వచ్చే ఎన్నికలకు సంబంధించి సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం ప్రకటించారు. అయితే.. ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుంద న్నది ప్రశ్న. ఎందుకంటే.. ఎన్నికల సమయంలో రూపాయే.. పరమాత్మ. రూపాయే ఓటరును కదిలించే ఆత్మ!!. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు ఏకంగా వచ్చే ఎన్నికల నాటికి రూపాయి కూడా పంచకుండానే ప్రజల మనసులు చూరగొనాలని.. ఎన్నిక ల్లో విజయం దక్కించుకోవాలని సూచించారు. సాధారణంగా ఎన్నికల్లో ఓటర్ల నాడిని పసిగట్టే ప్రక్రియలో రూపాయి చేసే రాజకీ యాలు కీలకం.
ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా.. ఎన్నికల సమయంలో ఓటర్ల చేతులు తడపండే.. పోలింగ్ బూతులు నిండే పరిస్థితి కనిపించడం లేదు. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ చాలానే పథకాలు ఇచ్చింది. ప్రతి కుటుంబానికీ ఏదో ఒక రూపంలో మేలు కూడా జరిగింది. కానీ, ఎన్నికల సమయంలో దేశంలో ఎన్నికలకు ఖర్చు చేసిన అతి పెద్ద పార్టీల్లో వైసీపీ మూడోస్థానంలో ఉంది. 342 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టు సర్వేలు చెప్పాయి. అంటే.. ఎంత ఖర్చు చేసిందో అర్థమవుతుంది. అయితే.. పార్టీ గెలిచిందా? ఓడిందా? అనేది మరోచర్చ.
అలాంటిది ఇప్పుడు ఎన్నికల సమయంలో రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రజల మనసులు చూరగొనే రాజకీయాలు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇది మంచిదే. అంతేకాదు, ప్రస్తుతం పింఛన్లను రూ.4000 చొప్పున ఇస్తున్నామని… తల్లికి వందనం పథకం కింద 15 వేలు ఇస్తున్నామని.. రైతుకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. అంతేకాదు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా అమలు చేయనున్నామని అన్నారు. ఇన్ని చేస్తూ.. మళ్లీ వచ్చే ఎన్నికల్లో సొమ్ములు పంచడం ఎందుకని ప్రశ్నించారు.
ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి.. పాజి టివిటీని పెంచడం ద్వారా.. విజయం దక్కించుకునేందుకు ప్రయత్నించాలని ఆయన చెబుతున్నా రు. తద్వారా ఇబ్బందులు లేని విధంగా రాజకీయాల్లో విజయం దక్కించుకోవాలన్నది చంద్రబాబు వ్యూహం. అయితే.. ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందన్నది చూడాలి. ఒక వేళ ఎన్నికల్లో రూపాయి కూడా ఖర్చు లేకుండా విజయం దక్కించుకుంటే.. ఈ విషయంలోనూ చంద్రబాబు రికార్డు సృష్టించినట్టే. అయితే.. నాయకులను ఆ దిశగా నడిపించడం మాత్రం గ్రేట్ అనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates