కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సారథ్యంపై సొంత పార్టీలోనే లుకలుకలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ లేరు. ఈ బాధ్యతలు కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖర్గే చూస్తు న్నారు. అయితే.. ఎంత తెరచాటున ఉన్నా.. రాహుల్ చక్రం తిప్పుతున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ చక్రాలు.. ఈ సూచనలే.. కాంగ్రెస్‌కు మేలు చేయకపోగా నష్టాన్ని చేకూరుస్తున్నాయని అంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. కాంగ్రెస్‌లో రాహుల్‌కు …
Read More »ఉండి టాక్: రఘురామ.. హ్యాపీయేనా…!
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆనంద పడుతున్నారా? సంతోషంగానేఉన్నారా? ఇదీ.. ఇప్పు డు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గంలో వినిపిస్తున్న టాక్. ఎందుకంటే.. రఘురామ కోరుకున్న విధంగా నిన్నమొన్నటి వరకు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. కానీ, గత వారం పదిరోజుల చరిత్రను గమనిస్తే.. రఘురామ కోరుకుంటున్నట్టుగానే పరిస్థితులు మారుతున్నాయి. ఆయన కోరుకున్నట్టే జరుగుతున్నాయి. 1) పదవి పరంగా తనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకున్నారు రఘురామ. నిజానికి ఎన్నికలకు ముందు …
Read More »పెద్దల సభకు పెరుగుతున్న పోటీ.. బాబు కరుణ ఎవరిపై..!
రాజ్యసభకు సంబంధించి ఏపీలో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో రెండు టీడీపీ తీసుకుని.. ఒకటి మాత్రం కూటమి పార్టీలకు అప్పగించాలని ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. దీంతో రెండు స్థానాలు గుండుగుత్తగా టీడీపీకి దక్కనున్నాయి. అయితే..ఈ రెండు స్థానాల విషయంలో టీడీపీలో పోటీ హాట్‌హాట్‌గా సాగుతోంది. నేనంటే నేనే అంటూ.. నాయకులు పోటీ పడుతున్నారు. అంతేకాదు.. సీఎం చంద్రబాబు వద్దకు క్యూ …
Read More »పోలవరంపై అంబటి అలా..నిమ్మల ఇలా !
వైసీపీ హయాంలో పోలవరం పనులు నత్తనడకన సాగిన వైనంపై విమర్శలు వెల్లువెత్తాయి. నీటిపారుదల శాఖకు జగన్ హయాంలో ఇద్దరు మంత్రులుగా పనిచేసినా ఉపయోగం లేదని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై విమర్శలతో బిజీగా ఉన్న అనిల్, అంబటి..పోలవరంపై ఫోకస్ చేయలేదని ట్రోలింగ్ జరిగింది. అసలు పోలవరం పనుల పురోగతి ఏమిటి అన్న విషయాలు కూడా జనానికి తెలియనివ్వలేదు. అయితే, ఎన్డీఏ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖా మంత్రిగా ఉన్న …
Read More »ఉచిత ఇసుక.. బాబు కొత్త స్టెప్ ఇదే..!
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉచిత ఇసుక పథకానికి గ్రహణం వీడడం లేదు. ఎన్నోసార్లు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని తమ్ముళ్లకు చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. అయినా.. ఎక్కడా అధినేత మాటను వంటబట్టించుకున్న నాయకులు కనిపించడం లేదు. దాదాపు నాలుగు నెలలుగా ఇదే తంతు నడుస్తోంది. చంద్రబాబు చెబుతున్నా.. నాయకులు వినిపించుకోవడం లేదు. తాజాగా మరోసారి చంద్రబాబు హెచ్చరించే పరిస్థితి వచ్చింది. ఉభయ గోదావరి జిల్లాలకు …
Read More »మందుబాబులను పరిగెత్తిస్తున్న డ్రోన్లు
అమరావతిలో కొద్ది రోజుల క్రితం జరిగిన డ్రోన్ సమ్మిట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకుంది. భవిష్యత్తు అంతా డ్రోన్ టెక్నాలజీదేనని, డ్రోన్లను ఉపయోగించి ఇన్విజిబుల్ పోలీసింగ్ తో అసాంఘిక శక్తులు, రౌడీ షీటర్లు, క్రిమినల్స్ ఆట కట్టించవచ్చని సీఎం చంద్రబాబు ఆ సమ్మిట్ లో చెప్పారు. అయితే, ప్రాక్టికల్ గా ఇది సాధ్యమా అనుకుంటున్న వారికి అది సాధ్యమే అని ఏపీ పోలీసులు …
Read More »‘కూటమి’ ఎంపీలకు పవన్ విందు.. 108 రకాల వంటకాలు!
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిం దే. మంగళవారం ఢిల్లీకి వెళ్లిన ఆయన వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలపై చర్చించారు. నిధులు, నీళ్లు సహా అనేక విషయాలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. వాటిని సాధించేందుకు ప్రయత్నించారు. బుధవారం పార్లమెంటు భవన్లో ప్రధాని నరేంద్ర మోడీతోనూ పవన్ భేటీ అయ్యారు. అనంతరం.. మరికొందరు కేంద్ర మంత్రలతోనూ భేటీ …
Read More »ఫస్ట్ టూర్లోనే పవన్ సక్సెస్.. 172 కోట్లు ఇచ్చిన కేంద్రం!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తాజాగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అయితే.. ఇది ఆయనకు అధికారం లోకి వచ్చిన తర్వాత తొలి పర్యటన. ఈ ఏడాది జూన్‌లో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పవన్ రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్లినా.. వాటికి వేర్వేరు కారణాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబుతో కలిసి కూడా పవన్ వెళ్లారు. అయితే.. వాటికి, ప్రస్తుతం జరుగుతున్న పర్యటనకు సంబంధం లేదు. తాజాగా మాత్రం …
Read More »నాగబాబు కళ్లలో ఆనందం కోసం.. పవన్ ప్రయత్నం!
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన సోదరుడు, పార్టీ కోసం కృషి చేస్తున్న నాగబాబు కళ్లలో ఆనందం చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. నాగబాబును రాజ్యసభకు పంపించేందుకు.. పవన్ ముమ్మరంగా యత్నస్తున్నారు. ఆయన చేస్తున్న ప్రయత్నాలు దాదాపు ఫలించాయనే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఏపీలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. వీటికి డిసెంబరు 20న ఉప ఎన్నికలు జరగనున్నాయి. పోటీ ఉంటే ఎన్నికలు పెడతారు. లేకపోతే …
Read More »ఏపీలో డ్రగ్స్ పై ‘ఈగల్’ ఐ
వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అమ్మకం, వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయాయని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ మూల గంజాయి, డ్రగ్స్ దొరికినా..దానికి ఏపీతో లింకులు ఉండడంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలోనే గంజాయి అమ్మేవారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మంత్రి …
Read More »వాళ్లంతా జైలుకు వెళ్లాల్సిందే.. ఇది నా పంతం: ఆర్ ఆర్ ఆర్
“వాళ్లంతా జైలుకు వెళ్లాల్సిందే.. ఇది నా పంతం” అని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఫైర్‌బ్రాండ్ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2021-22 మధ్య కాలంలో తనను అక్రమంగా నిర్బంధించి కేసులు పెట్టి.. తనపై థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించిన వారిని జైలుకు పంపేవరకు.. తనకు మనశ్శాంతి లేదని చెప్పారు. తాజాగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసును కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. ఇక, ఇప్పటికే ఈ …
Read More »ఆ కేంద్ర మంత్రుల భేటీలో పవన్ ఏం చెప్పారు?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు కేంద్ర మంత్రులతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ను భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ మర్యాపూర్వకంగా విందుకు ఆహ్వానించారు. జనసేన ఎంపీలు బాలశౌరి, ఉదయ్ కుమార్ లతో కలిసి ఉప రాష్ట్రపతి ఇచ్చిన విందుకు పవన్ హాజరయ్యారు. మరోవైపు, కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, సీఆర్ పాటిల్, అశ్విని వైష్ణవ్, …
Read More »