తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన సీఎం చంద్రబాబు.. ఇక్కడ టీచర్లకు ఇస్తున్న శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు.
ఐటీ నుంచి పారిశ్రామికీకరణ వరకు పలు విషయాలను ప్రస్తావించారు. ఏది ప్రారంభించినా ముందు.. తన నియోజకవర్గంలోనే ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు.. కుప్పంలో జరిగే ప్రతి కార్యక్రమాన్నీ తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నానన్నారు.
విద్యుత్ చార్జీలను తగ్గిస్తున్న విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. సాంకేతికతను అందిపుచ్చుకుని.. వివిధ మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తిని పెంచుతున్నామని.. అందుకే విద్యుత్ చార్జీలను తగ్గించగలుగుతున్నామన్నారు. నేటి తరం యువత, విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఐటీ, ఏఐలు వేగంగా విస్తరిస్తున్నాయన్న ఆయన.. దీనిని తాను 30 ఏళ్ల కిందటే ఊహించి.. ఉమ్మడి రాష్ట్రంలో రెడ్ కార్పెట్ పరిచానన్నారు. వచ్చే 20 ఏళ్ల తర్వాత.. ప్రపంచం పూర్తిగా మారిపోతుందన్నారు. దీనిని కూడా ఇప్పుడే అంచనా వేస్తున్నట్టు తెలిపారు.
ఈ క్రమంలోనే ఏఐకి అత్యంత ప్రాధాపన్యం ఇస్తున్నామన్నారు. ఏఐ గురించి అందరూ ఆలోచన చేయాలని చంద్రబాబు సూచించారు. రాబోయే రోజుల్లో ఎలాంటి ఆవిష్కరణ వచ్చినా.. అది కుప్పంలోనే ప్రారంభం అవుతుందన్నారు.
దీనికి రతన్ టాటా ఇన్నో వేషన్ హబ్ సహకారం ఉంటుందన్నారు. ముఖ్యంగా క్వాంటం కంప్యూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. విద్యుత్ కొనుగోలు ఛార్జీలను సాధ్యమైనంతగా తగ్గించ గలగడానికి కారణం.. సాంకేతికతే కారణమని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates