అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది. ఫ్యాట్ పిగ్స్, డాగ్స్, స్లోగ్స్ అంటూ మహిళలపై అసభ్యకరమైన పదజాలాన్ని వాడిన ట్రాక్ రికార్డ్ ట్రంప్ సొంతం.
ఇక, ట్రంప్ రాసలీలల వ్యవహారాలు కోర్టుకు చేరడం వంటి నేపథ్యంలో ట్రంప్ పై చాలామంది మహిళలకు వ్యతిరేకత ఉంది. ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయిన సమయంలో ట్రంప్ నకు వ్యతిరేకంగా వేలాదిమంది మహిళలు రోడ్డెక్కారంటే ట్రంప్ అంటే చాలామంది మహిళకు ఎంత ద్వేషమో అర్థమవుతోంది.
అయినా సరే ట్రంప్ మాత్రం ఏమీ మారలేదు. తాజాగా ఓ మహిళ అందంగా ఉంది కాబట్టే ఆమె భర్తకు ఓ పదవి ఇచ్చాను అంటూ ట్రంప్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. డ్రగ్స్ కట్టడి చేసేందుకు ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం పెడుతున్న సందర్భంగా ఓవల్ ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఆ సమావేశంలో యూఎస్ ఇంటీరియర్ సెక్రటరీ డగ్ బర్గమ్, ఆయన భార్య క్యాథరిన్ బర్గమ్ కూడా ఉన్నారు. గతంలో డ్రగ్ అడిక్ట్ అయిన తాను ఆ మహమ్మారి నుంచి ఎలా బయటపడ్డానో క్యాథరిన్ వివరించారు.
అయితే, బర్గమ్ భార్య క్యాథరిన్ చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుందని, అందుకే బర్గమ్ కు తాను ఆ పదవి ఇచ్చానని మీడియా ముందు నిస్సిగ్గుగా వెల్లడించారు ట్రంప్. క్యాథరిన్ వైపు చూస్తూ ట్రంప్ ఈ కామెంట్లు చేయడం మరింత జుగుప్సాకరం. బర్గమ్, క్యాథరిన్ గుర్రపు స్వారీ చేస్తున్న వీడియో చూశానని, అందులో ఆమె చాలా ఆకర్షణీయంగా కనిపించారని ట్రంప్ చేసిన వల్గర్ కామెంట్స్ అక్కడి వారికి షాకిచ్చాయి.
ముఖ్యంగా ఆ కారణంతోనే బర్గమ్ కు పదవిచ్చానని, ఏ మాత్రం మొహమాటపడకుండా ట్రంప్ కామెంట్స్ చేయడం విశేషం. ఇక, బర్గమ్ విజయవంతమైన వ్యాపారవేత్త అని, నార్త్ డకోటాకు రెండుసార్లు గవర్నర్ గా పనిచేశారని కితాబిచ్చిన ట్రంప్…అందులోనూ క్యాథరిన్ కు క్రెడిట్ ఉందని మరోసారి తన వంకర బుద్ధి చాటుకున్నారు.
ట్రంపు కామెంట్లు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. మహిళలను కించపరిచేలా పదేపదే మాట్లాడడం ఆయనకు అలవాటైందని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మహిళలను ఉద్దేశించి ఇటువంటి అభ్యంతరకర, అసభ్యకర, అవమానకర పదజాలం వాడడం ఒక్క ట్రంప్ నకే సాధ్యమని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates