ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఏ నేతలకు దక్కబోతోందని తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఏపీలో మరోసారి దగ్గుబాటి పురంధేశ్వరికే పగ్గాలు అప్పగించాలని బీజేపీ హై కమాండ్ భావిస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో చిన్నమ్మకే మరో చాన్స్ దక్కుతుందని అంతా భావించారు. అయితే, అనూహ్యంగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ హై కమాండ్ నియమించింది. ఇక, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావు పేరును ఎంపిక చేసింది.
ఏపీ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన రామచందర్ రావుకు ఈ పదవి దక్కడం విశేషం. ఈ పదవి ఆయనకు దక్కడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారట. ఈటల రాజేందర్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి దక్కకుండా బీజేపీ సీనియర్ నాయకులు చెక్ పెట్టారట. బీజేపీలో సుదీర్ఘ అనుభవం కలిగిన రామచందర్ రావుకు ఆర్‌ఎస్‌ఎస్‌తో బలమైన సంబంధాలున్నాయి. సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు బ్రాహ్మణ సమాజానికి చెందిన రామచందర్ రావు సరైన వ్యక్తి అని బీజేపీ హై కమాండ్, ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలు భావించారు.
ఇక, ఏపీ బీజేపీ చీఫ్ గా చిన్నమ్మ స్థానంలో మాధవ్ ను నియమించడం వెనుక బీసీ కార్డ్ ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌తో బలమైన అనుబంధం ఉన్న బీసీ నేత అయిన మాధవ్ 1980-86 మధ్య ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. టీడీపీ, జనసేనతో పొత్తు బలోపేతం చేయడం, బీసీ ఓటర్లను ఆకర్షించడం కోసం మాధవ్ ను వ్యూహాత్మకంగా బీజేపీ హై కమాండ్ ఎంపిక చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates