రావచ్చన్న అంచనాలు కూడా ఫలించలేదు. టిఆర్ఎస్ చాలా దూరంలో ఆగిపోయింది. కాంగ్రెస్ అధికారానికి అవసరమైన సీట్లు సొంతంగా సాధించింది. చాలా ముందుగానే ఫలితం …
Read More »ఈ నెలలోనే యువగళం ముగింపు!
టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కొన్ని సమస్యల కారణంగా.. వాయిదా పడి.. మళ్లీ గత నెల 27 నుంచి తిరిగి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో కొనసాగుతోంది. అయితే..ఈ యాత్ర షెడ్యూల్ ప్రకారం ఇచ్చాపురంలో పూర్తికావాలి. సుమారు 4 వేలకిలోమీటర్ల లక్ష్యం సాధించాలి. ఇదే విషయాన్ని యాత్ర ప్రారంభంలో చెప్పుకొచ్చారు. దీని ప్రకారమే యాత్ర కూడా వడివడిగా …
Read More »బండిని కాదని.. బీజేపీ పావుకున్నదేంటి?
కీలక నాయకుడు.. పార్టీని పరుగులు పెట్టించిన ఫైర్ బ్రాండ్‌ను పక్కన పెట్టిన బీజేపీ.. దానికి సంబంధించిన మూల్యాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లించుకుందనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి 2018లో పార్టీకి ఏమీలేదు. కేవలం ఒకే ఒక్కస్థానం .. ఘోషా మహల్ నుంచి రాజాసింగ్ గెలుపు తప్ప.. ఇంకేమీ లేదు. అలాంటి కమలం పార్టీని.. పుంజుకునేలా చేసింది బండి సంజయ్. మూడు ప్రధాన ఉప ఎన్నికలు, కీలకమైన హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని …
Read More »బీఆర్ ఎస్ ఓటమి.. నెటిజన్ల లెక్కలు ఇవే!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరుతామని.. ఆగం కావద్దని పదే పదే చెప్పిన బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు.. ప్రజలు భారీ షాకే ఇచ్చారు. కనీసం ఏదో ఒక రకంగా.. అయినా అధికారం నిలబెట్టుకునేందు కు అవకాశం లేని రీతిలో తీర్పు చెప్పారు. దీంతో తెలంగాణను తెచ్చిన వీరుడికి.. ఓటమిని ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఈ ఓటమికి కారణాలేంటి? అనేది ఇంకా.. ఆ పార్టీ వెల్లడించకపో యినా.. …
Read More »రేపే సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం?
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించి సత్తా చాటిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను దాటిన కాంగ్రెస్ సొంతగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ కు దీటుగా స్థానాలు గెలుస్తుందని ఆశించిన బీఆర్ఎస్ 39 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 9వ తారీఖున సీఎంగా …
Read More »తెలంగాణ రిజల్ట్.. చంద్రబాబు అభిమానుల ముఖ చిత్రమేంటో!
తెలంగాణ ప్రజాతీర్పు.. కాంగ్రెస్ వైపే మొగ్గు చూపింది. ఇదిలావుంటే.. టీడీపీ అభిమానులు, ముఖ్యంగా చంద్రబాబు అభిమానుల తీరు ఎలా ఉంది? అనేది ఆసక్తిగా మారింది. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. బహిరంగంగా ఏ పార్టీకీ మద్దతు కూడా ప్రకటించలేదు. అయితే.. అంతర్గత చర్చల్లో మాత్రం కాంగ్రెస్‌కు టీడీపీ అనుకూల భావన వైరల్ అయింది. పైగా.. రేవంత్‌రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ.. ఆ పార్టీని నడిపించినప్పటికీ.. …
Read More »తోట చంద్రశేఖర్ ఐరన్ లెగ్గా..? : నెటిజన్ల ట్రోల్స్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచితీరుతామని ఎంతో కాన్ఫిడెంట్‌గా ప్రకటించిన బీఆర్ ఎస్ ఓడిపోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తమను ఏమీ చేయలేవని.. ప్రజల్లో బీఆర్ ఎస్ పట్ల అనుకూలత, సానుకూలత ఉందని సీఎం కేసీఆర్ నుంచి మంత్రి కేటీఆర్ వరకు అందరూ చెప్పారు. అయినా.. పార్టీ ఓడిపోయింది. అయితే.. దీనిపై నెటిజన్లు ఆసక్తికర విషయాన్ని వెలుగు లోకి తెచ్చి.. ట్రోల్స్ చేస్తున్నారు. “పార్టీలో ఐరన్ లెగ్ కాలుపెట్టింది. అందుకే …
Read More »తెలంగాణ డీజీపీపై ఈసీ వేటు.. సస్పెండ్ చేసిన ఎన్నికల సంఘం
తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్.. డీజీపీ .. అంజనీకుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ స్థాయిలో ఉన్న అధికారి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. దీంతో తెలంగాణ పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏంటీ కారణం? …
Read More »