ఇస్రో కేంద్రాలు, పోర్టుల వద్ద హై అలర్ట్

పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత్ శుక్రవారం మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. దేశంలోని అన్ని పోర్టులు, అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు వద్ద భద్రతను ఓ రేంజికి పెంచేసింది. దాదాపుగా పోర్టులన్నీ సరిహద్దుల వెంటే ఉన్న నేపథ్యం… వాటి నుంచే మన నావికా దళం ప్రత్యర్థి దేశంపై విరుచుకుపడుతుండటం, విదేశీ వాణిజ్యానికి పోర్టులు కీలక కేంద్రాలుగా కొనసాగుతున్న నేపథ్య్లంలో వాటికి ఎంతమాత్రం నష్టం జరగని రీతిలో భారత్ పటిష్ట చర్యలు చేపట్టింది  భారత్ లోని పోర్టుల ద్వారా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే ప్రమాదం ఉందన్న నేపథ్యంలో పోర్టుల వద్ద హైఅలర్ట్ ప్రకటించారు.

ఇక భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు (ఇస్రో) కూడా భారత ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తున్నాయి. అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇప్పటికే స్వయం సమృద్ధి సాధించిన భారత్.. ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను కూడా విజయ వంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెడుతోంది. ఇటీవలి కాలంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు ఏమాత్రం తీసిపోని రీతిలో కూడా ఇస్రో సాగుతోంది. అంంతేకాకుండా మన చేతిలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పని చేయాలంటే కూడా అంతరిక్షంలోని ఉపగ్రహాలే కీలక కదా. ఈ క్రమంలో భారత్ కు చెందిన ఇస్రో కేంద్రాలను పాక్ టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. 

భారత్ తో ఇస్రో ప్రధాన కేంద్రం బెంగళూరులో ఉండగా… ఉపగ్రహాల ప్రయోగాలకు ముఖ్య కేంద్రంగా ఏపీలోని నెల్లూరు జిల్లా పరిధిలోని శ్రీహరికోటలోని షార్ కీలకంగా పనిచేస్తోంది. ఈ రెండు కేంద్రాలతో కలిపి దేశవ్యాప్తంగా ఇస్రోకు 11 కేంద్రాలు ఉన్నాయి. పాక్ తో యుద్ధం నేపథ్యంలో ఈ అన్ని కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ కేంద్రాలన్నీ ఇప్పటికే సిీఐఎస్ఎఫ్ భద్రతలో ఉండగా…యుద్ధం నేపథ్యంలో సీఐఎస్ఎఫ్ బలగాలను ఆయా కేంద్రాల వద్ద డబుల్ చేశారు. ఇక పోర్టుల వద్ద భద్రతను రెండో స్థాయికి పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం  తీసుకుంది.