రాష్ట్రంలో ప్రజలను గాలికి వదిలేసి.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విమర్శించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ నాయకుడు నాగ మల్లే శ్వరరావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. గత ఏడాది ఎన్నికల తర్వాత.. ఆత్మహత్య చేసుకున్న మల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం.. జగన్ మీడియాతో మాట్లాడారు.
మల్లేశ్వరరావును ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా హిం సించారని తెలిపారు. తీవ్రంగా కొట్టారని.. దుర్భాషలాడారని తెలిపారు. టీడీపీ విజయం సాధించిందని తెలిసిన తర్వాత మరింతగా వేధింపులు ఎదురయ్యాయన్నారు. దీంతో అవమానాన్ని భరించలేక.. మరుస టి రోజు గుంటూరులో ఉన్న అతని సోదరుడి ఇంటికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని జగన్ ప్రశ్నించారు.
పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరావు ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించా లని జగన్ చెప్పారు. ఎన్నికలకు ముందు తమ కు అనుకూలమైన పోలీసులను నియమించుకున్నారని, వారి ద్వారా వైసీపీ కార్యకర్తలు, నాయకులను అణిచివేశారని అన్నారు. కూటమిని గెలిపించుకునేందుకు అన్యాయాలు చేశారని.. మల్లేశ్వరరావు ఇంటిని కూడా ధ్వంసం చేశారని, ఆయన కుటుంబాన్ని కూడా బెదిరించారని.. చెప్పారు. సీఐ బెదిరింపులతో ఈ కుటుంబం తలదాచుకునేందుకు వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చిందన్నారు.
ఈ ఘటనపై మల్లేశ్వరరావు తండ్రి అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని జగన్ అన్నారు. మీ కారణంగా చనిపోయిన నాగమల్లేశ్వరరావుకు భార్యా, కూతురు ఉన్నారు. చంద్రబాబు ఏం సమాధా నం చెబుతారు?. ఏడాది గడిచినా ఆ కుటుంబం ఇంకా శోకంలోనే ఉంది. వారి కన్నీళ్లు మీకు పట్టడం లేదా ? చంద్రబాబూ? అని వ్యాఖ్యానించారు. కాగా..జగన్ వెంట భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates