కోవూరు ఎమ్మెల్యే, టీడీపీ మహిళా నేత వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రసన్న కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రశాంతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రసన్న కుమార్ రెడ్డి తాను ఎక్కడికి పారిపోలేదని మీడియా ముందుకు వచ్చారు.
భయపడడం తన బయోడేటాలో లేదని, తనలో నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి బ్లడ్ ప్రవహిస్తోందని ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను పారిపోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స కోసం చెన్నైలో ఆసుపత్రికి వెళ్లానని చెప్పుకొచ్చారు. తాను దాక్కునట్లు ప్రచారం చేయడం హాస్యాస్పదమని అన్నారు. ఇప్పుడు కావాలంటే తనను అరెస్టు చేసుకోవచ్చని ఛాలెంజ్ చేశారు. తన ఇంటిపై జరిగిన దాడి వ్యవహారంలో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని ప్రసన్న కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
కాగా, ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించాల్సిన వైసీపీ అధినేత జగన్….ప్రసన్నకుమార్ రెడ్డికి ఫోన్ చేసి పరామర్శించడం విమర్శలకు తావిచ్చింది. వైసీపీ నేతల నోటి దురుసు నానాటికి పెరిగిపోతున్నప్పటికీ జగన్ మాత్రం వారి తీరును ఖండించకపోవడంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates