Political News

ప్రభుత్వం తరఫున లోకేశ్ క్షమాపణలు

రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయం ప్రభుత్వానికి తెలిసే జరిగే అవకాశాలు తక్కువ. కొన్ని విషయాలు ప్రభుత్వానికి, అధికార పార్టీకి ఏ మాత్రం సంబంధం లేకుండా జరిగిపోతుంటాయి. అయినప్పటకీ, ఆ ఘటనలు ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తెస్తుంటాయి. ఇటువంటి క్రమంలో ఆ ఘటనను ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుంది అన్నదానిపై డ్యామేజ్ కంట్రోల్ ఉంటుంది. తాజాగా ఏపీలో జరిగిన ఈ తరహా ఘటనను సంబంధించి మంత్రి లోకేశ్ హ్యాండిల్ చేసిన తీరుపై …

Read More »

బోరుగడ్డపై కోర్టు సీరియస్

పలు కేసులలో విచారణ ఎదుర్కొంటున్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ మధ్యంతర బెయిల్ పై బయటకు వెళ్లిన వైనంపై తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఫేక్ మెడికల్ సర్టిఫికెట్లతో బోరుగడ్డ బెయిల్ పొందారని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆయనకు ఇచ్చిన బెయిల్ గడువు ముగియడం, ఆ తర్వాత కోర్టు మరోసారి మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో రాజమండ్రి జైలుకు వచ్చి ఈ రోజు ఉదయం బోరుగడ్డ లొంగిపోయారు. …

Read More »

పోసాని రిలీజ్ ఇప్పుడప్పుడే కాదు

వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి ఇప్పుడప్పుడే జైలు నుంచి విముక్తి కలిగేలా లేదు. ఇప్పటికే నాలుగు కోర్టుల నుంచి బెయిల్ లభించడంతో బుధవారం పోసాని రిలీజ్ అవుతారని అంతా అనుకున్నా.. బుధవారం ఉదయం ఊహించని రీతిలో ఏపీ సీఐడీ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఫలితంగా కర్నూలు జైలు నుంచి విడుదల కావాల్సిన పోసాని… బుధవారం మధ్యాహ్నంలోగా సీఐడీ పోలీసుల అదుపులోకి వెళ్లనున్నారు. వెరసి …

Read More »

హస్తినలో వైసీపీ హవా తగ్గలేదబ్బా!

నిజమేనండోయ్… దేశ రాజధానిలో ఏపీ విపక్షం వైసీపీ హవా ఎంతమాత్రం తగ్గలేదు. అధికారంలో ఉండగా… ఢిల్లీలో ఆ పార్టీ హవా ఎలా నడిచిందో… ఆ పార్టీ విపక్షంలోకి మారిపోయిన తర్వాత కూడా అదే హవాను కొనసాగిస్తోంది. ప్రత్యేకించి ఆ పార్టీనే కాకుండా రాజకీయాల నుంచే తప్పుకున్న వేణుంబాక విజయసాయిరెడ్డి ఢిల్లీలో పార్టీకి వేసిన పునాదులు ఇంకా గట్టిగానే పనిచేస్తున్నట్టున్నాయి. నాడు రాజ్యసభలో ప్యానెల్ వైస్ చైర్మన్ గా సాయిరెడ్డి వ్యవహరించగా.. …

Read More »

సజ్జన్నార్ పై అవినీతి ఆరోపణలు… నిజమేంత?

తెలంగాణలో మంగళవారం ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ పరిణామం కేవలం నిమిషాల వ్యవదిలో రాష్ట్రంలో ఓ పెను చర్చకే తెర తీసింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్సార్టీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జన్నార్.. సంస్థలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కొందరు ఆర్టీసీ ఉద్యోగులు వినూత్న నిరసనకు దిగారు. అంతటితో ఆగని వారు.. సజ్జన్నార్ అవినీతికి ఇవిగో …

Read More »

ఫీజు పోరు కాస్తా.. రణరంగం కానుందా?

ఏపీలో విపక్ష పార్టీ వైసీపీ బుధవారం ఫీజు పోరు పేరిట రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది. అయితే ఈ పోరు బాట కాస్తా రణరంగంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ ఫీజు పోరుకు అక్కడికక్కడే సమాధానం చెబుతామంటూ అధికార టీడీపీ రంగంలోకి దిగిపోయింది. ఈ మేరకు టీడీపీ విద్యార్థి విభాగం తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ మంగళవారం ఓ కీలక ప్రకటన చేశారు. వైసీపీ ఫీజు …

Read More »

బాబు ‘అరకు’ కష్టానికి మరో గుర్తింపు

ఏపీలోని ఉత్తరాంధ్ర అడవులు.. ప్రత్యేకించి విశాఖ మన్యం అడవులు అరకులో సాగు అవుతున్న కాఫీకి ఎక్కడ లేని ప్రాధాన్యం ఉంది. రుచిలో ప్రపంచంలోనే అత్యుత్తమ వెరైటీగా నిలిచిన అరకు కాఫీకి ఇప్పటిదాకా పెద్దగా గుర్తింపే దక్కలేదు. అయితే ఇప్పుడు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ కారణంగా అరకు కాఫీ ఖండాంతరాలు దాటిపోతోంది. తాజాగా దేశంలోని అత్యున్నత చట్ట సభ పార్లమెంటులో అరకు కాఫీ కేఫ్ …

Read More »

గడువు ముగిసింది… బోరుగడ్డ పారిపోయాడు

అంతా అనుకున్నట్టే అయ్యింది. వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ పరారయ్యారు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్న అనిల్…హైకోర్టు ఇచ్చిన సదరు బెయిల్ నిబంధనల ప్రకారం మంగళవారం (ఈ నెల11) సాయంత్రం 5 గంటలకు రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో లొంగిపోవాల్సి ఉంది. గత నెలలో మంజూరు అయిన మధ్యంతర బెయిల్ ను అనిల్ వినతి మేరకు హైకోర్టు ఈ నెల 11 దాకా పొడిగించింది. దీంతో …

Read More »

నిన్న బాబు, నేడు లోకేశ్… స్టాలిన్ కు కష్టమే

త్రిభాషా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు దేశంలో ఒంటరిగా మారిపోతోంది. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తున్న తమిళనాడు అధికార పార్టీ డీఎంకే… త్రిభాషా విధానాన్ని తెర మీదకు తీసుకుని వచ్చి కేంద్రంతో ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాలు తనకు మద్దతుగా నిలుస్తాయని కూడా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ భావించారు. అయితే స్టాలిన్ కు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ అధినేత, …

Read More »

‘నారాసుర రక్తచరిత్ర’పై బాబు మాట

2019 ఎన్నికల ముంగిట వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, వైఎస్ జగన్ చిన్నాన్న అయిన వివేకానందరెడ్డి మరణం ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ముందేమో ఆయన గుండెపోటుతో చనిపోయాడన్నారు. తర్వాత ఆయనది దారుణమైన హత్య అనే విషయం బయటికి వచ్చింది. ఆపై అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మీద నింద మోపడానికి ప్రయత్నించారు. చివరికేమో ఈ హత్య కేసు వైఎస్ అవినాష్ మెడకే చుట్టుకుంది. జగన్‌కు సైతం ఈ …

Read More »

బాబు సో ల‌క్కీ.. ఇంత విధేయులా.. ?

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎంత ల‌క్కీ అంటే… ఎమ్మెల్సీ సీటుపై ప్రగాఢ ఆశ‌లు పెట్టుకున్న వారు కూడా.. కించిత్తు మాట అన‌కుండా.. స‌ర్దుకుపోతున్నారనేంతగా ఆయ‌న ల‌క్కీ అనే చెప్పాలి. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల టికెట్ల‌ను పంచేశారు. అయితే.. ఆశావ‌హుల‌కు ఒక్క‌రికీ దీనిలో చోటు ద‌క్క‌లేదు. దీంతో ఇంకేముంది.. పార్టీలో పెద్ద ఎత్తున ముస‌లం పుడుతుంద‌ని.. పార్టీ చిన్నాభిన్నం అవుతుంద‌ని పెద్ద ఎత్తున వైసీపీ నాయ‌కులు ఎదురు చూశారు. కానీ, …

Read More »

ఇంటికి సెంటు భూమి కూడా కక్షసాధింపే

వైసీపీ పాలనలో ఏపీలో సొంతిల్లు లేని కుటుంబాలకు ఎక్కడిక్కడ స్థలాలతో పాటు ఇళ్ల నిర్మాణాలకు కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి గ్రామంలో ఇల్లు లేని పేదలను గుర్తించి… ఆయా గ్రామాల పరిధిలోనే ప్రభుత్వ స్థలాలు ఉంటే సరి.. లేదంటే ప్రైవేటు భూములను కొనుగోలు చేసి మరీ ఇళ్ల స్థలాలను జగన్ సర్కారు పంపిణీ చేసింది. ఒక్కో లబ్ధిదారుడికి కేవలం సెంటు, కాస్తంత ఎక్కువగా స్థలం ఉంటే …

Read More »