వైసిపి హయంలో సీఎంగా ఉన్న జగన్ పలు పథకాలను ప్రారంభించారు. అయితే కొన్ని అనివార్య కార ణాల వల్ల కరోనా వంటి మహమ్మార్లు విజృంభించిన నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులు నిలిచిపోయాయి. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సాధారణంగా ఇలాంటి ప్రాజెక్టులను కొనసాగిస్తాయని చెప్పడానికి ఎక్కడ అవకాశం లేదు. ఎందుకంటే గతంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చేశారు. అదేవిధంగా రాజధాని అమరావతి పనులను కూడా అటుకెక్కించారు.
కాబట్టి ప్రభుత్వం మారితే గత ప్రభుత్వం తాలూకా పనులను కొనసాగిస్తుంది అని చెప్పడానికి ఎక్కడ అవకాశం అయితే లేదు. దీనిని బట్టి జగన్ హయాంలో మొదలుపెట్టిన పథకాలను తర్వాత వచ్చిన ప్రభుత్వం కొనసాగిస్తుందని ఎవరు ఊహించరు. కానీ కూటమి ప్రభుత్వం వాటిని కొనసాగిస్తోంది. అంతేకాదు.. ఆయా పథకాలను రద్దు కూడా చేయలేదు. ఉదాహరణకు ‘జగనన్న ఇల్లు’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్.. గత ఏడాది ఎన్నికలకు ముందు పేదలకు పంపిణీ చేశారు.
కానీ ఇంతలో ఎన్నికలు రావడంతో ఈ పనులు సగంలోనే నిలిచిపోయి. కొన్ని అసలు ప్రారంభమే కాలేదు. ఇంతలో ప్రభుత్వం మారడం జరిగిపోయింది. అయితే చంద్రబాబు హయాంలో ఆయా పనులను ముందుకు తీసుకువెళ్తారని ఎవరు ఊహించలేదు. సహజంగా ఉండే రాజకీయ వైషమ్యాలు, రాజకీయ వైరుధ్యాలు అలాగే సదరు పథకాలను అమలు చేయడం ద్వారా వచ్చే వ్యక్తి గత లబ్ధి వంటి వాటిని నాయకులు లెక్కలు వేసుకుని అమలు చేస్తారు.
కాబట్టి అలా చూసుకున్నప్పుడు జగన్ ప్రారంభించిన కార్యక్రమాన్ని చంద్రబాబు పూర్తి చేస్తారని ఎవరు ఊహించరు. కానీ, జగన్ సొంత జిల్లాలోనే ఈ పథకాన్ని దాదాపు పూర్తి చేయించే పనిని చంద్రబాబు భుజాన వేసుకున్నారు. రాయచోటిలో ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన జగనన్న ఇళ్ల పథకాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయించే దిశగా అడుగులు వేస్తోంది. రాయచోటి, రాజంపేట, మదనపల్లె, తంబళ్లపల్లి పీలేరు నియోజకవర్గాల్లో 342 లేఔట్లను గత వైసిపి ప్రభుత్వం చేసింది.
దీనిలో దాదాపు 80 వేల మందికి ఇళ్లు మంజూరు చేశారు. అయితే ప్రభుత్వం మారడంతో ఆయా ఇల్లు సగంలోనే ఆగిపోయాయి. వీటిని పూర్తి చేయించేందుకు తాజాగా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటివరకు 6000 మందికి రుణాలు ఇప్పించి తద్వారా ఇల్లు కట్టుకునేలా ప్రోత్సహిస్తుంది. కాబట్టి రాజకీయాల్లో వైరుధ్యాలు ఉండొచ్చు కానీ ప్రజలకు మేలు చేసే వాటి విషయంలో మాత్రం చంద్రబాబు దూర దృష్టితో ఉన్నారని చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates