దుర్గేశ్ ప్లాన్ సక్సెస్ .. ‘సూర్యలంక’కు రూ.97 కోట్లు

ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా జనసేన కీలక నేత కందుల దుర్గేశ్ సత్తా చాటుతున్నారని చెప్పాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పర్యాటక శాఖలోకి పెద్ద ఎత్తున ప్రైవేట్ పెట్టుబడులను రాబట్టే దిశగా దుర్గేశ్ చేస్తున్న యత్నాలు ఫలిస్తున్నాయి. అంతేకాకుండా కేంద్రం నుంచి పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కోసం ఏఏ పద్దులు ఉన్నాయి? వాటి కింద ఏఏ అంశాలకు ఎంత మేర నిధులను రాబట్టవచ్చు? అన్న అంశాలపై పట్టు సాదించిన దుర్గేశ్… తాజాగా ఏపీ పర్యాటక రంగానికి కేంద్రం నుంచి రూ.97 కోట్ల నిధులను రాబట్టారు.

బాపట్ల జిల్లా పరిధిలోని సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం కేంద్రం… స్వదేశీ దర్శన్ స్కీం 2.0 కింద రూ.97.52 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులు త్వరలోనే రాష్ట్రానికి అందనున్నాయి. ఈ నిధులతో సూర్యలంక బీచ్ ను అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అభివృద్ది చేయనున్నట్లు దుర్గేశ్ ప్రకటించారు. కేంద్రం నుంచి నిధుల మంజూరు… సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల నుంచి సంపూర్ణ సహకారం లబిస్తున్ననేపథ్యంలో త్వరలోనే సూర్యలంక బీచ్ ను దుర్గేశ్ బృందం ఓ రేంజిలో అభివృద్ది చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ శాఖ ద్వారా రాష్ట్రానికి ఆదాయాన్ని రాబట్టాలన్న దిశగా దుర్గేశ్ సాగారు. ఈ క్రమంలో ఇటీవల అరకు ఫెస్టివల్ పేరిట ఓ కార్యక్రమాన్ని దుర్గేశ్ నిర్వహించగా… పర్యాటకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అదే స్పీడుతో సాగిన దుర్గేశ్… రిషికొండ బీచ్ కు తొలగిన బ్లూఫాగ్ సర్టిఫికేషన్ ను కేవలం 20 రోజుల వ్యవధిలో తిరిగి సాదించేశారు. తాజాగా కేంద్రం నుంచి దాదాపుగా వంద కోట్ల రూపాయల నిధులను రాబట్టడంలో దుర్గేశ్ విజయం సాధించారు. ఇదే స్పీడు కొనసాగితే… ఏపీ టూరిజం ఓ రేంజి వృద్దిని నమోదు చేయడం ఖాయమేనని చెప్పాలి.