Political News

వైఎస్సార్ పేరుతో కంటి ఆసుప‌త్రి.. విజ‌య‌మ్మ‌ను పిల‌వ‌ని జ‌గ‌న్‌!

వైసీపీ అధినేత‌, పులివెందుల ఎమ్మెల్యే జ‌గ‌న్‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గానికి రూ.10 కోట్లు ఖ‌ర్చు చేసి అత్యాధుని కంటి వైద్యశాల‌ను నిర్మించారు. దీనిని తాజాగా మ‌హాశివ‌రాత్రిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న ప్రారంభించారు. తొలుత ఆయ‌న కంటి ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌రిమితంగానే వైఎస్ కుటుంబ స‌భ్యుల‌కు ఆహ్వానాలు అంద‌డం గ‌మ‌నార్హం. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ త‌న మాతృమూర్తి విజ‌య‌మ్మ‌ను పిల‌క‌పోవ‌డం స‌ర్వ‌త్రా విస్మ‌యానికి దారి తీసింది. ‘వైఎస్సార్ ఫౌండేష‌న్‌’ పేరుతో …

Read More »

వైసీపీలో స‌ల‌హాదారుల ముచ్చ‌ట‌..!

వైసీపీలో ఏం చేయాలి? నాయ‌కులు ఎలా ఉండాలి? ఏ స‌మ‌యానికి ఎలా మాట్లాడాలి? ఎవ‌రు మాట్లాడాలి? ఇలా.. ఇవన్నీ కూడా.. స‌ల‌హాదారులే నిర్ణ‌యించేవారు. గ‌తంలో రాజ‌కీయ స‌ల‌హాదారులు, ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు ఉండేవారు. వారు డిసైడ్ చేసేవారు. అయితే.. ఇప్పుడు వైసీపీ విప‌క్షంలోకి వ‌చ్చింది. చాలా మంది స‌ల‌హాదారులు వెళ్లిపోయారు. ఇక‌, ఉన్న‌వారు కూడా.. పార్టీలో అంత‌ర్గ‌తంగానే ఉంటున్నారు. కానీ.. ఇప్పుడు ఆ మిగిలిన న‌లుగురు స‌ల‌హాదారుల ముచ్చ‌ట పార్టీలో ఆస‌క్తిగా …

Read More »

గ్రేట్… యూపీలో తెలుగు సైన్ బోర్డులు

ఉత్తరాది అంటే దక్షిణాదికి పడదు. అదే సమయంలో దక్షిణాది అంటే ఉత్తరాదికి పడదు. హిందీ అంటే తమిళులకు పడదు. కన్నడ అంటే మరాఠాలకు అస్సలు పడదు. అయినా కూడా అందరూ కలిసే భారత్ లో నివసిస్తున్నారు. ఎప్పుడో అనుకోని పరిస్థితుల్లో కొందరు ఆకతాయిల కారణంగా ఈ తరహా విబేధాలు పొడచూపుతున్నాయి గానీ.. దేశంలో అన్ని ప్రాంతాల మధ్య సోదర భావం వెల్లి విరుస్తోంది. అందుకు నిదర్శనం ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ …

Read More »

పెట్టుబ‌డి దారుల స‌ద‌స్సులో ప‌ట్టెడ‌న్నం కోసం ఫైటింగ్‌!

అది పెట్టుబ‌డి దారుల స‌ద‌స్సు. వేల కోట్ల రూపాయ‌ల నుంచి వంద‌ల కోట్లు పెట్టుబ‌డి పెట్టే సంస్థ‌ల‌కు చెందిన ప్ర‌తినిధులు.. వివిధ రాష్ట్రాల‌కు చెందిన వారు పాల్గొన్నారు. ఇలాంటి స‌ద‌స్సులో నిర్వాహ‌కులు వ్య‌వ‌హ‌రించిన తీరుతో వారు ప‌ట్టెడ‌న్నం కోసం ఫైట్ చేసుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. పైగా.. చాలా మందికి భోజ‌నం ల‌భించ‌క‌.. తీవ్ర విమ‌ర్శ‌లు కూడా చేశారు. ఈ ప‌రిణామం.. పెట్టుబ‌డుల కంటే కూడా.. వివాదాల‌కు తావిచ్చేలా చేసింది. ఎక్క‌డ‌? …

Read More »

నిర్మాత కేదార్ మృతి ఓ మిస్టరీ: రేవంత్ రెడ్డి

తెలుగు చలన చిత్ర సీమ టాలీవుడ్ కు చెందిన నిర్మాత సెలగంశెట్టి కేదార్ దుబాయిలో అనూహ్య పరిణామాల నేపథ్యంలో మరణించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ వివాహానికి హాజరయ్యేందుకు టాలీవుడ్ కు చెందిన చాలా మంది ప్రముఖులు దుబాయి వెళ్లారు. వీరిలో కేదార్ కూడా ఉన్నారు. అయితే మిగిలిన వారంతా క్షేమంగానే తిరిగి రాగా.. కేదార్ మాత్రం విగత జీవిగా తిరిగి వచ్చారు. దుబాయిలో అనారోగ్యం కారణంగా కేదార్ మరణించారని …

Read More »

జైలులో వంశీ బ్రహ్మాండంగా ఉన్నారట!

దళిత యువకుడి కిడ్నాప్, ఆపై బెదిరింపుల కేసులో అరెస్టై జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్… ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు. కిడ్నాప్, బెదిరింపులు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి తదితర కేసుల్లో వివరాలు రాబట్టేందుకు వంశీని తమ కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల అభ్యర్థనకు కోర్టు అనుమతించింది. పోలీసులు పది రోజుల కస్టడీ అడిగితే… కోర్టు 3 రోజుల పాటు వంశీని పోలీసు కస్టడీకి అనుమతించింది. …

Read More »

ధోనీ సీఎస్కేను గెలిపిస్తే.. పీకే టీవీకేను గెలిపిస్తారట

రీజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తమిళనాట అడుగు పెట్టేశారు. తమిళగ వెట్రీ కజగమ్ (టీవీకే) పేరిట ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్ పార్టీ కోసం పనిచేసేందుకు ఆయన రంగంలోకి దిగిపోయారు. ఇప్పటికే టీవీకే, పీకేల మధ్య అవగాహన కుదరగా… ఆ వెంటనే వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీవీకే పనిని పీకే ప్రారంభించారు. ఏడాది తర్వాత జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా …

Read More »

మోదీతో రేవంత్ భేటీ…గంటసేపు కీలక చర్చ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం భేటీ అయ్యారు. మోదీతో బేటీ కోసం మంగళవారం రాత్రికే రేవంత్ ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ మేరకు బుధవారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ అదికారిక నివాసం చేరుకున్న రేవంత్… అక్కడే మోదీతో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు నేతల భేటీ గంటకు పైగానే కొనసాగింది. …

Read More »

బాబొచ్చారుగా… ‘గల్లా’ యాక్టివ్ అయ్యారు

గల్లా జయదేవ్.. ఈ పేరు విని చాలా రోజులే అయ్యింది అంటారా? నిజమే…గల్లా జయదేవ్ పేరు విని చాలా రోజులే అయ్యింది. తెలుగు నేలలో పారిశ్రామికంగా సత్తా చాటిన కుటుంబాల్లో ఒకటైన గల్లా ఫ్యామిలీ నుంచి వచ్చిన జయదేవ్.. ఇండస్ట్రియలిస్ట్ గా తనను తాను నిరూపించుకున్నారు. ఆపైై రాజకీయాల్లోకీ ఎంట్రీ ఇచ్చి… వచ్చీరావడంతోనే గుంటూరు ఎంపీగా విజయం సాధించి చట్టసభల్లో అడుగు పెట్టేశారు. అయితే 2019లో ఏపీలో అధికారం చేపట్టిన …

Read More »

పొగాకు బోర్డులోకి ముగ్గురు ఎంపీలు… ఇద్దరు మనోళ్లే

గుంటూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పొగాకు బోర్డును కేంద్ర ప్రభుత్వం మరింతగా పటిష్టం చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు బోర్డులోకి ముగ్గురు ప్రజా ప్రతినిధులకు స్థానం కల్పించింది. దేశంలో పొగాకు సాగు, రైతులకు గిట్టుబాటు ధరలు అందించడంతో పాటుగా పొగాకు వినియోగం నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపైనా దృష్టి సారించేందుకు కేంద్రం ఏళ్ల క్రితమే పొగాకు బోర్డును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పొగాకు అత్యధికంగా సాగు అయ్యే …

Read More »

‘లూప్’ జర్నీ…బాబు ఎప్పుడో చెప్పేశారబ్బా

అది 2019కి ముందు నాటి మాట. ఏపీకి నూతన రాజధాని అమరావతి పనులు శరవేగంగా సాగుతున్న సమయం. అమరావతిని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో అనుసంధానం చేయాలన్న దిశగా నేటి మాదిరే నాడు కూడా ఏపీకి సీఎంగా కొనసాగుతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా ఒకానొక రోజు ఆయన నోట హైపర్ లూప్ మాట వినిపించింది. వలయాకారంలో ఏర్పాటయ్యే గొట్టాల్లాంటి రవాణా వ్యవస్థలో అతి …

Read More »

జగన్ మాటలే వంశీ నోట వస్తున్నాయా..?

దళిత యువకుడు ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ప్రస్తుతం పోలీసుల కస్డడీలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించగా… తొలి రోజు కస్టడీ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కేంద్రంగా విచారణ జరగగా… వంశీ తాను ముందుగా నిర్దేశించుకున్న సమాధానాలనే పోలీసుల ఎదుట చెప్పినట్లుగా తెలుస్తోంది. విచారణలో పోలీసులు తనను …

Read More »