ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల నుంచి తెలుగుదేశం, జనసేన కార్యకర్తల నుంచి ఒక రకమైన అసంతృప్త స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి. ఐదేళ్ల పాటు తమను తీవ్ర వేధింపులకు గురి చేసిన వైసీపీ నేతలు, కార్యకర్తల పని పట్టడం లేదన్నది వారి ఆవేదన. ఆ ఐదేళ్లు అదుపు తప్పి ప్రవర్తించిన వారి మీద సరైన చర్యలు చేపట్టడం లేదని.. కేసులు పెట్టట్లేదని.. ఇప్పటికీ వాళ్లంతా దర్జాగా తిరుగుతున్నారని …
Read More »ఓటమి కాస్తా.. ఓదార్పు యాత్ర అయ్యిందే!
తిరుపతి నగరపాలక సంస్థలో మంగళవారం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తి అయిపోయిన తర్వాత ఎందుకనో గానీ వైసీపీలో ఏడుపులు, పెడబొబ్బలు, క్షమాపణలు… ఒకదాని తర్వాత మరొకటి క్యూ కడుతున్నాయి. వాస్తవానికి తిరుపతి కార్పొరేషన్లో వైసీపీకి బలం ఉంది. అయితే ఆ పార్టీ నేతలు తమ కార్పొరేటర్లను తమ పంచన ఉండేలా చేసుకోలేకపోయారు. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా… అవసరం తీరాక మరోలా అన్నట్టుగా వ్యవహరించారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నిక పూర్తి …
Read More »‘స్థానికం’లో జనసేన తప్పుకొంది.. రీజనేంటి ..!
స్థానిక సంస్థలకు సంబంధించి చైర్ పర్సన్, డిప్యూటీ మేయర్ పదవులకు సంబంధించిన పోటీ తీవ్రస్థాయిలో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 పదవులకు.. ఒక డిప్యూటీ మేయర్(తిరుపతి) పదవికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూటమిని ముందుకు నడిపిస్తున్న టీడీపీ ఆయా పదవులను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో జనసేన ఎక్కడా పోటీ కూడా ఇవ్వలేదు. దీంతో జనసేన స్థానిక పోటీలో తప్పుకొందా? లేక.. మరేదైనా జరిగిందా? అనే చర్చ …
Read More »ఆయన ‘ఎన్నికల’ గాంధీ: కేటీఆర్ సెటైర్లు
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన కుల గణన, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బాగానే ఉందన్న ఆయన.. కుల గణనపై మాత్రం విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వన్నీ డ్రామాలేనని చెప్పారు. కుల గణన పేరుతో బీసీ డిక్లరేషన్ చేసినా.. దానిని అమలు చేసే చిత్త శుద్ధి ఏమాత్రం ఈ ప్రభుత్వానికి లేదని విమర్శలు గుప్పించారు. బీసీ …
Read More »టీటీడీలో అన్యమత ఉద్యోగుల బదిలీ
జగన్ హయాంలో తిరుపతి, తిరుమల ప్రతిష్ట మసకబారిందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో అవకతవకలు జరిగాయని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తిరుమలలో అన్యమత ప్రచారం ఆరోపణలు, ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం, టీటీడీ భూముల వేలంపాటకు ప్రభుత్వం పూనుకోవడం, సప్తగిరి మాసపత్రిక వ్యవహారం, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ రోడ్డు పక్కన ఉన్న గోడలపై హిందూ దేవతల బొమ్మల స్థానంలో వైసీపీ రంగులు..చివరగా తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి …
Read More »చంద్రబాబు మార్క్… తెలుగులో తొలి జీవో విడుదల
దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’ అన్న వైనంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం అంటూ తెలుగు భాషకు ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నం చేశారని జగన్ సర్కార్ పై విమర్శలు వచ్చాయి. దాంతోపాటు, అందరికీ అందుబాటులో ఉండాల్సిన జీవోలను రహస్యంగా ఉంచిందన్న అపవాదు గత ప్రభుత్వంపై ఉంది. కట్ చేస్తే…ఏపీలో కూటమి …
Read More »ఏది ఎక్కడ అడగాలో తెలియదా గురూ…!
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పాలుపంచుకున్నారు. మంగళవారం నాటి లోక్ సభ సమావేశాల్లో భాగంగా తనకు అవకాశం రాగా… మిథున్ రెడ్డి సుదీర్ఘంగానే ప్రసంగించారు. ఈ సందర్భంగా రాస్ట్రపతి ప్రస్తావించిన పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన కీలక అంశాలను లేవనెత్తారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల ప్రాజెక్టు …
Read More »బాబు బాటలోనే లోకేశ్!…’అరకు’కు మహార్దశ పక్కా!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన నిధుల విడుదల, ప్రత్యేక రైల్వే జోన్ పనుల వేగవంతం తదితరాలపై ఆయన కేంద్ర మంత్రితో చర్చించినట్లుగా సమాచారం. అంతేకాకుండా తాజాగా రైల్వే బడ్జెట్ లో ఏపీకి …
Read More »ఏపీలో ‘ఆ రాజ్యాంగ పదవులు’ వైసీపీకి దక్కలేదు!
ఏపీలో కూటమి ప్రభుత్వం చేసే ఖర్చులు, తీసుకునే నిర్ణయాలను సమీక్షించి.. నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేకంగా మూడు కమిటీలు ఉంటాయి. ఇది అన్నిరాష్ట్రాల్లోనూ శాసన సభ ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా స్పీకర్, సభానాయకు డు(సీఎం), శాసన సభ కార్యదర్శి సమావేశమై నిర్ణయం తీసుకుంటారు. వీటికి ఉన్న ప్రాధాన్యం రీత్యా.. ఆయా పదవుల చైర్మన్లను ప్రధాన ప్రతిపక్షానికి కేటాయిస్తారు. ఎందుకంటే.. సర్కారు చేసే ఖర్చును సొంత పార్టీ నేతలే.. సమీక్షిస్తే …
Read More »ప్రజల సంతృప్తి.. చంద్రబాబు అసంతృప్తి!
ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించి.. ఏడు మాసాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఫీడ్ బ్యాక్ ఏంటి? అనే అంశాలపై సీఎం చంద్రబాబు తాజాగా ఉన్నతాధికారుల తో సమీక్షించారు. ప్రజల సంతృప్తి వ్యవహారంపై ఆయన ఆరా తీశారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, దావోస్ సదస్సు, పింఛన్ల పంపిణీ, ఉచిత గ్యాస్, రహదారుల నిర్మాణం, ధాన్యం సేకరణ, నిధుల పంపిణీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా …
Read More »జగన్ను మరోసారి ఏకేసిన షర్మిల
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్.. లండన్ నుంచి ఇలా వచ్చారో లేదో.. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు, ఆయన సోదరి షర్మిల.. ఇలా ఏకేయడం ప్రారంభించారు. తాజాగా మంగళవారం.. షర్మిల విజయవాడలో మాట్లాడుతూ.. జగన్పై విమర్శల జల్లు కురిపించారు. బీజేపీ దత్తపుత్రుడు.. ఆ పార్టీ కనుసన్నల్లో నడిచాడు అంటూ.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు.. ఈ విషయంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా ఆమె …
Read More »బాపట్ల తమ్ముళ్ల మధ్య ‘ఎన్టీఆర్’ వివాదం
కూటమి ప్రభుత్వంలో కలిసి మెలిసి ఉండాలని.. నాయకులు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయినా.. టీడీపీ నేతల తీరు ఏమాత్రం మారడం లేదు. తమ దూకుడు స్వభావంతో వివాదాలకు కేంద్రంగా మారుతున్నారు. తాజాగా బాపట్ల జిల్లాలోని టీడీపీ నాయకులు దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవ స్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంలో రగడపడ్డారు. రోడ్డెక్కి ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. దీంతో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates