వైసీపీ సైకో ఫ్యాక్ట‌రీ: లోకేష్

ఏపీలో ప్ర‌జ‌లు వైసీపీకి గ‌త ఎన్నిక‌ల్లో 11 స్థానాలే ఇచ్చి.. ప‌క్క‌న కూర్చోబెట్టినా ఇంకా బుద్ధి రాలేద‌ని.. ఆ పార్టీ తీరు మార‌లేద‌ని టీడీపీయువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. వైసీపీ సైకోల‌ను త‌యా రు చేసే పెద్ద ఫ్యాక్ట‌రీగా మారింద‌ని ఎద్దేవా చేశారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న లోకేష్ సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా గుంటూరులో ప‌ర్య‌టించారు. ఇక్క‌డి రెంట‌పాళ్ల గ్రామంలో వైసీపీ నాయ‌కుడు.. గ‌త ఏడాది మృతి చెందిన నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు కుటుంబాన్ని ఓదార్చారు.

అయితే.. 72 కిలో మీట‌ర్ల దూరం చేరుకునేందుకు ఏకంగా 8 గంట‌ల సేపు తీసుకోవ‌డం.. దారి పొడ‌వునా.. ప్ర‌జ‌ల‌కు అభివాదం చేసుకుంటూ.. ఇదో ఎన్నిక‌ల యాత్ర‌గా.. బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌గా మార్చుకోవ‌డం పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీనికి తోడు.. ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన వైసీపీ నాయ‌కులు.. తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేశారు. ఇవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. వీటిపైనా ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

రప్పా రప్పా నరుకుత్తం.. నా కొడ‌క‌ల్లారా.. అన్న వస్తాడు.. అంతు చూస్తాడు. గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా.. రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని అని పేర్కొంటూ… వైసీపీ కార్య‌క‌ర్త‌లు స‌త్తెన‌పల్లి సెంట‌ర్ స‌హా.. రెంట‌పాళ్ల‌లోనూ ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేశారు. ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా దుమారం రేగింది. నారా లోకేష్ స్పందిస్తూ.. ‘యథా అధినేత.. తథా నాయకులు, కార్యకర్తలు. వైసిపి.. సైకోలను తయారు చేసే ఫ్యాక్టరీగా మారింది.“ అని వ్యాఖ్యానించారు.

గ‌త ఎన్నిక‌ల్లో 11 స్థానాల‌కు ప‌రిమితం చేసి పక్క‌న కూర్చోబెట్టినా.. వైసీపీకి ఇంకా బుద్ధి రాలేద‌ని నారా లోకేష్ తెలిపారు. ప్ర‌జ‌ల‌ను భ‌య భ్రాంతుల‌కు గురి చేసే ఇలాంటి చ‌ర్య‌ల‌ను ప్ర‌జా ప్ర‌భుత్వం ఎట్టి ప‌రిస్థితిలోనూ ఉపేక్షించేది లేద‌న్నారు. దీనిపై త్వ‌ర‌లోనే చ‌ర్య‌లు ఉంటాయ‌ని వైసీపీ సైకోబ్యాచ్‌కు హెచ్చ‌రిస్తున్న‌ట్టు పేర్కొన్నారు.