నిజమే… నిన్నటిదాకా ఏపీలో ఎవరిపై ఎవరైనా నోరు పారేసుకున్నారు. అసలు అవతలి వ్యక్తులు తమకు సంబంధించిన వారా? లేదా? అన్న విషయాన్ని కూడా అసభ్యతతో చెలరేగిపోయారు. గొడవలు, కక్షలు, ఫ్యాక్షనిజాలను రెచ్చగొలట్లేలా వ్యాఖ్యలూ చేశారు. ఏం చేసినా ఫరవా లేదన్నభావన విస్తృతంగానే వినిపించింది. అయితే ఒక్కటంటే ఒక్క రోజులోనే పరిస్థితి మొత్తం మారిపోయింది. సంబంధం లేని వారే కాదు…సంబంధమున్నా కూడా అవతలి వారిపై నోరు పారేసుకోవాలంటే ఏపీలో ఇకపై ఒకటికి పదిసార్లు ఆలోచించుకోక తప్పదు. ఈ మార్పునకు కేవలం రెండంటే రెండు ఘటనలే కారణంగా నిలిచాయి.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డి ఐటీడీపీ యాక్టివిస్టు చేబ్రోలు కిరణ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు నిమిషాల్లో వైరల్ అయిపోగా.. వైసీపీ శ్రేణులు కూడా గట్టిగానే స్పందించాయి. ఏమైందో తెలియదు గాని,… భారతి రెడ్డిని అసభ్య పద జాలంతో దూషించిన నోటీతోనే కిరణ్ క్షమాపణలు చెప్పారు. అదంతా బుధవారం రాత్రి జరిగితే… గురువారం ఉదయానికే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కిరణ్ వ్యవహారం గురించి తెలిసిన టీడీపీ అధిష్ఠానం కిరణ్ ను ఐటీడీపీ నుంచి బహిష్కరించింది. అంతేకాకుండా కిరణ్ పై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఫలితంగా ఐటీడీపీ నుంచి బహిష్కరణకు గురైన గంటల వ్యవధిలోనే కిరణ్ అరెస్టయ్యారు.
ఇదిలా ఉంటే… రెండు రోజుల క్రితం ఏలూరులో జరిగిన వైసీపీ సమావేశంలో తణుకు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రెచ్చగొగ్టే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తున్న వారందరినీ గుర్తు పెట్టుకుంటామన్న కారుమూరి… వైసీపీ అధికారంలోకి రాగానే వారి బదులు తీర్చుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గుంటూరు ఇవతల ఇళ్ల నుంచి బయలకు లాగి కొడతామన్న కారుమూరి… గుంటూరు అవతల బయటకు లాగి నరికేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విస్మయం వ్యక్తం అయ్యింది. తాజాగా కిరణ్ వ్యవహారం నేపథ్యంలో కారుమూరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరి ఈ వ్యవహారంలో కారుమూరిని పోలీసులు అరెస్టు చేస్తారో, లేదో చూడాలి. మొత్తంగా ఈ రెండు ఘటనల ద్వారా ఏపీలో చాలా మంది నోళ్లకు తాళం పడిపోయినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.