“దేవుడు అన్నీ చూస్తున్నాడు.. ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది.” అని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్న ఆయన.. మనకు కూడా మంచి రోజులు వస్తాయని.. అప్పుడు మనం కూడా చేయొచ్చని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తాజాగా పలు కేసుల నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన వైసీపీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సతీసమేతంగా జగన్‌ను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా వంశీతో జగన్ పలు విషయాల పై చర్చించారు. పార్టీని ముందుకు నడిపించే బాధ్యత మీ దేనని వ్యాఖ్యానించారు. ఎన్ని కేసులు పెట్టినా.. వెరవాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ అండగా ఉం టుందని చెప్పారు. ఈ కేసులు తాత్కాలికమేనని ప్రజల్లో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింద ని.. ఏక్షణమైనా ఆయన దిగిపోయే అవకాశం ఉందని జగన్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా గన్నవరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఇంకా తప్పుడు కేసులు పెట్టే అవకాశం ఉందని.. తనపై కూడా కేసులు నమోదు చేశారని జగన్ చెప్పుకొ చ్చారు. పార్టీలో సగం మంది నాయకులపై కేసులు ఉన్నాయన్న ఆయన.. ఎవరూ భయపడాల్సిన అవ సరం లేదని.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. వడ్డీతో సహా బదులు తీర్చుకుందామని భరోసా కల్పిం చారు. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. పార్టీ తరఫున పోరాటాలు తీవ్ర తరం చేయాలని.. వచ్చే ఎన్నికల్లో భారీ విజయం మన సొంత మవుతుందన్నారు. కాగా.. వంశీ ఉలుకుపలుకు లేకుండా..జగన్ చెప్పింది వినడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates