Political News

పవన్ సహనానికి ఫిదా కావాల్సిందే!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న విషయాలకే ఓ రేంజిలో రియాక్ట్ అయిపోతూ ఉంటారని… ఆయనలో సహనం పాళ్లు చాలా తక్కువనే విమర్శలు చాలా కాలం నుంచి ఉన్నవే. ఈ మాటలు నిజమేనన్నట్లుగా పవన్ చలా సందర్భాల్లో చిన్న విషయాలకు కూడా తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. ఆయా అంశాలపై ఊగిపోయారు. జన సైనికులను ఉర్రూతలూగించారు. అయితే పవన్ లో నిగూఢంగా సహనం దాగుందని…ఆ సహనం …

Read More »

ఓర్నీ: ఉనికిలో లేని శాఖకు మంత్రి.. పంజాబ్ సిత్రం తెలిస్తే అవాక్కే!

ఇలా కూడా జరుగుతుందా? అన్న ఆశ్చర్యానికి గురి చేసే ఉదంతం ఒకటి పంజాబ్ లో చోటు చేసుకుంది. అక్కడ ఒక మంత్రిగారు ఉనికిలో లేని ఒక శాఖకు ఎంపికయ్యారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శాఖ అన్నది లేకున్నా.. అందులో గడిచిన 20 నెలలుగా బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ తప్పిదాన్ని తాజాగా గుర్తించి నాలుకర్చుకున్న అధికారులు దాన్ని సవరించే పనిలో పడ్డారు. విన్నంతనే విచిత్రంగా అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే..2022 …

Read More »

వైసీపీలో `గ్యాప్` తీరుస్తున్నారు… నేత‌లు బ‌య‌ట‌కు!

ఎట్ట‌కేల‌కు వైసీపీ నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితం త‌ర్వాత‌.. వైసీపీ 11 స్థానాల‌కు జారిపోయిన త‌ర్వాత‌.. ఇప్పుడిప్పుడే విధాన ప‌ర‌మైన అంశాల‌తో వైసీపీ నాయ‌కులు బ‌య‌ట‌కు రావ‌డం ప్రారంభించారు. తాజాగా అనంతపురం జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామిరెడ్డి.. కూటమి ప్ర‌భుత్వానికి ప్ర‌శ్న‌లు సంధించారు. జ‌గ‌న్ బ‌య‌ట‌కు రాకూడ‌దా? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు .. జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌స్తే.. కూట‌మి స‌ర్కారు త‌ప్పులు బ‌య‌ట ప‌డ‌తాయ‌ని …

Read More »

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య `స‌యోధ్య` సాధ్యంకాదా?

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల జ‌గ‌డాల‌తోపాటు విద్యుత్ స‌మ‌స్య‌లు కూడా పెరుగుతున్నాయి. మ‌రో రెండు మాసాల్లో ఎండ‌లు ముద‌ర‌నున్న నేప‌థ్యంలో ఈ రెండు అంశాలు కూడా.. రెండు రాష్ట్రాల‌కూ కీల‌కంగా మారుతున్నాయి. ఖ‌రీఫ్ సాగు రెండు రాష్ట్రాల్లోనూ ముమ్మ‌రం అవుతోంది. కృష్ణా, గోదావ‌రి ఆయ‌క‌ట్టు ప్రాంతంలో రైతులు సాగుకు సిద్ధ‌మ‌య్యారు. ఏపీలో అయితే.. నాట్లు కూడా ప‌డుతున్నాయి. ఈ ప‌రిణామాల‌తో జ‌లాల ప్రాధాన్యం పెరిగింది. మ‌రోవైపు .. ఎండాకాలం ప్రారంభానికి …

Read More »

మోదీ టీంలోకి ‘శక్తి’మంతుడు!

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నేతగా కొనసాగుతున్నారు. మోదీ బృందంలో ఉన్నవారంతా కూడా వారి వారి విభాగాల్లో లబ్ధ ప్రతిష్టులే. జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరిస్తున్న అజిత్ దోవల్ అయితేనేం… ప్రిన్సిపల్ సెక్రటరీ టూ పీఎంగా కొనసాగుతున్న ప్రమోద్ కుమార్ మిశ్రా అయితేనేం… కేబినెట్ లో అమిత్ షా, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, జై శంకర్, కిరణ్ రిజిజు.. ఇలా ఎవరిని తీసుకున్నా.. …

Read More »

అసెంబ్లీకి వెళ్దాం.. `తాడేప‌ల్లి`పై ధిక్కార స్వ‌రాలు!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్.. అసెంబ్లీకి వ‌చ్చే విష‌యంపై ఆ పార్టీ వ‌ర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ద‌ఫా జ‌గ‌న్ స‌మావేశాలు వ‌స్తారా? రారా? అన్న‌ది సందేహ‌మే. ఆయ‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయం ఎలా ఉన్నా.. పార్టీ వ‌ర్గాల మాట వేరేగా ఉంద‌ని తెలుస్తోంది. మ‌రో రెండు రోజుల్లో ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో స‌భ‌కు వెళ్లే విష‌యంపై కొంద‌రు ఎమ్మెల్యే లు రెడీ అవుతున్న‌ట్టు …

Read More »

కబ్జా భూమి సరెండర్ తో పని అయిపోయినట్టేనా…?

భూకబ్జా అనేది నేరం. ఈ నేరానికి జీవిత కాలం పాటు జైలు శిక్ష విధించే దిశగా ఏపీలోని కూటమి సర్కారు సాగుతోంది. అంటే.. భూకబ్జాలకు పాల్పడినట్టుగా నేరం నిరూపితమైతే… దోషులకు ఏకంగా 14 ఏళ్ల జైలు శిక్ష తప్పదన్న మాట. మరి వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి ఈ వ్యవహారాన్ని చాలా లైట్ గా తీసుకుంటున్నట్టుగా ఉంది. తాను భూకబ్జా చేసినట్లుగా తేలితే.. తాను కబ్జా …

Read More »

రేవంత్ కు మోదీ ఫోన్.. సీఎంకు పీఎం భరోసా

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో రేవంత్ కు కాల్ చేసిన మోదీ… శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)లో చోటుచేసుకున్న ప్రమాదంపై ఆరా తీశారు. ఎస్ఎల్బీసీలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, భయపడాల్సిన అవసరం ఏమీ లేదని ఆయన రేవంత్ కు భరోసా ఇచ్చారు. ఇందుకోసం …

Read More »

బ్రేకింగ్ : అసెంబ్లీకి రానున్న వైఎస్ జగన్!

ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తామంటూ ఇప్పటిదాకా చెబుతూ వస్తున్న వైసీపీ. అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన వ్యూహాన్ని మార్చేశారు. రానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు పార్టీ తరఫున అందరు ఎమ్మెల్యేలు హాజరు కావాలంటూ ఆయన ఆదేశాలు జారీ …

Read More »

పవన్ మాదిరే కృష్ణ తేజదీ గొప్ప మనసే!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ది ఎలాంటి మనస్తత్వమో తెలుసు కదా. ఆపదలో ఉన్నారని తెలిస్తే… ప్రభుత్వమే వచ్చి వారిని ఆదుకోవాలని ఆయన అనుకోరు. తనకు చేతనయినంత సాయం చేసి ఆపదలో ఉన్న వారికి తక్షణ వెసులుబాటు కల్పించడంతో పాటుగా వారిలో బ్రతుకుపై భరోసా నింపుతారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఉంటే… ఆయనకు పర్సనల్ సెక్రటరీ హోదాలాో పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారి కృష్ణ తేజ తెలుసు కదా. కేరళ …

Read More »

తగ్గేదే లే.. ఇక పై ‘ఎక్స్’ నా స్టేజీ: పృథ్వీరాజ్

టాలీవుడ్ లో థర్డ్ ఇయర్స్ ఇండస్ట్రీ ట్యాగ్ తో సాగుతున్న హాస్య నటుడు పృథ్వీరాజ్ రాజకీయ విమర్శలు చేసే విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా సాగుతున్నారు. ఇటీవల యువ హీరో విశ్వక్ సేన్ నటించిన చిత్రం లైలా ప్రీ రిలీజ్ వేడుక వేదికపై మాట్లాడిన పృథ్వీరాజ్.. ఏపీలో విపక్ష వైసీపీని టార్గెట్ చేస్తూ సెటైరిక్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తానో పాత్ర చేస్తున్నానని, తనకు ఇద్దరు …

Read More »

‘ద కారవాన్’ కవర్ పై చంద్రబాబు రాజసం

నిజమే… ఎవరు ఔనన్నా… ఎవరు కాదన్నా కూడా చంద్రబాబు రాజకీయ పరంపర ఏ ఒక్కరు నిలువరించలేనిదే. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మాటల్లో చెప్పాలంటే… చంద్రబాబు లెగసీ ముమ్మాటికీ అన్ స్టాపబులే. ఎఫ్పుడో 1977లో రాజకీయ తెరంగేట్రం చేసిన చంద్రబాబు… 45 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ రాజకీయాల్లోనూ ఇంకా సత్తా చాటుతున్నారు. అటు రాజకీయంగానే కాకుండా ఇటు పాలనలోనూ చంద్రబాబు తనదైన మార్కుతో సాగిపోతున్నారు. …

Read More »