ఏపీ సీఎం జగన్ తన చెల్లెళ్ల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు (వీహెచ్) అన్నారు. సొంత చెల్లెలు వైఎస్ షర్మిల విషయంలో కొందరు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఇంత జరుగుతున్నా.. జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు? అని హనుమంతరావు ప్రశ్నించారు. మహిళల గురించి గొప్పగా మాట్లాడే.. జగన్, ముందుకు తన చెల్లెళ్ల గురించి పట్టించుకోవాలి అని సూచించారు. …
Read More »చెయిన్ క్యాంపెయిన్‌కు జగన్ పిలుపు..
వైసీపీ అధినేత, సీఎం జగన్.. తాజాగా వచ్చే ఎన్నికలకు సంబంధించి సిద్ధం పేరుతో సభలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే విశాఖ వేదికగా.. ఆయన తొలిసభ నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాల వారీగా నిర్వహిస్తున్న ఈ సభల్లో భాగంగా ఏలూరు జిల్లా దెందులూరులో సభను నిర్వహించారు. ఈ సభా వేదికగా సీఎం జగన్ సంచలన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ని గెలిపించాలని ఆయన చెప్పారు. అదేసమయంలో ఆయన చెయిన్ క్యాంపెయిన్ …
Read More »జగన్ ఎన్ని తప్పులు చేయకూడదో అన్నీ చేశారు: ఉండవల్లి
ఏపీసీఎం జగన్‌పై మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యంగ్యాస్త్రాలు సంధించా రు. జగన్ ఎన్నితప్పులు చేయకూడదో అన్నీ చేశారని అన్నారు. “సీఎం పదవి పోతే.. జగన్‌కు ఎంత బాధ ఉంటుందో.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే పదవి పోతే.. వారికి కూడా అంతే బాధ ఉంటుంది. టికెట్లు ఇచ్చే విషయంలో ఆచి తూచి వ్యవహరించకపోతే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన పరాభవమే వచ్చే ఎన్నికల్లో వచ్చినా ఆశ్చర్యం లేదు“ అని …
Read More »మీ కోసం 124 సార్లు బటన్ నొక్కా.. నా కోసం.. : జగన్
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పరిదిలో నిర్వహించిన వైసీపీ సిద్దం ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ నాయకులకు ఓటేసి.. పార్టీ అభ్యర్థులను అన్ని స్థానాల్లోనూ గెలిపించాలని ఆయన కోరారు. అయితే.. దీనికి కొంత మసాలా జోడించి చెప్పడమే ఆసక్తిగా మారింది. మీ కోసం నేను 57 నెలల కాలంలో వివిధ పథకాలకు సంబంధించి 124 సార్లు బటన్ నొక్కాను. …
Read More »రాజయ్య రూటు మారుతోంది.. రేవంత్ దిశగా అడుగులు
తెలంగాణ రాజకీయాల్లో ..ముఖ్యంగా వరంగల్ జిల్లా రాజకీయాల్లో వివాదాస్పద నాయకుడిగా, మంత్రిగా , నిత్యం మీడియాలో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం తాడికొండ రాజయ్య.. తాజాగా మరో సారి వార్తల్లోకి వచ్చారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేయని రాజయ్య..అప్పట్లో బీఆర్ ఎస్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. పార్టీ అదినేత ఏం చెప్పినా.. చేస్తానని, మళ్లీ అధికారం బీఆర్ ఎస్ దేనని అన్నారు. కానీ, …
Read More »అసెంబ్లీలో మాదే.. పార్లమెంట్‌లో కూడా మాదే..
తెలంగాణ సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ప్రచారం ప్రారంభించేశారు. త్వరలోనే దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలకు నగారా మోగనుంది. ఈ క్రమంలో తెలంగాణలోని 17 స్థానాల్లో కనీసం 14 నుంచి 16 స్థానాలను తమ కైవసం చేసుకోవాలని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని కొనసాగించాలని భావిస్తున్న రేవంత్‌రెడ్డి.. తాజాగా ఇందవల్లి వేదికగా .. నిర్వహించిన భారీ బహిరంగ సభ ద్వారా ప్రచార శంఖం పూరించారు. ఈ …
Read More »కాంగ్రెస్‌కు కంట్లో నలుసు..
రాజకీయాల్లో తనకంటూ.. ప్రత్యేక ముద్ర వేసుకున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. అందరూ ఆమెను దీదీ అని పిలుచుకుంటారు. అయితే. ఆమె ప్రత్యేకత ఏంటంటే..ఎప్పుడు ఎటు వైపు నిలబడతారో.. ఎప్పుడు ఎవరిని పొగుడుతారో చెప్ప డం కష్టం. ఏనిముషానికి ఆమె మనసు, నోరు.. ఎటు వైపు మలుపు తిరుగుతాయో కూడా చెప్పడం మరీ కష్టం. నిన్న మొన్నటి వరకు.. కాంగ్రెస్ పార్టీని భేష్ అంటూ.. కొనియాడిన దీదీ.. ఇటీవల …
Read More »నేతలకు కేసీయార్ షాకిచ్చారా ?
మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలకు కేసీయార్ షాకులమీద షాకులిస్తున్నారట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేసీయార్ కు పెద్ద షాకనే చెప్పాలి. తనపైన తాను విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కేసీయార్ అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తాపడ్డారు. ఎన్నికల్లో ఓడిన రెండు రోజునే బాత్ రూములో పడితే తుంటి ఎముక విరిగింది. దాంతో ఆపరేషన్ చేయించుకున్న కేసీయార్ ఇంటికే పరిమితమైపోయారు. రెండు మూడు రోజులుగానే బయటకు వస్తున్నారు. తొందరలోనే పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి కదా …
Read More »రేవంత్ పై నమ్మకంతో జార్ఖండ్ రాజకీయం
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో వారికి తెలిసినట్టుంది. బీజేపీ ఎలాంటి వారినైనా తన వైపునకు ఎలా తిప్పుకుంటుందో వారికి బాగా అనుభవంలో ఉన్నట్టుగా ఉంది.. అందుకే.. అనూహ్యమైన పరిస్థితిలో అంతే అనూహ్యంగా వ్యవహరించారు… జార్ఖండ్ అధికార పక్ష కూటమి పార్టీలు. అవే.. జేఎంఎం(జార్ఖండ్ ముక్తి మోర్చా), కాంగ్రెస్ పార్టీలు. ప్రస్తుతం జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. సీఎం హేమంత్ సొరేన్‌పై ఈడీ కేసులు …
Read More »నీ అయ్య.. ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేది..
“నీ అయ్య.. ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేది“ అంటూ.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయి విరుచుకుపడ్డారు. ఎవడైనా ఆ మాటలు అంటే.. ప్రజలే తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో ప్రదాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ నాయకులు తరచుగా రేవంత్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే కూలిపోతుందని వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కూడా.. దాదాపు ఇదే వ్యాఖ్యలు చేశారు. “వాళ్ల ప్రభుత్వాన్ని వాళ్లు ఎన్నాళ్లు కాపాడుకుంటారో చూద్దాం“ …
Read More »వైసీపీ ఆరో జాబితా విడుదల.. కానీ, ఈ ప్రశ్నకు సమాధానమేది?
ఏపీ అధికార పార్టీ వైసీపీ తాజాగా ఆరో జాబితాను విడుదల చేసింది. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల నోటిఫికేషన్ లేదా షెడ్యూల్‌కు రెండు మాసాల ముందుగానే అభ్యర్థులను దాదాపు నియమిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఐదు జాబితాలు ఇవ్వగా తాజాగా ఆరో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీలకు కలిపి 10 మంది సమన్వయ కర్తలను ప్రకటించింది. ఈ మేరకు పార్టీ …
Read More »ఆ ఎమ్మెల్యేకు లైన్ క్లియర్ చేసిన సీఎం జగన్!
కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్న ఉమ్మడి కృష్నాజిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్… పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన ఎక్కడ మాట్లాడినా.. సంక్షేమం ఒక్కటే చాలదు.. ప్రజలు అభివృద్ధిని కోరుతున్నారు. ఇది మాకు చేతకావడం లేదు.. అని అంటున్నారు. ఈ వ్యాఖ్యలు పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ చర్చగా మారాయి. ఈ నేపథ్యానికి తోడు.. శనివారం పార్టీ ప్రతిష్టాత్మకంగా ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న సిద్ధం బహిరంగ సభకు ఎమ్మెల్యే వసంత …
Read More »