ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు సొంత చెల్లి షర్మిలతో చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుందా? ఇక ఏపీలో పార్టీ ఆపరేషన్ మొదలెట్టేందుకు సిద్ధమైందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తెలంగాణలో అధికారం కోసం ప్రణాళికాబద్ధంగా సాగిన కాంగ్రెస్ లక్ష్యాన్ని చేరుకుంది. ఇప్పుడు ఫోకస్ ను పక్కనే ఉన్న ఏపీపైకి షిప్ట్ చేసింది. మరో మూణ్నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు …
Read More »జనసేన వర్సెస్ కాపులు.. ఏం జరుగుతుంది..
రాష్ట్రంలో కీలక రాజకీయంగా మారిన వ్యవహారం జనసేన వర్సెస్ కాపులు. వచ్చే ఎన్నికల్లో కాపులు జన సేనకు మద్దతుగా ఉంటున్నారా? ఉండడం లేదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాపుల అభిప్రాయాలు తెలుసుకోవడంలోనూ.. వారి నాడిని పట్టుకోవడంలోనూ జనసేన అధినేత పవన్ విఫలమ య్యారా? అనేది కూడా ఆసక్తిగా మారింది. జనసేన పార్టీనిస్థాపించి పదేళ్లు దాటిపోయాయి. అయినప్పటి కీ.. ఇప్పటికీ సిద్ధాంతంలో రాద్ధాంతం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా పార్టీ అదినేత …
Read More »ఔను.. ఆ రెండు వర్గాలు మాకు దూరమయ్యాయి
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఓటమి గురించి.. ఆయన తాజాగా ప్రస్తావించారు. రాష్ట్రంలోని రెండు వర్గాలు బీఆర్ ఎస్‌కు దూరమయ్యాయని, ఇదే తమకు ఎన్నికల్లో ఓటమికి కారణమై ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆ రెండు వర్గాలే..ఉద్యోగులు, నిరుద్యోగులు అని కేటీఆర్ చెప్పారు. వాస్తవానికి బీఆర్ ఎస్ పాలన.. ఉపాధి అవకాశాలకు గనిగా మారింది. …
Read More »తమతో పాటు వారసులకూ టికెట్లు కావాలి
ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలన్నా ప్రణాళిక లేదు.. పార్టీ పుంజుకోవడానికి ఏం చేయాలనే ఆలోచన లేదు.. కానీ ఎన్నికల్లో మాత్రం కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ మాత్రం చేస్తున్నారు. ఇదీ కొంతమంది టీడీపీ నేతల తీరుగా మారిందని ఆ పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. కుటుంబంలో ఒక్కరికి టికెట్ ఇస్తే సరిపోదని ఈ నాయకులు తెగేసి మరీ చెబుతున్నారని తెలిసింది. శ్రీకాకుళంలో టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావుకు …
Read More »లోకేష్ కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్..జగన్ కు షాక్
కొంతకాలంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిలల మధ్య విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే ఇడుపులపాయలో తమ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్ధంతి సందర్భంగా అన్నాచెల్లెళ్లు విడివిడిగానే నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా షర్మిల చేసిన పనితో ఆ విభేదాలు మరింత ముదిరాయని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో జగన్ వర్సెస్ లోకేష్ అన్న రీతిలో మాటల …
Read More »క్లీన్ స్వీప్ జిల్లాల్లో వైసీపీ పరిస్థితేంటి..
2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ.. నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాలను క్లీన్ స్వీప్ చేసింది. అటు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఇటు పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ వైసీపీ విజయ ఢంకా మోగించింది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఈ జిల్లాల్లో తన ఆధిపత్యాన్ని వైసీపీ నిలబెట్టుకుంటుందా? అనేది చర్చనీయంశంగా మారింది. ఎందుకంటే.. ఈ మూడు జిల్లాల్లోనూ మునుపటికిఇప్పటికి పరిస్థితి మారిపోయిందని అంటున్నారు పరిశీలకులు. నెల్లూరు: 2019లో ఉన్న ఐక్యత ఇప్పుడు వైసీపీలో లేదు. …
Read More »వాసుపల్లికి.. సహకారం నై.. తేల్చేసిన నేతలు!
ఆయన పార్టీ మారిన ఎమ్మెల్యే. ముందు అంతా ఫీల్ గుడ్. పార్టీ మారే వరకు అందరూ ఆహా.. ఓహో అన్నవారే. కానీ, రోజులు గడిచి ఎన్నికలకు సమయం చేరువ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ వారే.. ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు. సహకరించేందుకు మొహం చాటేస్తున్నారు. ఆయనే విశాఖపట్నం జిల్లా దక్షిణ నియోజకవర్గం నుంచి 2019లో టీడీపీ టికెట్‌పై గెలిచిన వాసుపల్లి గణేష్. ప్రస్తుతం ఆయన వైసీపీలో ఉన్నారు. తన కుమారుడితో …
Read More »ప్రపంచాన్ని ఉజ్జయిని కాలమానం చుట్టూ తిప్పుతా
దేశంలో మోడీ ప్రభుత్వం బ్రిటీష్ కాలం నాటి చట్టాలను.. అప్పటి శాసనాలను మారుస్తూ.. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే.. ఐపీసీ.. సీఆర్ పీసీ.. వంటి కీలకమైన మూడు చట్టాలను పూర్తి గా మార్చేసి.. భారతీయతను జోడిస్తూ.. భారతీయ న్యాయసంహిత, భారతీయ సాక్ష్య అధినియం వంటి చట్టాలను తీసుకువచ్చింది.(వీటిని పార్లమెంటు ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సి ఉంది) ఇక, ఇప్పుడు ప్రపంచ కాలమానాన్ని మార్చే పనిపై దృష్టి పెట్టింది. …
Read More »ఎన్నికలకు ముందు ఆఖరిసారి కుప్పానికి..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పానికి ఇటీవల కాలంలో తరచుగా వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో ఏకంగా ఎనిమిది సార్లు ఆయన(అరెస్టుకు ముందు) కుప్పంలో పర్యటించారు. వైసీపీ అధిష్టానం కుప్పం నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూస్తుండడం.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కూడా ఓడిస్తామని పార్టీ నాయకులు పదే పదే ప్రకటన చేస్తున్న దరిమిలా.. చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అదేసమయంలో కుప్పంలో టీడీపీ …
Read More »ఫైర్ బ్రాండ్లకు పట్టం.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం
కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్లుగా ఉన్న చాలా మంది నాయకులకు ఇప్పటికే మంత్రి పదవులు ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి..ఇప్పుడు మరో కీలక నిర్నయం తీసుకున్నారు. మంత్రుల్లో పది మందిని ఎంపిక చేసి.. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జ్‌లుగా నియమించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన జీవోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి విడుదల చేశారు. కాగా, ఆయా జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలను మరింత దూకుడుగా అందించడంతోపాటు.. పార్టీ పరంగానూ.. …
Read More »జేపీ లాగే జేడీ మిగిలిపోతారా?
రాజకీయాలంటే అంతే ఈజీ కాదు. ఇందులో నెగ్గుకురావాలంటే తెలివితేటలుంటే సరిపోదు కుళ్లు కుతంత్రాలను ఎదుర్కొనే శక్తి, ప్రత్యర్థిని దెబ్బకొట్టే వ్యూహం, ప్రజలను తిప్పుకునే మాయ కావాల్సిందే. ఇలాంటి నైపుణ్యాలు లేక చాలా మంది రాజకీయాల్లో అడుగుపెట్టినా ఫెయిల్యూర్ గానే మిగిలిపోయారు. ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ పెట్టిన జేడీ లక్ష్మీ నారాయణ భవిష్యత్ ఎలా ఉండబోతుందనే చర్చ మొదలైంది. చీకట్లో ఉన్న రాష్ట్రంలో వెలుగులు నింపడానికే జై భారత్ నేషనల్ …
Read More »మోడీ టార్గెట్ పెద్దదే
ఒకవైపు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును గద్దె దింపాలనే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని రెడీ చేసుకుని ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇండియా కూటమి పేరుతో ప్రాంతీయ, కలిసి వచ్చే జాతీయ పార్టీలను ఏకం చేసి.. పొలిటికల్ ఫైట్‌కు రెడీ అవుతోంది. అయితే.. కాంగ్రెస్ వ్యూహాన్ని తలదన్నే లా ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశంలో మోడీ …
Read More »