తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు. అంతేకాదు, 117 సీట్లలో గెలిచి తీరుతామని ఆయన చెప్పారు. భద్రాద్రి రామయ్యపై ఆన.. వచ్చే ఎన్నికల్లో మేం 117 స్థానాల్లో గెలిచి తీరుతాం. అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జగన్నాథపురంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతు భరోసా చివరి విడత నిధులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం సీఎం …
Read More »రేవంత్ ఫ్లెక్సిలో జగన్ ఫొటో!
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల మధ్య ఏముందన్న విషయం ఇప్పటికీ ఏ ఒక్కరికీ తెలియదు. దాదాపుగా అన్ని పార్టీల నేతలతో ఈ ఇద్దరు నేతలు దాదాపుగా కలుపుగోలుగానే ఉంటారు. వారి రాజకీయ ప్రత్యర్థులతోనూ సత్సంబంధాలకే ఈ ఇద్దరూ ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి ఈ ఇద్దరు నేతల మధ్య సఖ్యత అన్న మాటే వినిపిందచు. ఈ ఇద్దరు పరస్పరం గొడవ పడరు. అలాగని ఒకరికొకరు విమర్శించుకోరు కూదా. ఇక పరస్పర అభినందనలూ వీరి మధ్య …
Read More »‘రావణ్’ రంగంలోకి పొన్నవోలును దించిన జగన్
రాజకీయ నేతలు…ప్రత్యేకించి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతరత్రా ప్రముఖులపై తనదైన శైలి దూషణ భాషతో పేట్రేగిపోయిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ కటకటాల్లోకి వెళ్లిపోయారు. ఏదో చిన్నపాటి సెక్షన్ల ఆధారంగా నమోదు అయిన కేసుల్లో రావణ్ కు బెయిల్ దొరికినా… హిందూ మతంపై ఆయన చేసిన ఆరోపణలతో ఏకంగా ఉపా చట్టం కింద కేసులు నమోదు కావడంతో రావణ్ పరిస్థితి ప్రమాదంలో పడిపోయింది. మొన్నటిదాకా రావణ్ ను పెద్దగా …
Read More »ఈ దెబ్బకు గిరిజన ఓటు బ్యాంకు పవన్ సొంతం
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు.. నగరాలు, పట్టణాల్లో ఎంత ఇమేజ్ ఉందో.. గిరిజన ప్రాంతాల్లోనూ అంతే ఇమేజ్ ఉంది. సినిమా పరంగా పక్కన పెడితే.. పాలన పరంగా, ఉప ముఖ్యమంత్రిగా ఆయన వేసిన అడుగులు గిరిజనులకు చేరువ అయ్యాయి. పాడేరు, అరకు, మన్యం వంటి కీలక గిరిజన ప్రాంతాల్లో పవన్ కల్యాణ్‌కు ఇటీవల కాలంలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా యూత్ పెద్ద ఎత్తున జనసేనకు కనెక్ట్ అవుతున్నారు. ఇది …
Read More »టీడీపీని చూసైనా నేర్చుకోవాలి కదా!
జనసేన నాయకులకు ఆ పార్టీ అధినేత చెబితే చెవికి ఎక్కడం లేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం ఇవ్వాలని.. ఎప్పటికప్పుడు వారు చేస్తున్న ఆరోపణలను ఆధారాలతో సహా తిప్పికొట్టాలని పవన్ కల్యాణ్.. గత రెండు నెలల కాలంలో మూడు సార్లు నాయకులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు కూడా ఇదే సూచన చేశారు. కానీ, ఒకరిద్దరు మాత్రమే స్పందిస్తున్నారు. పోనీ.. …
Read More »కేటీఆర్ పాదయాత్ర పోస్ట్ పోన్… ?
తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పాదయాత్ర చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ ఏడాది నుంచే ఆ పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. దీనిపై కేటీఆర్ .. పార్టీలోనూ.. తన కుటుంబంలోనూ చర్చించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. రాజకీయంగా పాదయాత్ర ఏమేరకు తమకు దోహదపడుతుందన్న విషయంపైనా ఆయన ఆరా తీశారు. అధికారంలోకి వచ్చేందుకు ఇది ఎంతవరకు …
Read More »దమ్ముందా? కడియం శ్రీహరికి కొండా సురేఖ సవాల్…!
తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్న రీతిలో జరుగుతున్న మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ కు మద్దతిచ్చిన కడియం శ్రీహరి తన ఇలాకాలో వేలు పెడుతున్నారంటూ కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కడియం శ్రీహరిపై తాజాగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే కడియం శ్రీహరి తన ఎమ్మెల్యే పదవికి …
Read More »వీడియో: మనవడి కోసం పూరీలు చేసిన సీఎం
ఏదో చిన్న ఉద్యోగమో.. పనో చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొచ్చే మనకే వంట గదిలోకి వెళ్లేందుకు సమయం ఉండదు. సమయం ఉన్నా.. వెళ్లాలని కూడా ఉండదు. మరి నిత్యం ఎంతో బిజీగా ఉంటూ.. ఇటు రాష్ట్ర పరిపాలన, అటు పార్టీ పరంగా ఎదురయ్యే సవాళ్లు.. వంటి కార్యక్రమాలతో క్షణం కూడా తీరిక ఉండని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తన మనవడి కోసం.. ఏకంగా పూరీలు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి …
Read More »‘కూటమి లేకుంటే… మీ ఆస్తులు దోచేసేవారు’
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు ప్రశాంతంగా ఉంటున్నారు. 2024లో కూడా మరోసారి మీరు తప్పు చేసి ఉంటే.. మీ ఆస్తులు మొత్తం ఈ పాటికి ఎప్పుడో దోచేసేవారు. అని వైసీపీపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. గత గొడ్డలి పార్టీ హయాంలో అందరికీ నరకం చూపించారని.. చివరకు తనను కూడా వదలకుండా జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందారని వ్యాఖ్యానించారు. ఇలాంటి పార్టీని భూస్థాపితం చేయాల్సిన అవసరం …
Read More »పోక్సో కేసులో బండి భగీరథ్ కు బెయిల్
పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్ కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. తెలంగాణ హైకోర్టు ఈ రోజు భగీరథ్ కు బెయిల్ మంజూరు చేసింది. జామీనుతో పాటు రూ.లక్ష పూచీకత్తు, కోర్టు నిర్దేశించిన షరతుల ప్రకారం భగీరథ్ కు బెయిల్ మంజూరైంది. అంతేకాదు, పోలీసుల విచారణ ఏ రకమైన ఆటంకం కలిగించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించిన సాక్షులను, బాధితులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయకూడదని బండి …
Read More »బీఆర్ఎస్ ఖాతాలో 1400 కోట్లు… ఆంధ్రా నుండి వెళ్ళాయా?
తెలంగాణ రక్షణ సమితి(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత సంచలన డిమాండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ ఖాతాలో ప్రస్తుతం 1400 కోట్ల రూపాయలకు పైగానే నిల్వలు ఉన్నాయని.. ఈ సొమ్మును తెలంగాణ రాష్ట్రం కోసం రక్తాన్ని ధారపోసి ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు తక్షణమే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సొమ్మంతా బీఆర్ ఎస్ హయాంలో దోచుకున్నదేనని ఆమె మరో వ్యాఖ్య చేయడం గమనార్హం. పదేళ్లు అధికారంలో …
Read More »మూసీకి కొబ్బరికాయ కొట్టేశారు!
హైదరాబాద్ సుందరీకరణలో భాగంగా కీలకమైన మూసీ నదిని ప్రక్షాళన చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రక్షాళన వేగవంతంగా జరగాలని.. లక్ష్యం ప్రకారం పనులు ముందుకు సాగాలని పేర్కొంది. ఈ మేరకు పరిపాలన, ఆర్థిక పరమైన అనుమతులు ఇస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి. మొత్తం రెండుదశల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates