తెలంగాణకు మళ్లీ చెబుతున్నా.. అంటూ ఏపీ సీఎం చంద్రబాబు కీలక కామెంట్లు చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను కూర్చుని చర్చించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. దీనికి నాయకులు, పార్టీలు సహకరించాలని ఆయన సూచించారు. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత, సమన్వయం చాలా అవసరమని.. గతంలో తాము సహకరించామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవాలని కొందరు అనుకున్నారు.కానీ.. మేం సహకరించాం.. అని తెలిపారు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో …
Read More »జగన్‌ను కలిసిన వంశీ.. ఏం చెప్పారంటే!
“దేవుడు అన్నీ చూస్తున్నాడు.. ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది.” అని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్న ఆయన.. మనకు కూడా మంచి రోజులు వస్తాయని.. అప్పుడు మనం కూడా చేయొచ్చని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తాజాగా పలు కేసుల నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన వైసీపీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సతీసమేతంగా జగన్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా …
Read More »నేనెవరికీ.. భయపడ: కొండా మురళి
శషబిషలకు తావు లేకుండా మంత్రి కొండా సురేఖ భర్త మురళీ కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు. నేనెవ రికీ భయపడేది లేదన్నారు. అంతేకాదు.. నేను ఎవరినీ బ్రతిమాలేది కూడా లేదన్నారు. వరంగల్ రాజకీ యాలు తనకు కొట్టిన పిండి అన్న ఆయన.. ఎవరో వచ్చి.. తనపై ఏదో చెబితే వినేవారికి కొంత విచక్షణ ఉండాలని అనుకోవడం తప్పేలేదన్నారు. అయితే.. తాను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ …
Read More »జగన్ అప్పుకీ బాబు అప్పుకీ అదే తేడా
“ఔను.. అప్పు చేశాం. కూటమి ప్రభుత్వంలోనూ అప్పులు చేశారని కొందరు(వైసీపీ) యాగీ చేస్తున్నారు. కానీ, వారిలా కాదు. మేం చేసిన అప్పులు అభివృద్ధికి వినియోగించాం. దీని నుంచి సంపద సృష్టిస్తున్నాం. దానినే ప్రజలకు సంక్షేమం రూపంలో అందిస్తున్నాం. వారిలా(జగన్) అప్పులు చేసి దానిని తీర్చేందుకు కూడా మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి మాకు లేదు. అసలు అప్పుల గురించి జగన్‌కు మాట్లాడే హక్కు లేదు.” అని సీఎం చంద్రబాబు సంచలన …
Read More »వంశీకి ధైర్యం చెప్పిన జగన్
వైసీపీ హయాంలో చేసిన అరాచకాలకు సంబంధించి నమోదు అయిన కేసుల నుంచి ఎట్టకేలకు తాత్కాలిక ఉపశమనం పొందిన ఆ పార్టీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గురువారం పార్టీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం తన సతీమణిని వెంటబెట్టుకుని తాడేపల్లిలోని జగన్ ఇంటికి వెళ్లిన వంశీ… జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా …
Read More »‘సుపరిపాలన’ బాగుంది.. జగన్ పిలుపుకు స్పందన కరువు
ఏపీలో ఒకేసారి కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న టీడీపీ, ప్రతిపక్షం వైసీపీ రెండు కార్యక్రమాలు చేపట్టాయి. టీడీపీ గత ఏడాది కూటమి పాలనలో జరిగిన మేలు, చేపట్టిన సంక్షేమం, ప్రజలకు ఇచ్చిన పథకాలు వంటివాటిని వివరించే ప్రయత్నం చేసింది. దీనికి సుపరిపాలనలో తొలి అడుగు-ఇది మంచి ప్రభుత్వం అని పేరు పెట్టింది. ఇక, ప్రతిపక్షం(ప్రధాన కాదు) వైసీపీ కూడా ఇదే తరహాలో ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నం చేసింది. గత …
Read More »‘బనకచర్ల’లో వైసీపీ వేలు: కూపీ లాగుతున్న బాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఏదైనా ప్రాజెక్టు చేపడితే.. దానికి ముందు వెనుక అనేక రూపాల్లో ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. ఒక నిర్ణయం తీసుకునేందుకు ఆయన వంద సార్లు ఆలోచన చేస్తారు. గతంలో అమరావతి రాజధాని ఏర్పాటు విషయంలోనూ ఆయన అనేక విధాలుగా అధ్యయనం చేశారు. ప్రపంచ స్థాయి నగరంగా రాజధానిని తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ప్రజలను ఒప్పించి.. మెప్పించి.. ఆయన రాజధానికి శ్రీకారం చుట్టారు. అలానే కర్నూలు జిల్లాలో …
Read More »అరుణమ్మకు ప్రమోషన్.. బీజేపీ స్ట్రాటజీ
తెలంగాణ బీజేపీలో పదవుల పందేరం కొనసాగుతోంది. తాజాగా రామచందర్‌రావుకు రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగించిన అధిష్టానం.. ఈ పోస్టును ఆశించిన ఒకరిద్దరు నాయకులను సంతృప్తి పరిచేందుకు మరో రూపంలో వారికి ప్రమోషన్ ఇస్తోంది. ఈ జాబితాలో మహబూబ్‌నగర్ పార్లమెంటు ఎంపీ, ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణకు కీలక పదవిని ఇచ్చింది. అంతేకాదు.. ఇప్పటికే ఆమెకు రెండు పదవులు ఉన్నా.. ఇప్పుడు మూడో పదవిని కట్టబెట్టడం ద్వారా …
Read More »కవిత వ్యూహాల పదును మామూలుగా లేదుగా!
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత రాజకీయంగా ఓ రేంజిలో ఎదుగుతున్నారు. అసలు కవిత అడుగు ఏ దిశగా పడనుందన్న విషయంపై ముందుగానే అంచనా వేయడం ఏ ఒక్కరికీ సాధ్యం కావడం లేదని చెప్పక తప్పదు. బీఆర్ఎస్ లోనే ఉన్నారా? అన్న ఓ జర్నలిస్టు ప్రశ్నకు… “నేను బీఆర్ఎస్ ను ఓన్ చేసుకున్నా. మరి నన్ను బీఆర్ఎస్ ఓన్ చేసుకుందో, లేదో పార్టీనే …
Read More »‘ఖాకీ’ వదిలేసిన యంగ్ ఐపీఎస్… రీజనేంటి?
ఏపీలో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ వేడెక్కిపోతున్నాయి. విపక్షం వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీ పెద్దలు చెప్పినట్టుగా నడుచుకున్న ఐపీఎస్, ఐఏఎస్ లు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. అందులో భాగంగా బుధవారం ఏపీ పోలీసు శాఖలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. యంగ్ ఐపీఎస్ అదికారి సిద్ధార్థ్ కౌశల్ తన పోలీసు డ్యూటీని వదులుకున్నారు. ఈ మేరకు ఆయన స్వచ్ఛంద పదవీ వివరణ (వాలంటరీ రిటైర్ మెంట్ స్కీమ్-వీఆర్ఎస్)కు …
Read More »బొట్టు పెట్టి మరీ స్వాగతం పలుకుతున్నారు
ఏపీలో అధికార కూటమికి ఏది పట్టినా బంగారమే అవుతోంది. ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా ఓ వేడుకను జరపాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్ణయించారు. అయితే అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం, ఆ తర్వాత వరుసగా కురిసిన వర్షాలు… వెరసి జూన్ 12 తర్వాత గానీ సుపరిపాలనలో తొలి అడుగు సమావేశాన్ని నిర్వహించారు. అయితే తాజాగా బుధవారం నుంచి …
Read More »తెలంగాణ పల్లెల్లో సందడి స్టార్ట్!
తెలంగాణలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ సందడి ప్రారంభమైంది. రైతులు, యువత, స్థానిక నాయకులు కూడా సందడిగా ఉన్నారు. ఇదేదో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మేళ్లను చర్చించుకునేందుకు, ముఖ్యంగా రైతు భరోసా వంటి నిధులు విడుదల చేసినందుకు కాదట. ప్యూర్‌గా.. పూర్తిగా.. స్థానిక ఎన్నికల కోసమేనని తెలుస్తోంది. ఇటీవల రాష్ట్ర హైకోర్టు గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. దీనికిగాను 90 రోజుల పాటు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates