Political News

షర్మిళకు డిపాజిట్ రాదు.. బాధగా ఉంది: జగన్

ఒకప్పుడు అన్యోన్యంగా ఉన్న వైఎస్ కుటుంబ అన్నా చెల్లెళ్లు ఇప్పుడు బద్ధ శత్రువుల్లా మారిపోయి రాజకీయ రణరంగంలో తలపడుతున్న సంగతి తెలిసిందే. జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతుంటే.. ఒకప్పుడు తన తండ్రి సారథ్యం వహించిన, జగన్ విభేదించి బయటికి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఏపీలో షర్మిళ అధ్యక్షురాలు. అన్నా చెల్లెళ్లు ఇద్దరూ ఒకరి మీద ఒకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. జగన్ మద్దతుతో వైసీపీ తరఫున …

Read More »

సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల స‌మ‌న్లు..

తెలంగాణ ముఖ్య‌మంత్రి, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు స‌మ‌న్లు జారీ చేశారు. మే 1న ఢిల్లీలో జ‌ర‌గను న్న విచార‌ణ‌కు రావాల‌ని స‌మ‌న్ల‌లో పేర్కొన్నారు. కీల‌క‌మైన ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన ఈ ప‌రిణామం కాంగ్రెస్ పార్టీలో కుదుపున‌కు దారితీసింది. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్‌కు వ‌చ్చిన పోలీసులు సీఆర్ పీసీ సెక్ష‌న్ 91 మేర‌కు నోటీసులు ఇచ్చారు. తొలుత ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి రాగా.. అక్క‌డ నుంచి …

Read More »

బీజేపీ దెబ్బంటే ఇలా ఉంటుంది!

ఎన్నిక‌ల్లో వ్యూహాలు ఉండ‌డం వేరు.. ఎదుటి పార్టీల‌ను దెబ్బ కొట్టాల‌న్న కుయుక్తులు ఉండ‌డం వేరు. వ్యూహాలు ఎన్న‌యినా.. ప్ర‌త్య‌ర్థులు ప్ర‌తివ్యూహాల‌తో విరుచుకుప‌డే అవకాశం ఉంటుంది. దీంతో రాజ‌కీ యాలు రాజ‌కీయాలుగానే కొన‌సాగుతాయి. కానీ, కుయుక్తులు ప‌న్ని.. ప్ర‌త్య‌ర్థుల‌ను దెబ్బ‌తీసే వ్యూహాలు వేసిన‌ప్పుడు మాత్రం.. ఇబ్బందులు త‌ప్ప‌వు. ఇలాంటి రాజ‌కీయాల్లో బీజేపీ ఆరితేరిపోయింది. ప్ర‌స్తుతం సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. అయితే.. …

Read More »

కమలంతో తెలంగాణ కాంగ్రెస్ కయ్యానికి కాలుదువ్వుతుందా ?

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అత్యధిక స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు బీజేపీ అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నది. ఇక ఇటీవలే తెలంగాణలో అధికారం దక్కించుకున్న రేవంత్ రెడ్డి సీఎం పీఠం నిలబెట్టుకోవాలంటే ఎంపీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవడం తప్పనిసరి. రేవంత్ రెడ్డిని బీజేపీ ఏజెంట్ అని, త్వరలోనే ఆ పార్టీలో చేరడం ఖాయం అని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఐటీ సెల్ …

Read More »

పోసానికి షాక్… ఫ్యామిలీ అంతా చంద్రబాబు వైపు

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా నిరంత‌రం మీడియాలో ప్ర‌చారం చేస్తున్న వైసీపీ నాయ‌కుడు, సినీ న‌టుడు, ర‌చ‌యిత‌, నిర్మాత పోసాని కృష్ణ‌ముర‌ళికి సొంత కుటుంబంలోనే భారీ షాక్ తగిలింది. ఆయ‌నేమో.. నిరంత‌రం సీఎం జ‌గ‌న్ భ‌జ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఏపీ ఫిల్మ్  డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ఉన్న పోసాని.. జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్త‌స్తున్నారు. ఇదేసమ‌యంలో ఆయ‌న చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌పై నిరంతరం విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కానీ, అనూహ్యంగా …

Read More »

ఏపీలో పింఛ‌న్ల ర‌గ‌డ‌.. చంద్ర‌బాబు కొత్త పాయింట్ !

మే 1వ తేదీకి మ‌రో రెండు రోజులు మాత్ర‌మే గ‌డువు ఉండ‌డం.. ఇంటింటికీ వెళ్లి  ఇచ్చే పింఛ‌న్ల వ్య‌వ‌హారం నిలిచిపోవ‌డం నేప‌థ్యంలో మ‌రోసారి ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా వివాదానికి దారితీసింది. ఎన్నిక‌ల సంఘం ఆదేశాల నేప‌థ్యంలో వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ప్ర‌స్తుతం స‌స్పెండ్ చేశారు. దీంతో ఏప్రిల్‌లో పింఛ‌న్ల వ్య‌వ‌హారం.. నానా ఇబ్బందులుగా మారింది. ఎండ‌లు త‌ట్టుకోలేక‌.. పింఛ‌న్ల కోసం వ‌చ్చిన వారు.. దాదాపు 32 మంది మ‌ర‌ణించార‌ని ప్ర‌భుత్వ గ‌ణాంకాలే …

Read More »

వీటిపై క్లారిటీ ఏది జ‌గ‌న్‌?!

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. మేనిఫెస్టో ప్ర‌క‌టించారు. ఆ వెంట‌నే ఆయ‌న జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు కూడా చేస్తున్నారు. ఆదివా రం వ‌రుస‌గా మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించారు. అది కూడా అనంత‌పురం జిల్లానే ఎంచుకోవ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఆయ‌న త‌న ప‌ర్య‌ట‌న‌ల్లో చంద్ర‌బాబును న‌మ్మొద్ద‌ని.. ఆయ‌నను న‌మ్మ‌డ‌మంటే.. పులినోట్లో త‌ల పెట్ట‌డ‌మేన‌ని చెబుతున్నారు. ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క‌టీ చంద్ర‌బాబు అమ‌లు చేయ‌లేద‌ని.. ఇక‌పైనా చేయ‌బోడ‌ని అన్నారు. కాబ‌ట్టి చంద్ర‌బాబు …

Read More »

మేనిఫెస్టో ఎఫెక్ట్‌: జ‌గ‌న్ గురించి జ‌నం టాక్ మారిందే!

Y S Jagan

ఏపీ అధికార పార్టీ వైసీపీ  గురించి.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉన్న టాక్ ఒక‌టి. మ‌రోసారి జ‌గ‌న్ వ‌చ్చేస్తున్నా ర‌ని.. కూట‌మివ‌చ్చినా.. ఆయ‌న గెలుపు ఖాయ‌మ‌ని.. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకున్నారు. దీనికి కార‌ణం కూట‌మిలో టికెట్ల కేటాయింపు నుంచి అభ్య‌ర్థుల‌ను బ‌రిలో నిల‌ప‌డం వ‌ర‌కు పెద్ద ఎత్తున ర‌గ‌డ చోటు చేసుకోవ‌డ‌మే. అయితే. ఇది అయిపోయింది. ఇక‌, ఇప్పుడు వైసీపీ వంతు వ‌చ్చింది. వైసీపీ వ‌స్తే.. పేద‌ల బ‌తుకులు …

Read More »

‘ఉండి’లో గెలుపుకు ‘గండి’కొట్టేది ఎవరు?

తెలుగుదేశం పార్టీ కంచుకోట ఉండి శాసనసభ స్థానంలో ఈసారి గెలుపు ఎవరిది? సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు, పాత ఎమ్మెల్యేను కూడా పక్కనపెట్టి కొద్దిరోజుల క్రితం పార్టీలో చేరిన ఎంపీ రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇవ్వడం గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుందా? తమను సంప్రదించకుండా ఏకపక్షంగా అధిష్టానం నిర్ణయం తీసుకోవడంపై క్యాడర్ అసంతృప్తిగా ఉందా ? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. 2009,2014లో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన కలవపూడి శివకు 2019లో టీడీపీ నర్సాపురం …

Read More »

వైసీపీకి మ‌రో చిక్కు..  ఈసీ సీరియ‌స్ అయితే క‌ష్ట‌మే

ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద చిక్కు ఎదురైంది. ఆ పార్టీ ప్ర‌స్తుత ఎన్నికల్లో జోరుగా ప్ర‌చారం చేస్తున్న విష‌యం తెలిసిందే ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలోనూ.. ప్ర‌ధాన మీడియా అయినా.. ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాల్లోనూ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. ఈ క్ర‌మంలో ఆయా ప్ర‌క‌ట‌న వ్య‌వ‌హారం గుదిబండ‌గా మారింది. ఈ ప్ర‌క‌ట‌న‌ల్లో ప్ర‌భుత్వ లోగోను వినియోగిస్తుండ‌డం వివాదానికి దారి తీసింది. దీనిపై నేరుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి …

Read More »

గుంటూరు, క్రిష్ణాలో టీడీపీకి అమరావతి వరం!

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుద‌లైన త‌ర్వాత‌.. కూట‌మి పార్టీల అభ్య‌ర్థుల‌ ప్ర‌చారంలో భారీ మార్పు చోటు చేసుకుంది. ముఖ్యంగా ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో పోటీ చేస్తున్న అభ్య‌ర్థులు.. వైసీపీ మేనిఫెస్టోను ప‌ట్టుకుని తిరుగుతున్నారు. అంటే.. ఒక‌ర‌కంగా వైసీపీ మేనిఫెస్టోపై టీడీపీ నేత‌లే ప్ర‌చారం చేస్తున్నారు. అయితే.. ఇది పాజిటివ్‌గా కాదు.. యాంటీగా మాత్ర‌మే. “బాబును గెలిపించ‌క‌పోతే.. అమ‌రావ‌తిని మ‌రిచిపో వ‌డ‌మే” అని తాడికొండ‌(అమ‌రావ‌తి ప్రాంతంలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం) నాయ‌కులు చెబుతున్నారు. …

Read More »

సోమిరెడ్డి వదిలిన సెంటిమెంటాస్త్రం!

నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం. రెండు సార్లు గెలిచి మంత్రి పదవి, ఒకసారి ఓడినా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. ముచ్చటగా మూడు సార్లు మంత్రి. కానీ రెండు దశాబ్దాలుగా ఓటమి తప్ప గెలుపు బాట పట్టడం లేదు. ఈ సారి పార్టీ టికెట్ కూడా ఇవ్వకుండా పక్కకు పెట్టాలని చూసినా అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని ఆయనకే టికెట్ ఇచ్చారు. దీంతో ఈసారి గెలుపు ఆయనకు అనివార్యంగా మారడంతో ఆఖరి …

Read More »