కల్వకుంట్ల కవిత. ఆమె రాజకీయ భవితవ్యం ఏంటి? ఎటు పయనిస్తారు? ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? ఇదీ.. ఇప్పుడు తెలంగాణలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చగా మారిన విషయం. సొంత పార్టీ పెడతారని తొలుత చర్చ వచ్చినా.. అదేం లేదని తేలిపోయింది. అంతేకాదు.. బీఆర్ ఎస్‌ను తను ఓన్ చేసుకున్న తీరు.. సీఎం సీటు తనదేనని చెప్పిన విధానం వంటివి కూడా.. ఆమె రాజకీయ ఫ్యూచర్ పై అనేక చర్చలకు అవకాశం కల్పించింది.
వాస్తవానికి స్వయం ప్రకాశిత నాయకులకు మాత్రమే.. ఈ తరహా ఆలోచనలు ఉంటాయి. కానీ, కవిత స్వయం ప్రకాశితమేనా? అంటే.. కాదన్నది అందరికీ తెలిసిందే. కేవలం కేసీఆర్ చేత.. కేసీఆర్ వలన.. అన్నట్టుగానే కవిత రాజకీయాలు సాగాయి. సాగుతున్నాయి. దీనిలో ఎవరికీ ఎలాంటి డౌటు లేదు. అయినా.. కూడా కవిత.. ఇంత ధీమాగా తన రాజకీయ ఫ్యూచర్ పై సంచలన కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్‌లో నెంబర్ 2 అంటే కేటీఆర్ మాత్రమే.
ఈ విషయంలో ఆ పార్టీనే కాదు.. తెలంగాణ సమాజం కూడా ఎప్పుడో గుర్తించింది. అయినా.. కవిత మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. రెండు మీడియా సమావేశాలు.. ఒక ధర్నా చేస్తే.. ఆమెకు ప్రాభవం పెరిగిపోయిందని.. ప్రజలలో తనకు ఇమేజ్ వచ్చిందని ఆమె అనుకోవచ్చు. రాజకీయాల్లో ఇది కామన్ కూడా. అయితే.. స్వయం ప్రకాశితంగా ఎదగడంలో ఏమేరకు ఆమె సక్సెస్ అయ్యారన్నది ప్రధానం. దీనిని పక్కన పెట్టి.. ప్రకటనలకే పరిమితం అయితే.. తెలంగాణ సమాజం ఏమేరకు ఆమెను యాక్సప్ట్ చేస్తుందన్నది చూడాలి.
ఇక, కేసీఆర్ వ్యూహానికి వస్తే.. ‘డియర్ డాడీ’ లేఖ రాసిన తర్వాత.. కవితను ఆమె ఏమాత్రం పట్టించుకో లేదు. స్వయంగా ఇంటికి వెళ్లినా.. ఆమెను పలకరించలేదు. కాబట్టి.. ఆమె పొజిషన్ ఏంటనేది అందరికీ అర్ధమైంది. ఇక, పార్టీలో ఆమె సందడి చేస్తున్నా.. కేటీఆర్ కూటమిగా పేరున్న నాయకులు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక, ఇతర నేతలు కూడా స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో కవిత-రాజకీయ భవితవ్యం ఏంటనేది.. చర్చగానే మారనుంది. ఈ వ్యవహారం సీరియస్ అయితే..బిహార్ మాజీ సీఎం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తీసుకున్న నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates