ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా. వైఎస్ కుటుంబంలో తీవ్ర స్థాయిలో పరస్పరం మాటల దాడి జరుగుతోంది. వైఎస్ జగన్, అవినాష్ రెడ్డి ఓ వైపు ఉంటే… మరోవైపు షర్మిళ, సునీత నిలిచారు. వైఎస్ వివేకా హత్య విషయంలో ఒకరి మీద ఒకరు తీవ్రంగా విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. పులివెందులలో జరిగిన సభలో షర్మిళ, సునీతల మీద జగన్ ఎలా విరుచుకుపడ్డాడో తెలిసిందే. ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా …
Read More »పలచనైపోతాం.. చులకనైపోతాం.. కేటీఆర్‌లో ఎంత మార్పు!
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ జోరు ప్రదర్శించారు. విదేశీ పర్యటనలు, కార్పొరేట్ సంస్థలతో మీటింగ్‌లతో బిజీగా ఉండేవారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గానూ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉండేవారు. ప్రత్యర్థి పార్టీల విమర్శలకు, ఆరోపణలకు తనదైన స్టైల్లో దూకుడుగా రిప్లే ఇచ్చేవారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. రాజకీయాల్లో ఓడలు బడ్లవడం కామనే. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో లేదు. ప్రతిపక్షంలో …
Read More »పిఠాపురంలో ఇంకో ఇద్దరు పవన్ కళ్యాణ్‌లు?
రాజకీయంగా తనకు ప్రధాన ప్రత్యర్థి నారా చంద్రబాబు నాయుడే అయినప్పటికీ.. వైఎస్ జగన్ దృష్టి ఎక్కువగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదే ఉంటుందన్నది వాస్తవం. 2014లో విజయం ఖాయమనుకున్న తనకు ఓటమి ఎదురవడానికి బాబుకు పవన్ ఇచ్చిన మద్దతే కారణమని జగన్ భావిస్తారు. అందుకే పవన్‌ను విమర్శినంత దారుణంగా చంద్రబాబును కూడా టార్గెట్ చేయరంటే అతిశయోక్తి కాదు. ప్రతి మీటింగ్‌లోనూ దత్త పుత్రుడు అని, ప్యాకేజ్ స్టార్ అని, …
Read More »జగన్‌కు వివేకా భార్య బహిరంగ లేఖ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై ఇప్పటికే ఆయన తనయురాలు సునీత, ఆయన అన్న కూతురు షర్మిళ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిల మీద ఎలా తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడుతున్నారో తెలిసిందే. దీనికి జగన్, అవినాష్ కూడా గట్టిగానే బదులిస్తున్నారు. కానీ వివేకా హత్య అంశం రోజు రోజుకూ బలమైన రాజకీయ అంశంగా మారుతున్న నేపథ్యంలో వివేకా సతీమణి సౌభాగ్యమ్మ ఇప్పుడు లైన్లోకి వచ్చారు. వివేకా హత్య …
Read More »జగన్ స్పీచ్‌లో వివేకా రెండో పెళ్లి
గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకా హత్య ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. అప్పుడు అది ఎన్నికల అంశంగా మారి.. జగన్ పట్ల సానుభూతికి కారణమైంది. ఐతే ఇప్పుడు కూడా వివేకా హత్య కేసు ఎన్నికల అంశమే. కాకపోతే అప్పుడు జగన్‌కు కలిసొచ్చిన ఆ కేసు.. ఇప్పుడు ఆయనకు ప్రతికూలంగా మారింది. జగన్ సోదరుడైన అవినాష్‌పై …
Read More »అటు హీరో వెంకటేశ్‌కు.. ఇటు పొంగులేటికి వియ్యంకుడు
రామసహాయం రఘురాం రెడ్డి.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన పేరు ఇది. ఎంతో ఉత్కంఠ నెలకొన్న ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న రఘురాం రెడ్డి గురించి ఇప్పుడు చర్చ జోరందుకుంది. మొత్తానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పంతం దక్కించుకుని తన వియ్యంకుడైన రఘురాం రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రఘురాం రెడ్డి కేవలం పొంగులేటికే కాదు అగ్ర సినీ నాయకుడు వెంకటేశ్‌కు …
Read More »ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలా
ఏపీ సీఎం జగన్ తాజాగా పులివెందులలో నిర్వహించిన సభలో సొంత చెల్లి.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్.. వైఎస్ షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె కట్టుకునే చీరలపై ఆయన వ్యాఖ్యలు సంధించారు. పసుపు చీర కట్టుకుని.. వైఎస్ శత్రువులకు ఆహ్వానించారంటూ.. కామెంట్లు కురిపించారు. నిజానికి షర్మిల తన కుమారుడు రాజా వివాహాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరిలో ఆమె పలువురు అగ్రనేతలను వారి ఇళ్లకు వెళ్లి ఆహ్వానించారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత …
Read More »తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ రిటర్న్ గిఫ్ట్
కరీంనగర్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని భావించిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కు ఆ టికెట్ దక్కకపోయినా ఊరట మాత్రం లభించింది. కరీంనగర్ టికెట్‌ను ఇవ్వని కాంగ్రెస్.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాత్రం పోటీ చేసే అవకాశాన్ని తీన్మార్ మల్లన్నకు కల్పించింది. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న బరిలో దిగనున్నారు. కరీంనగర్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ సీటు కోసం ప్రవీణ్‌రెడ్డి, వెలిచాల రాజేందర్‌రావు, తీన్మార్ …
Read More »20 ఏళ్లలో తొలిసారి.. పోటీలో లేని కేసీఆర్ కుటుంబం
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఓ ఇంట్రస్టింగ్ పాయింట్ హాట్ టాపిక్‌గా మారింది. 20 ఏళ్లలో తొలిసారిగా కేసీఆర్ కుటుంబం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయడం లేదు. అంతేకాదు పార్లమెంట్‌లో అంటే లోక్‌సభ, రాజ్యసభ కలిపి కూడా కేసీఆర్ కుటుంబం నుంచి ఒక్కరూ ప్రాతినిథ్యం వహించడం లేదు. దీంతో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ పార్టీ అవతరించిన తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి. 2004లో …
Read More »సానుభూతి ఎన్నికల్లో టఫ్ ఫైట్
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. పెరుగుతున్న ఎండల కంటే కూడా రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో ఆ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగానే ఉంది. ఇక తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ విజయం కోసం మూడు ప్రధాన పార్టీలు కసరత్తుల్లో మునిగిపోయాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ …
Read More »ఆ ఊరు నాయకులకు పుట్టినిల్లు
క్రిష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గంలోని బందలాయి చెరువు అనే చిన్న ఊరు ఏపీలో ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో అందరినీ ఆకర్షిస్తున్నది. ఎందుకంటే రాజకీయ చైతన్యానికి చిహ్నంగా ఉన్న ఆ ఊరు నుండి పలువురు రాజకీయ నేతలు తయారయ్యారు. అందుకే దానిని నాయకులకు పుట్టినిల్లు అని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో మూడు సార్లు ఆవనిగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన సింహాద్రి సత్యనారాయణ ఈ ఊరికి చెందినవారు కావడం విశేషం. మచిలీపట్నం …
Read More »రాజంపేటకు రాంరాం చెప్పినట్లేనా ?!
ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న లోక్ సభ నియోజకవర్గాలలో రాజంపేట ఒకటి. దశాబ్దాలుగా తాతలు, తండ్రుల కాలం నుండి రాజకీయ వైరం ఉన్న రెండు కుటుంబాలకు చెందిన అభ్యర్థులు ఇద్దరూ ఈ సారి ఒకరిని ఒకరు ఢీకొడుతున్న నేపథ్యంలో ఈ ఎన్నిక ఈసారి హాట్ టాపిక్ గా మారింది. ఆ రెండు కుటుంబాల్లో ఒకటి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిది కాగా, మరొకటి మంత్రి పెద్దిరెడ్డి …
Read More »