2019 ఎన్నికల్లో ఏపీలోని 175 అసెంబ్లీ సీట్లలో 151 సీట్లు, 25 ఎంపీ సీట్లలో 22 సీట్లు సాధించింది. ఇది నిజంగానే గ్రాండ్ విక్టరీ కిందే లెక్క. అంతకుముందెన్నడూ తెలుగు నేలలో ఏ ఒక్క పార్టీకి కూడా సాధ్యం కాని మెజారిటీనేనని చెప్పాలి. ఈ మెజారిటీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో ఓ రకమైన గుడ్డి నమ్మకాన్ని పెంచి పోషించిందన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 2019లో ఆ …
Read More »వంశీ అరెస్ట్ అయినరోజే… టీడీపీలోకి ఆళ్ల నాని
ఏపీలో విపక్షం వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గురువారం తెల్లవారుజామున ఆ పార్టీకి చెందిన కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ అయ్యారు. ఈ పరిణామం నుంచి వైసీపీ తేరుకోకముందే…రాత్రికంతా పార్టీకి చెందిన మరో కీలక నేత, మాజీ మంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని పార్టీని …
Read More »మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధింపు
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు గురువారం సాయంత్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జాతుల వైరంతో అట్టుడికిపోయిన ఈశాన్య రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ గురువారం సాయంత్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మణిపూర్ లో అధికార పార్టీగా బీజేపీనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం సీఎంగా ఉన్న బీజేపీ సీనియర్ నేత బీరేన్ సింగ్ తన …
Read More »ఒక్క వారంలో బెంగళూరుకు జగన్ రెండు టూర్లు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకనో గానీ… లండన్ టూర్ ముగించుకుని వచ్చిన తర్వాత తాడేపల్లిలో ఉండేందుకు పెద్దగా ఇష్ట పడటం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. బెంగళూరుకు వెళ్లే సమయంలో గన్నవరం నుంచి బయలుదేరిన జగన్.,..తిరుగు ప్రయాణంలో మాత్రం గన్నవరానికి కాకుండా బెంగళూరు చేరుకున్నారు. అక్కడే ఓ మూడు రోజుల పాటు రెస్ట్ తీసుకున్న తర్వాత గానీ జగన్ తాడేపల్లి రాలేదు. తాడేపల్లి వచ్చిన తర్వాత కూడా …
Read More »నారా లోకేశ్… ఓ ట్రెండ్ సెట్టర్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిజంగానే ఓ ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. అదేదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలికేందుకు ప్రత్యర్థులతో రాజీకి పయత్నిస్తే… అతడిని చూపించి టార్చ్ బేరర్ అంటే ఇలానే ఉంటాడంటూ సదరు సినిమాలోని ఓ పాత్ర అదిరేటి డైలాగ్ చెబుతుంది. అది సినిమా. ఏం చెప్పినా… ఏది చేయాలనుకున్నా జరిగిపోతుంది. నిజ జీవితంలో అయితే అలా కాదు …
Read More »తెలంగాణలో మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏఐ సెంటర్లు
ఇప్పుడంతా కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) మీదే చర్చ జరుగుతోంది. ఏఐ రంగం వైపు దాదాపుగా అన్ని దేశాలు పరుగులు పెడుతున్నాయి. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఏఐ జపాన్ని పఠిస్తున్నాయి. ఏపీ నూతన రాజధాని అమరావతిని ఏఐ కేపిటల్ గా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చెబుతుంటే… ఇప్పటికే ఐటీ పరంగా ఓ రేంజి అభివృద్ధి సాధించిన తెలంగాణ రాజధానిని ఇకపై ఏఐకి కేంద్రంగా …
Read More »వంశీ అరెస్టు తర్వాత హై డ్రామా
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేయడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వంశీ అరెస్టు సమయంలో ఎంత హై డ్రామా నడిచిందో…ఆ తర్వాత ఆయనను విజయవాడకు తరలించిన తర్వాత కూడా అంతకు మించిన హై డ్రామా నడిచింది. వంశీని తరలిస్తున్న పోలీసు వాహనాన్ని వంశీ భార్య పంకజశ్రీ అనుసరించడంతో నందిగామ వద్ద ఆమె వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని, తమను …
Read More »సాయిరెడ్డి ప్లేస్లో కన్నబాబు… జగన్ కీలక నిర్ణయం
వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన.. ఉత్త రాంధ్ర జిల్లాల వైసీపీ కో ఆర్డినేటర్ బాధ్యతలను.. కాకినాడ రూరల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు అప్పగించారు. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలు… విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు.. నాయకులను సమన్వయం చేయడం కన్నబాబుకు కీలకం కానుంది. …
Read More »బిగ్ బ్రేకింగ్!.. వల్లభనేని వంశీ అరెస్ట్!
టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ కొట్టిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ అయ్యారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్న వంశీని ఏపీ పోలీసులు గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను పోలీసులు హైదరాబాద్ నుంచ విజయవాడకు తరలిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం సమయంలో ఆయనను విజయవాడలోని కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. టీడీపీతోనే రాజకీయ …
Read More »జగన్ మీటింగ్ లో ‘మర్రి’ కనిపించలేదే!
వైసీపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైనప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి ఆ పార్టీలో కొనసాగుతోంది. ఎన్నికలకు ముందు కొందరు కీలక నేతలు పార్టీని వీడితే… ఎన్నికల్లో పార్టీకి ఘోర పరాభవం ఎదురైన తర్వాత మరింత మంది నేతలు పార్టీని వీడారు. తాజాగా ఇప్పుడు పార్టీకి మంచి పట్టు ఉన్న పల్నాడు జిల్లాలో కీలక నేతగా కొనసాగుతున్న మర్రి …
Read More »లోకేశ్ తో వేగేశ్న భేటీ… విశాఖపై సిఫీ ఆసక్తి
కూటమి పాలనలో ఏపీకి పెట్టుబడుల వరద పోటెత్తుతోంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి గడచిన 7 నెలల్లోనే ఏపీకి రూ.6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో టాప్ టెక్ కంపెనీ ఏపీకి వచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఫార్చూన్ టాప్ 500 కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు పొందిన సిఫీ టెక్ కంపెనీ.. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తోంది. …
Read More »ఉచితాలతో `బద్ధకస్తు`లను పెంచుతున్నారు: సుప్రీం సీరియస్
“ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు.. సమాజంలో బద్ధకస్తులను పెంచుతున్నాయి. ఇది సరికాదు. సమాజంలో పనిచేసే వారు తగ్గిపోతున్నారు. కష్టపడే వయసులోనూ.. పనిచేయకుండా ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితికి రాజకీయాలే కారణం. దీనిపై సరైన విధానం అంటూ ఒకటి ఉండాలి. లేకపోతే.. సమాజాలు దైన్యంగా మారి.. ఉత్పత్తి శక్తి నశిస్తుంది. అంతిమంగా ఇది మరో ఉపద్రవానికి దారితీస్తుంది“ అని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates