బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కొంతకాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాజా సింగ్ కు టికెట్ కూడా ఇవ్వరేమో అనుకున్నప్పటికీ…చివరకు ఆయనవైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఆ తర్వాత కూడా బీజేపీపై రాజా సింగ్ సందర్భానుసారంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. దానికితోడు బీజేపీ చీఫ్ పదవికి ఎన్నిక నిర్వహించాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. అయితే, ఈ విషయం హైకమాండ్ కు నచ్చలేదు.
తాజాాగా తెలంగాణ బీజేపీ చీఫ్ రేసులో రాజా సింగ్ ఉన్నారు. అయితే, ఆయన నామినేషన్ స్వీకరించలేదు. ఈ క్రమంలోనే రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి అందజేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వచ్చానని, తన అనుచరులను బెదిరించారని రాజా సింగ్ అసహనం వ్యక్తం చేశారు. బీజేపీకి రాజీనామా చేశానని, రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి అందజేశానని అన్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం తాను పోటీ పడగా ముగ్గురు కౌన్సిల్ మెంబర్స్ మద్దతుగా సంతకం పెట్టారని, వారిని బెదిరించారని ఆరోపించారు. ఈ ఎన్నికలు కేవలం నామామాత్రమేనని, ఎవరిని ప్రెసిడెంట్ చేయాలో ఆల్రెడీ డిసైడ్ చేశారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకూడదనుకునే వారి సంఖ్య పార్టీలో ఎక్కువైందని చెప్పారు. మీకో దండం.. మీ పార్టీకో దండం అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాలుగా పార్టీలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates