ఏపీ సీఎం చంద్రబాబు పర్యాటక రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చినట్టుగానే ఇప్పుడు కూడా ఐటికి ప్రాధాన్యం ఇస్తూనే.. మరోవైపు పర్యాటక రంగానికి మరింత ఎక్కువ ప్రాధాన్యం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయలు పైబడి పర్యాటక రంగంలో రాబట్టాలని ప్రయత్నిస్తున్నట్టు చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయితే ఇది చాలా పెద్ద వ్యూహంతో కూడుకున్న ప్రకటనగానే పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే …
Read More »మీడియాకు ఈ రేంజి వార్నింగ్ ఇదే తొలిసారి!
తెలంగాణ రాజధాని హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మహాన్యూస్ టీవీ ఛానెల్ కార్యాలయంపై శనివారం విపక్ష బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి తీవ్రత ఏ రేంజిలో ఉందంటే… దాడి జరిగిన మరుక్షణమే సదరు కార్యాలయాన్ని మహాన్యూస్ ఖాళీ చేసి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ దాడి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపగా… దానిని మించి ఆదివారం బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి జగదీశ్ …
Read More »2027లోనే జమిలి ఎన్నికలు: పెద్దిరెడ్డి
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి ఇప్పటికి 13 నెలలు దాటిపోతోంది. ఎక్కడికక్కడ ప్రభుత్వాలు ఏర్పడిపోయాయి. ఎవరికి తగ్గట్టుగా వారు పాలన సాగిస్తున్నారు. తిరిగి ఎన్నికలు రావాలంటే…రాజ్యాంగం ప్రకారం ఐధేళ్లు.. అంటే ఇంకో 3 ఏళ్ల 11 నెలల సమయం అయితే ఆగాల్సిందే కదా. మరి ఎందుకో గానీ… ఏపీలో 2019 నుంచి ఐధేళ్ల పాలు పాలన సాగించిన వైసీపీ… 2029 వరకు ఆగలేకపోతోంది. అంతకంటే ముందే ఎన్నికలు జరిగి తిరిగి తాను అధికారంలోకి రావాలని …
Read More »56 మంది ఎమ్మెల్యేల డుమ్మా… బాబు ఫైరింగ్
ఏపీలోని కూటమి ప్రభుత్వ రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) విస్తృత స్థాయి సమావేశం ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సుదీర్ఘంగా సాగింది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు తదితరులంతా హాజరు కావాలని పార్టీ అధిష్ఠానం ఒకింత గట్టిగానే చెప్పింది. అయితే ఇతర వర్గాల వారు బాగానే హాజరైనా.. ఎమ్మెల్యేల కోటాలో మొత్తం 135 మంది ఉంటే..వారిలో ఏకంగా 56 …
Read More »జగన్‌కు షర్మిల ఒక ప్లస్.. రెండు మైనస్ ..!
వైసిపి అధినేత జగన్… కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిలు కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా.. ఏం మాట్లాడినా.. షర్మిల తీవ్ర స్థాయిలో జగన్ ను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. విషయం ఏదైనా జగన్ మాట ఉండాల్సిందే. జగన్ను విమర్శించాల్సిందే. ఇది ఇప్పుడే కాదు.. షర్మిల గత ఏడాదిన్నర కాలంగా అనుసరిస్తున్న బాట. అయితే. నిజంగానే షర్మిల ఈ లైన్ లో వెళ్లడం …
Read More »నాయకులను అలర్ట్ చేసిన చంద్రబాబు
ఏపీలోని కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న టీడీపీ.. తాజాగా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, జిల్లాల పార్టీ ఇంచార్జులు.. ఇలా ఓ వెయ్యి మంది వరకు హాజరయ్యారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక్క రోజు జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయకులకు, మంత్రులకు విడివిడిగా దిశానిర్దేశం చేశారు. పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్లాలని నాయకులకు …
Read More »టార్గెట్ పోలవరం: చంద్రబాబు కీలక అప్డేట్
ఏపీ జల జీవనాడి.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సీఎం చంద్రబాబు కీలక అప్డేట్ ఇచ్చారు. టార్గెట్ పోలవరం అంటూ.. ఆయన సమాచారం పంచుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పనిచేస్తోందని చెప్పిన చంద్రబాబు.. కేంద్రం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పిన.. ఆయన 2027 నాటికి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 12,500 కోట్లు …
Read More »అమిత్ షా సభలో టీ కాంగ్రెస్ మంత్రులు
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన నిజామాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్ర పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో అమిత్ షా వెంట పెద్ద ఎత్తున బీజేపీ నేతలు పాలుపంచుకున్నారు. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ తెలంగాణలోని అధికార కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు మంత్రులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఈ …
Read More »కర్మఫలం!..సొంతింటి నుంచే పెద్దారెడ్డి గెంటివేత!
ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాలు నిత్యం వాడీవేడీగానే ఉంటున్నాయి. ప్రత్యేకించి జిల్లాలోని తాడిపత్రిలో అయితే ఎప్పుడేం జరుగుతుందో అన్న భయం ఇటు ప్రజల్లో అటు పోలీసుల్లో నెలకొని ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సెలవు దినం ఆదివారం తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదివారం ఉదయం తాడిపత్రి లోని తన సొంతింంటికి రాగా… ఆయనపై దాడి జరిగే ప్రమాదం ఉందన్న ముందస్తు సమాచారంతో ఆయనను పోలీసులు బలవంతంగా అక్కడి …
Read More »స్వేచ్ఛ ఆత్మహత్య.. అతను లొంగిపోయాడు
తెలుగులో ప్రముఖ న్యూస్ ప్రెజెంటర్లలో ఒకరైన స్వేచ్ఛ వొటేర్కర్ ఆత్మహత్యకు పాల్పడడం ఇటీవల సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడమే కాక.. కవిత్వం రాయడం, సామాజిక సమస్యలపై బలంగా గళం విప్పడం లాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి ఇలా బలవన్మరణానికి పాల్పడడం జర్నలిస్టు వర్గాలను షాక్‌కు గురి చేసింది. చాలా ఏళ్ల కిందటే భర్త నుంచి విడిపోయిన స్వేచ్ఛకు వయసు మీద పడ్డ తల్లిదండ్రులు, 13 …
Read More »కొండా వారి కళ్లు తెరుచుకున్నాయా?
కొండా మురళి.. రాజకీయంగా సీనియర్ నాయకుడు. మంత్రి సురేఖ భర్త. గతంలో కాంగ్రెస్‌లోనే ఉన్న ఆయన..తర్వాత వరుస గా పార్టీలు మారుతూ వచ్చారు. అయితే.. ఏ పార్టీలో ఉన్నా ఆధిపత్య రాజకీయాలకు ఆయన కేరాఫ్ అనే మాట ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులకు తెలియంది కాదు. వైసీపీ, బీఆర్ ఎస్ పార్టీలలోనూ కొండా ఫ్యామిలీ ఇలానే చేసింది. ఇక, ఇప్పుడు కూడా అవే పరిస్థితులు తెరమీదికి వచ్చాయి. దీంతో అధిష్టానం …
Read More »కొడాలి ప్లేస్…. రాము రీప్లేస్ ..!
దాదాపు ఏడాది కాలం తర్వాత తన సొంత నియోజకవర్గంలోకి ఎవరైనా నాయకుడు వస్తే ఆయనకు చెందిన కార్యకర్తలు, ఆయనకు చెందిన అనుచరులు, ఆయన అనుకూల వ్యక్తులు సంబరాలు చేసుకుంటారు. స్వాగతాలు పలుకుతారు. ఒక రకంగా పండగ వాతావరణం కనిపిస్తుంది. రాకరాక వచ్చిన నాయకుడికి గజమాలలు వేసి స్వాగతాలు పలుకుతారు. ఇది గతంలో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కనిపించింది. ముఖ్యంగా గుడివాడ వంటి కీలక నియోజకవర్గంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates