“ఫిబ్రవరి 4వ తేదీ నా రాజకీయ జీవితంలో ప్రత్యకంగా గుర్తుండిపోయే రోజు” అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం సాయంత్రం ఆయన అసెంబ్లీలో కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణపై వేసిన ఏకసభ్య కమిషన్ నివేదికపై సుదీర్ఘంగా ప్రసంగించారు. అదేవిధంగా కుల గణన నివేదికను కూడా సభకు మరోసారి వివరించారు. ఈ రెండు అంశాలు కూడా.. తనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని.. వాటినిసభలో ప్రవేశ పెట్టిన …
Read More »ఢిల్లీలో నారా లోకేశ్ తో ప్రశాంత్ కిశోర్ భేటీ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన ఆయన 4 గంటల వరకు ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీతో పాటు ఏపీకి చెందిన బీజేపీ, జనసేన ఎంపీలు లోకేశ్ కు ఘన స్వాగతం పలికారు. ఈ రాత్రికి లోకేశ్ కేంద్ర రైల్వే శాఖ …
Read More »వైఎస్ వద్దే తగ్గలేదు… ఇప్పుడు తగ్గుతానా?: దానం
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన… 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అదికారం చేపట్టడంతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు తనపై విమర్శలు గుప్పిస్తుండగా… వారిపై దానం ఒంటికాలిపై లేస్తున్న వైనం తెలిసిందే. అయితే కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేసిన హైడ్రా చర్యలపైనా …
Read More »జగన్ చేయాల్సిన ఫస్ట్ పని ఇదే.. వైసీపీ నేతల డిమాండ్..!
వైసీపీ అధినేత జగన్.. లండన్ పర్యటనను ముగించుకుని తాడేపల్లికి చేరుకున్నారు. సుమారు 15-20 రోజుల పాటు ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. అయితే.. జగన్ ఎలాంటి సమావేశాలు నిర్వహించినా.. నిర్వహించకపోయినా.. ఫస్ట్ ఆయన చేయాల్సిన పని ఒకటి ఉందని సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అదే.. సీనియర్ మోస్ట్ నేతల విషయంలో ఏర్పడిన సమస్యలను ఆయన …
Read More »బీఆర్ఎస్ కు బూస్ట్…వారంతా రిప్లై ఇచ్చి తీరాల్సిందే
తెలంగాణలో జోరుగా సాగుతున్న పార్టీ ఫిరాయింపులకు చెక్ పడే దిశగా మంగళవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పరిణామం విపక్ష బీఆర్ఎస్ కు బిగ్ బూస్ట్ ఇచ్చిందని చెప్పక తప్పదు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్లపై అసెంబ్లీ బరిలో నిలిచి ఎమ్మెల్యేలుగా గెలిచి… ఆ తర్వాత అదికార కాంగ్రెస్ గూటికి చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఎందుకు మారారన్న విషయంపై …
Read More »స్వర్ణలత, సత్యవతి వద్దు.. కృష్ణకుమారికి కిరీటం
పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు… ఓ పదవి విషయంలో ఎంపీ, ఎమ్మెల్యే జుట్లు పట్టుకుంటే వారిద్దరికీ షాకిస్తూ మూడో వ్యక్తికి పదవి దక్కింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మునిసిపల్ చైర్ పర్సన్ పదవి విషయంలో ఇదే జరిగింది. నందిగామ మునిసిపల్ చైర్మన్ పదవిని తాను సూచించిన అభ్యర్థికి ఇవ్వాలని స్థానిక ఎంపీ హోదాలో కేశినేని చిన్ని ఓ అభ్యర్థి పేరును ప్రతిపాదించారు. అయితే ఎంపీ సూచించిన అభ్యర్థిని వ్యతిరేకించిన …
Read More »ఎమ్మెల్సీ కిడ్నాప్ అన్న భూమన.. లేదన్న ఎమ్మెల్సీ
తిరుపతి నగర పాలక సంస్థలో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ ఎన్నిక గడచిన నాలుగైదు రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నాటకీయ పరిణామాలకు కారణంగా నిలిచింది. సరిగ్గా… డిప్యూటీ మేయర్ ఎన్నికకు రంగం సిద్ధమైన వేళ… తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపగా… ఆ వ్యాఖ్యలు సరికాదని …
Read More »జగన్ వ్యూహం మార్పు… భయామా?, బాధ్యతనా?
ఏపీలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా చోటుచేసుకుంటున్నాయి. రోజుకో కొత్త పరిణామం చోటుచేసుకుంటూ ఉండటంతో… రాజకీయం నిజంగానే రసవత్తరంగా మారిపోయింది. ఇలాంటి క్రమంలో మరో కీలక పరిణామం చోటచేసుకుంది. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లరాదని ఇదివరకే నిర్ణయించుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా సమాచారం. ఈ నిర్ణయంపై ఇప్పటిదాకా పెద్దగా ప్రకటనేమీ రాకున్నా.. అటు జగన్ అనుకూల వర్గాలు, ఇటు వ్చతిరేక వర్గాలు …
Read More »గవర్నర్ పదవా? రాష్ట్రపతి పదవా? కేజ్రీవాల్ సంచలన ఆరోపణ
రాజకీయ పార్టీ అధినేతలు.. నేతలు విమర్శలు చేయటం.. తీవ్ర ఆరోపణలు చేయటం మామూలే. అయితే.. దేశ చరిత్రలో ఇప్పటివరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ మీద తీవ్రమైన ఆరోపణ వచ్చింది లేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు కాస్త ముందుగా ఢిల్లీ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన ఆమ్ ఆద్మీ కన్వీనర్.. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణ చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సీఈసీ ప్రజాస్వామ్యాన్ని పణంగా …
Read More »సోనియాపై ప్రివిలేజ్ మోషన్…చర్యలు తప్పవా?
కాంగ్రెస్ పార్టీ మాజీ అద్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ పీకల్లోతు చిక్కుల్లో పడిపోయారని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక కాలం పాటు అధ్యక్షురాలిగా వ్యవహరించి రికార్డులకెక్కిన సోనియా గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ అయ్యాయి. అధికార పక్షం బీజేపీకి చెందిన 40 మంది ఎంపీలు మూకుమ్మడిగా ఆమెపై ఈ నోటీసులను ప్రతిపాదించారు. ఈ నోటీసుల ఆదారంగా సోనియాపై రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న …
Read More »అయ్యన్నపెద్ద సమస్యలోనే చిక్కుకున్నారే!
టీడీపీ సీనియర్ మోస్ట్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు… నిత్యం వివాదాలతోనే సహవాసం చేస్తున్నట్లుగా ఉంది. యంగ్ ఏజ్ లో ఉండగా… పార్టీ నియమావళికి కంకణబద్ధులై సాగిన అయ్యన్న… వయసు మీద పడినంతనే…ఒకింత కట్టు తప్పిపోతున్నారన్న వాదనలు లేకపోలేదు ప్రస్తుతం ఆయన రాజ్యాంగబద్ధమైన శాసన సభాపతి స్థానంలో ఉన్నారు. అయినప్పటికీ ఆయన తాజాగా ఓ వివాదంలో చిక్యుకున్నారు. స్పీకర్ హోదాలో తన జిల్లా పరిధిలో పర్యటకాభివృద్ధి కార్యక్రమానికి …
Read More »అసెంబ్లీకి రాకుంటే వేటు తప్పదు సారూ..!
తెలుగు రాష్ట్రాల్లో అటు ఏపీ అసెంబ్లీకి విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టడం లేదు. ఏదో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలి కాబట్టి తొలి రోజు సమావేశానికి వచ్చి ఆ 11 మంది మమ అనిపించారు.ఇక తెలంగాణలో అయితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ్యులంతా ఎంచక్కా సభకు వస్తున్నారు. అధికార పక్షానికి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. అయితే ప్రదాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates