Political News

విప‌త్తుల్లోనూ విజ‌న్‌.. తగ్గేదే లేదు అంటున్న చంద్రబాబు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే విజ‌న్‌కు పరాకాష్ఠ‌. ఆయ‌న దూర‌దృష్టి.. భ‌విష్య‌త్తును ముందుగానే ఊహించ‌డం.. దానికి త‌గిన ప్ర‌ణాళిక‌లు వేసుకుని ముందుకు సాగ‌డం తెలిసిందే. ఆయ‌న వేసిన బాటలు.. ఇప్పుడు మ‌న‌కు క‌నిపించ‌క‌పోవ‌చ్చు.. కానీ, ఓ ప‌దేళ్ల త‌ర్వాత వాటి తాలూకు ఫ‌లాలు, ఫ‌లితాలు.. ప్ర‌జ‌లకు చేరువ అవుతాయ‌న‌డంలో సందేహం లేదు. ఈ విష‌యంలో సైబరాబాద్‌, హైద‌రాబాద్‌లే ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణ‌. అప్ప‌ట్లో ఆయ‌న వేసిన అడుగులు ఇప్ప‌టికీ.. ప్ర‌జ‌లకు మేలు …

Read More »

`సారీ`కి సిద్ధం.. ప‌వ‌న్ మాట నెర‌వేర్చుతున్న టీటీడీ సభ్యులు!

తిరుప‌తిలో చోటు చేసుకున్న తొక్కిస‌లాట‌లో ఆరుగురు మృతి చెందిన విష‌యం తెలిసిందే. అదేవిధంగా 38 మంది గాయ‌ప‌డ్డారు. వీరిలో మ‌రో ఏడుగురు తీవ్రంగా 31 మంది స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. అయితే.. ఈ ఘ‌ట‌న‌కు నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని పేర్కొన్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు కోరారు. అదేవిధంగా టీటీడీ అధికారులు కూడా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్నారు. ఇక‌, టీటీడీ బోర్డు స‌భ్యులు.. బాధితుల కుటుంబాల వ‌ద్ద‌కు వెళ్లి.. …

Read More »

ఏరికోరి తెచ్చుకున్న సుబ్బారాయుడికి దిమ్మ తిరిగే షాకిచ్చిన బాబు

ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా అభిమానించే వారికి సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిన్నటివరకు ఆయన మంచితనం చేతకానితనంగా… పెద్దరికం… చాదస్తంగా మారిపోయింది అనే భిన్నాభిప్రాయాలను వ్యక్తపరిచారు కొందరు. చర్యల కత్తి ఝుళిపిస్తే తప్పించి మాట వినని వ్యవస్థలను గాడిలోకి పెట్టాలంటే.. అందుకు తగ్గట్లే వ్యవహరించాలే తప్పించి.. చూసిచూడనట్లుగా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుందన్న నిజాన్ని …

Read More »

బీజేపీతో జగన్ ది అక్రమ బంధం: వైఎస్ షర్మిల

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను కించపరిచేలా మాట్లాడిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వైఖరికి నిరసనగా ఆమె ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన అమిత్ షా తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అమిత్ …

Read More »

బీరు కరువు తప్పేలా లేదు

తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిచిపోయింది. గడచిన రెండు రోజులుగా ఈ బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ నుంచి తెలంగాణ బ్రూవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్)కు బీర్ల సరఫరా జరగడం లేదు. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే… తెలంగాణలో ఎక్కడ కూడా కింగ్ ఫిషర్ బీర్లు దొరికే …

Read More »

అరస్ట్.. కేటీఆర్ అనుకున్నట్టు జరగలేదు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ భయంతో దాదాపుగా అల్లాడిపోయారనే చెప్పాలి. ఫార్ములా ఈ కారు రేసులకు సంబంధించి తనపై కేసు నమోదు కాగానే… తన అరెస్ట్ ఖాయమంటూ కేటీఆర్ ఓ అంచనాకు వచ్చేశారు. ఈ కారణంగానే తన అరెస్ట్ గురించి ఆయన పదే పదే ప్రస్తావించారు. అంతేకాకుండా అరెస్ట్ చేస్తే తానేమీ భయపడిపోనంటూ కూడా కేటీఆర్ పదే పదే చెప్పడమూ కనిపించింది. …

Read More »

చంద్రబాబు, జగన్… విదేశాలకు ఇద్దరూ ఒకేసారి

YS-Jagan-Chandrababu-Naidu

ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ… రాష్ట్ర రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా కీచులాడుకుంటున్న ఈ ఇద్దరు నేతలు కలిసే ఫారిన్ ట్రిప్ కు వెళుతున్నారా? అనుకోకండి. ఎందుకంటే… జగన్ పర్సనల్ పని మీద ఫారిన్ ట్రిప్ వెళుతుంటే… చంద్రబాబు మాత్రం సీఎం హోదాలో అదికారిక పర్యటనకు బయలుదేరుతున్నారు. ఇక ఇద్దరూ ఒకే సమయంలో విదేశాలకు వెళుతున్నా…వారి …

Read More »

ప‌వ‌న్‌కు చిర్రెత్తుకొచ్చిన వేళ‌.. !

డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్ప‌లు మామూలుగా ఉండ‌డం లేదు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా.. వారికి స‌ర్ది చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. కార్యాకార‌ణ సంబంధంతో నిమిత్తం లేకుండానే.. కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ఆయ‌న ప్రోగ్రామ్స్‌కు రావ‌డం.. చిరాకు తెప్పించ‌డం స‌హ‌జంగా మారిపోయింది. దీంతో ప‌లు సంద‌ర్భాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. తాజాగా తిరుప‌తిలో జ‌రిగిన తొక్కిస‌లాటలో బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు …

Read More »

తిరుప‌తి తొక్కిస‌లాట‌: జ‌గ‌న్ కామెంట్స్ ఇవే!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం త‌న‌కు భ‌య‌ప‌డుతోంద‌ని వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌కు భ‌య‌ప‌డుతున్న కార‌ణంగానే పోలీసులను ముందు పెట్టి త‌న‌ను తిరుప‌తికి రాకుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. తిరుప‌తిలో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డిన వారిని ఆయ‌న స్విమ్స్‌లో ప‌రామ‌ర్శించారు. సుదీర్ఘంగా వారితో మాట్లాడారు. ఒక్కొక్క బాధితుడి వ‌ద్ద 5 నుంచి 10 నిమిషాల సేపు ఉన్నారు. అనంత‌రం.. జ‌గ‌న్ మీడియాతో …

Read More »

ఒకే చోట ప‌వ‌న్‌-జ‌గ‌న్ ఎదురు పడ్డ వేళ‌!

ఏపీ రాజ‌కీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్య‌వ‌హ‌రించే జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌లు ఎదురు ప‌డితే ఎలా ఉంటుంది? ఏం జ‌రుగుతుంది? అదే గురువారం సాయంత్రం జ‌రిగింది. తిరుప‌తి తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డి స్విమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న వారిని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ గురువారం సాయంత్రం 7 గంట‌ల స‌మ‌యంలో ప‌రామ‌ర్శిం చారు. వారి ఆవేద‌న‌ను పంచుకున్నారు. అయితే.. ఇదేస‌మ‌యంలో …

Read More »

క్షమించండి… పబ్లిక్ గా సారీ చెప్పిన పవన్

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన వైనం యావత్తు సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం భక్తులు ఎగబడిన నేపథ్యంలో బుధవారం రాత్రి తిరుపతిలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోగా… 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

ఇద్దరిపై సస్పెన్షన్… ముగ్గురిపై బదిలీ వేటు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునేందుకు వచ్చి భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఘటనకు కారకులైన 2 మంది అధికారులపై చర్యలు తీసుకుంటూ సీఎం నారా చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు. భక్తుల రద్దీపై నియంత్రణ లేకుండా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీ రమణ కుమార్ సహా, బాధ్యత మరచి వ్యవహరించిన గోశాల డైరెక్టర్ హరినాధ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు …

Read More »