శషబిషలకు తావు లేకుండా మంత్రి కొండా సురేఖ భర్త మురళీ కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు. నేనెవ రికీ భయపడేది లేదన్నారు. అంతేకాదు.. నేను ఎవరినీ బ్రతిమాలేది కూడా లేదన్నారు. వరంగల్ రాజకీ యాలు తనకు కొట్టిన పిండి అన్న ఆయన.. ఎవరో వచ్చి.. తనపై ఏదో చెబితే వినేవారికి కొంత విచక్షణ ఉండాలని అనుకోవడం తప్పేలేదన్నారు. అయితే.. తాను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిగానే ఫీలవుతానన్నారు.
అందుకే పార్టీ ఆగం కాకూడదన్న ఉద్దేశంతోనే తాను కొన్ని వ్యాఖ్యలు చేశానని.. వాటిని తప్పుబట్టిన వారికి వాస్తవాలు చెబుతున్నానన్నారు. కొండా మురళి.. వరంగల్ పార్టీని బాగు చేసేందుకు వచ్చాడన్న వాస్తవా న్ని ప్రజలు గుర్తించారని చెప్పారు. కొందరు నాయకులు ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నారని.. వాటినే తాను తప్పుబట్టానన్నారు. పార్టీలో అంతర్గత చర్చలే తప్ప.. రచ్చ ఉండదని తాను అభిప్రాయప డుతున్నాన్నారు. పార్టీ ఎలా చెబితే అలా చేస్తానని చెప్పారు.
పార్టీ కోసం.. పదవులు వదులుకున్నవారమని చెప్పిన ఆయన.. అన్ని విషయాలను ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌కు వివరించామన్నారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొనిపోతామని చెప్పారు. ఈ విషయంలో ఎవరో ఏదో చెబితే.. తాను ఏం చేస్తానని ప్రశ్నించారు. ఎవరికి టికెట్ ఇచ్చినా.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. తాను అందరినీ గెలిపించేందుకు సిద్ధమేనని చెప్పారు. పరకాల టికెట్‌తన కుమార్తె సుస్మిత కు ఇవ్వమని తాను ఎప్పుడూ అడగలేదన్నారు. రాజకీయాల్లోకి రావడం అనేది పూర్తిగా సుస్మిత అభిప్రాయమని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates