అమిత్ షా. కేంద్ర హోం శాఖ మంత్రి. ఆయన గురించి అందరికీ తెలిసిందే. గతంలో గుజరాత్ రాష్ట్ర హోం శాఖ మంత్రిగా, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ సీఎంగా పనిచేశారు. ఈ ద్వయం 2014 నుంచి కేంద్రంలో ప్రధాని-హోం శాఖ మంత్రులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం 60 ఏళ్ల వయసులో ఉన్న అమిత్ షాపై తరచుగా ఒక ప్రచారం జరుగుతోంది. ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ రిటైర్ అయితే..(అంటే.. 75 ఏళ్ల వయసు వస్తే) ఆతర్వాత ప్రధాని అయ్యేది అమిత్ షానేనని పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఆ ప్రచారంలోనూ వాస్తవం ఉంది. ఎందుకంటే.. మోడీ తర్వాత.. అంతటి స్థాయిలో రాజకీయాలు చేయగల నాయకుడిగా అమిత్ షా పేరు తెచ్చుకున్నారు.
దీంతో తరచుగా అమిత్‌షా పేరు.. మోడీ తర్వాత ప్రధానిగా వినిపించింది. అయితే.. తాజాగా ఈచర్చకు, ఇలాంటి వార్తలకు ఆయ నే చెక్ పెట్టారు. తాను త్వరలోనే రిటైర్ కాబోతున్నట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు.. రిటైర్ అయిన తర్వాత.. తన జీవితం ఎలా ఉంటుందో కూడా షా వివరించారు. వేదాలు, ఉపనిషత్తులు చదవడంతోపాటు ప్రకృతి వ్యవసాయంపై దృష్టిపెడతానని షా తెలిపా రు. తాజాగా సహకారసంఘాల మహిళలతో భేటీ అయిన ఆయన.. తన మనసులో మాటను చెప్పుకొచ్చారు. తాను ఎంతోకా లం రాజకీయాల్లో కొనసాగాలని భావించడం లేదని చెప్పారు. త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటిస్తానని అన్నారు.
“రిటైర్మెంట్ తర్వాత వేదాలు, ఉపనిషత్తులు చదవడంతోపాటు, ప్రకృతి వ్యవసాయానికే సమయాన్ని కేటాంచాలని నిర్ణయించు కున్నా” అని తెలిపారు. కాగా.. ఆర్ ఎస్ ఎస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన అమిత్ షా.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన నాయకుడు. విద్యార్థి సంఘం నాయకుడిగా ఆయన ఏబీవీపీలో పనిచేశారు. బీజేపీలో చేరినతర్వాత.. ప్రధాని మోడీతో ఏర్పడిన సఖ్యతతో ఆయన.. రాష్ట్రంలోబీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అనంతరం.. హోం మంత్రిగా బాధ్యతులు చేపట్టారు. సుమారు 30 ఏళ్లుగాఆయన రాష్ట్ర, కేంద్ర మంత్రిగానే వ్యవహరిస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates