Political News

కేవలం డబ్బు సాయమేనా లేక మాట సాయం కూడానా

Pawan Kalyan

మెగాస్టార్ చిరంజీవి, జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళం ప్రకటించడం టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్‌గా మారింది.! ఇందులో నిజానికి వింతేమీ లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే, స్వయానా మెగాస్టార్ చిరంజీవికి సోదరుడే కదా.! తమ్ముడి పార్టీకి అన్నయ్య ఆర్థిక సాయం చేయడం అంత ప్రత్యేకమైన విషయమేమీ కాదు. కాకపోతే, టైమింగ్.! సరిగ్గా ఎన్నికల సమయంలో మెగాస్టార్ చిరంజీవి, జనసేన పార్టీకి విరాళం ప్రకటించడమే …

Read More »

లోకల్ ఫ్లేవర్ … బాబులో భారీ ఛేంజ్

టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో మూస ధోర‌ణుల‌కు స్వ‌స్తి చెబుతున్నారు. వ్యూహా త్మకంగా అడుగులు వేస్తున్నారు. త‌ను చెప్పాల‌ని అనుకున్న దానిని స్థానిక స‌మ‌స్య‌ల‌తో ముడి పెట్టి ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సాధార‌ణంగా చంద్ర‌బాబు ఎక్క‌డ ప్ర‌సంగించినా.. త‌న విజ‌న్ గురించే చెప్ప‌డం అల‌వాటు. తాను సైబ‌రాబాద్ క‌ట్టించాన‌ని.. త‌ను అభివృద్ది అంబాసిడ‌ర్ న‌ని చెప్పుకోవ‌డం తెలిసిందే. అయితే.. ఇది అనుకున్నంత వేగంగా సాధార‌ణ …

Read More »

జగన్ కడప ఎంపీ అభ్యర్థిని మారుస్తున్నాడా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ రోజు ఉదయం నుంచి ఇదే హాట్ టాపిక్. వైఎస్ కుటుంబానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన కడప పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి మారుతున్నాడనే ప్రచారం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండగా.. అక్కడక్కడా ప్రధాన పార్టీలు అభ్యర్థులు అటు ఇటు మారుస్తుండడం చూస్తున్నాం. వైసీపీలో ఈ ఒరవడి ఎక్కువగా ఉంది. గత కొన్ని రోజల పరిణామాలతో కడప పార్లమెంట్ స్థానం విషయంలో జగన్‌ కొంత కలవరడపుతున్నారని.. …

Read More »

ప‌నిచేయండి.. ప‌ద‌వులు ప‌ట్టండి

ఏ రాజ‌కీయ పార్టీకైనా బ‌లం ఏదంటే.. కార్య‌క‌ర్త‌లే. పార్టీ క్యాడ‌ర్‌ను కాపాడుకుంటేనే మ‌నుగ‌డ ఉంటుంది. కానీ తెలంగాణ‌లో గ‌త ప‌దేళ్లుగా కాంగ్రెస్ ఈ ప‌ని చేయ‌లేక‌పోయింది. పార్టీలో అంద‌రూ సీనియ‌ర్ నాయ‌కులే కావ‌డంతో ప‌ద‌వుల కోసం వాళ్ల‌లో వాళ్లు కొట్టుకున్నారు. ఆధిప‌త్యం కోసం ప‌ట్టుబ‌డ్డారు. కానీ క్యాడ‌ర్‌ను మాత్రం ప‌ట్టించుకోలేదు. అయితే రేవంత్ పీసీసీ అధ్య‌క్షుడు అయ్యాక ప‌రిస్థితి మారింది. పార్టీకి ఏది అవ‌స‌ర‌మో రేవంత్ అదే చేశారు. ప్ర‌జ‌ల్లోకి …

Read More »

హ్యాట్రిక్‌పై బాల‌య్య గురి.. ఇప్ప‌టికే వైసీపీ డౌన్‌!

హిందూపురంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌కు తిరుగు లేదు.. ఈ సారి ఆయ‌న హ్యాట్రిక్ కొట్టడం ప‌క్కా.. ఇది ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన టాపిక్‌. అధికార వైసీపీ ఏం చేసినా బాల‌య్య‌ను మాత్రం ఓడించ‌లేద‌నే అభిప్రాయాలు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. అందుకే వ‌రుస‌గా మూడో సారి గెలిచేందుకు బాల‌య్య రంగం సిద్ధం చేసుకుంటున్నార‌నే చెప్పాలి. హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం అంటే టీడీపీకి కంచు కోట‌. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్క‌డ ఓడిపోయిన …

Read More »

ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు వ‌దిలి.. ఒక్క‌టిగా క‌దిలి

రాయ‌ల‌సీమ‌లోని ఆళ్ల‌గ‌డ్డ‌లో ద‌శాబ్దాలుగా రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న రెండు కుటుంబాలు క‌లిశాయి. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ అభ్య‌ర్థి గెలుపు కోసం క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధ‌మ‌య్యాయి. నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డలో రాజ‌కీయం అంటే భూమా కుటుంబం పేరే వినిపిస్తోంది. కానీ వీళ్ల‌కు ప్ర‌త్య‌ర్థిగా ఇరిగెల కుటుంబం కూడా ఉండేది. కానీ ఇప్పుడు భూమా, ఇరిగెల వ‌ర్గాలు క‌లిసిపోయాయి. ఆళ్ల‌గ‌డ్డ‌లో భూమా అఖిల ప్రియ‌ను గెలిపించేందుకు సిద్ధ‌మయ్యాయి. ఆళ్ల‌గ‌డ్డ‌లో గ‌త కొన్ని …

Read More »

చింత‌మ‌నేనిపై సానుభూతి.. గెలిస్తే గిఫ్ట్‌తో బాబు రెడీ

ఈ సారి దెందులూరు ఎమ్మెల్యేగా చింత‌మ‌నేని ప్రభాక‌ర్ గెలుపు ఖాయ‌మా? అది తెలిసే చంద్ర‌బాబు ఆయ‌న‌కు స్పెష‌ల్ గిఫ్ట్ ఇస్తా అన్నారా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చింత‌మ‌నేని గెలిచేందుకు మెరుగైన అవ‌కాశాలున్నాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇక్క‌డ మ‌రోసారి టీడీపీ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. దూకుడైన రాజ‌కీయ నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న చింత‌మ‌నేనికి.. ఇచ్చిన మాట త‌ప్ప‌ర‌నే …

Read More »

ఒక‌ప్ప‌టి లోకేష్ కాదు.. ఇప్పుడు రేంజ్ వేరు!

ప్ర‌త్య‌ర్థి పార్టీల కౌంట‌ర్ల‌కు స‌రైన స‌మాధానం ఇవ్వ‌లేక‌.. త‌డ‌బ‌డుతూ క‌నిపించే నారా లోకేష్ ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. ఇప్పుడు రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్న మాట ఇది. నిరంతరం మెర‌గ‌వుతూ రాజ‌కీయ నాయ‌కుడిగా లోకేష్ ఇంప్రూవ్ అవుత‌న్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. తాజాగా బీజేపీ త‌మిళ‌నాడు అధ్యక్షుడు అన్నామ‌లై కోసం ప్ర‌చారం చేసేందుకు లోకేష్ అక్క‌డికి వెళ్లారు. ఈ ప‌రిణామంలో లోకేష్ పేరు మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇత‌ర రాష్ట్రంలో ప్ర‌చారం …

Read More »

క‌న్న‌డ నేత‌లు కావాలంటోన్న ష‌ర్మిల‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆ రాష్ట్ర పీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భావం చూపించేలా పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్నారు. బ‌స్సులో ప‌ర్య‌టిస్తూ రాజ‌న్న బిడ్డ‌ను ఆద‌రించండి అంటూ కాంగ్రెస్కు తిరిగి ఆద‌ర‌ణ సంపాదించే ప‌నిలో నిమ‌గ్న‌మయ్యారు. త‌న చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసును ప్రధాన ఆయుధంగా మార్చుకుని క‌డ‌ప ఎంపీ అవినాష్‌, సీఎం జ‌గ‌న్‌పై ష‌ర్మిల తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్న సంగ‌తి …

Read More »

ప‌వ‌న్ కల్యాణ్ హామీ.. న‌మ్మితే తిరుగులేదు!

ఎన్నిక‌ల వేళ అన్ని రాజ‌కీయ పార్టీలూ బ‌ల‌మైన హామీలతోనే ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తున్నాయి. అయితే.. వీటిని న‌మ్మించ‌డంలోనే అస‌లు స‌మ‌స్య ఉంటుంది. ఇప్పుడు ఈ స‌మ‌స్య‌ను దాటి కొంత కృషి చేస్తే.. తాజాగా జ‌న‌సేన ఇచ్చిన హామీ నిజ‌మ‌వుతుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగిస్తే.. కూట‌మి క‌ల‌లు కంటున్న అధికారం చేరువ‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్రంలో గ‌త ప‌దేళ్లుగా కీల‌క‌మైన స‌మ‌స్య వెంటాడుతోంది. అది రాష్ట్రంలోని 2 ల‌క్ష‌ల మంది …

Read More »

ఇంకా ఎనీ డౌట్స్‌.. రోడ్ షోతో అన్నీ ఢ‌మాల్‌!

డౌట్ల‌న్నీ క్లియ‌రైపోయాయి. సందేహాలు ప‌టాపంచ‌ల‌య్యాయి. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు క్లియ‌ర్ మెసేజ్ అందుకున్నారు. ఒక్క రోడ్ షోతో ఈ కూట‌మిపై ఆయా పార్టీల నేత‌ల‌కు మ‌రింత న‌మ్మ‌కం క‌లిగింద‌నే చెప్పాలి. అవును.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినాయ‌కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి క‌లిసి రోడ్‌షోలో పాల్గొన‌డంతో కూట‌మికి ప‌రిస్థితులు మ‌రింత అనుకూలంగా మారాయ‌నే చెప్పాలి. ఏపీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో …

Read More »

జనసేన వాహనంపై టీడీపీ అధినేత

వారాహి అన‌గానే ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది జ‌న‌సేన‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు మాత్ర‌మే. గ‌త ఏడాది జూన్‌లో ఈ వారాహి వాహ‌నాన్ని ప‌వ‌న్ ప్ర‌చారంలోకి తీసుకువ‌చ్చారు. ఈ వాహ‌నం శ‌త్రు దుర్బేధ్యం. పైగా విశాలంగా ఉండి.. నాయ‌కులు ప్ర‌సంగించేందుకు వీలుగా ఉంటుంది. వాహ‌నానికి చుట్టూ మైకులు ఉంటాయి. అదేవిధంగా లైటింగ్ కూడా ఉంటుంది. ఇక‌, పంక్ఛ‌ర్ ఫ్రీ టైర్లు, 100 కిలోల బ‌లంతో కొట్టినా ప‌గిలిపోని అద్దాలు వంటివి ఈ వాహ‌నం …

Read More »