కోట శ్రీనివాసరావు.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. ఒకే ఫ్రేమ్ నవరసాలను ఒలికించగల దిట్ట. ఆదివారం తెల్లవారు జామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన సినీ రంగంలో చేసిన పాత్రలు.. పక్క న పెడితే.. రాజకీయాల్లోనూ.. ఆయన తనదైన ముద్ర వేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు.. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం దక్కించుకు న్నారు. ఇలా.. పార్టీ కండువా కప్పుకొని అలా టికెట్ తెచ్చుకున్నారు.
అంతేకాదు.. బలమైన వంగవీటి ఫ్యామిలీని ఆ ఎన్నికల్లో దీటుగా ఎదుర్కొని కోట గెలుపు గుర్రం ఎక్కారు. కోట విజయంతో ప్రధానంగా 3 పనులు జరిగాయి. 1) సంస్థాగతంగా విజయవాడలో బీజేపీ మరింత పట్టు సాధించింది. అప్పటి వరకు.. బీజేపీ ఉన్నా.. ఆ లెక్కవేరు. కానీ, కోట విజయంతో పార్టీని మరింత విస్తరిం చే పనులు చేపట్టారు. ముఖ్యంగా హిందూత్వకు బలమైన వాయిస్ లభించింది. ఆయన ఏవేదిక ఎక్కినా.. బీజేపీ దేశంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పేవారు.
2) విజయవాడ డెవలప్‌మెంట్: తాను పుట్టింది.. పెరిగింది కంకిపాడులోనే అయినా.. విద్య, ఉద్యోగాల విషయంలో విజయవాడతో కోట అనుబంధం పెంచుకున్నారు. దీంతో ఇక్కడి రహదారుల వెడల్పు నుంచి విజయవాడ కొండ ప్రాంత వాసులకు విద్యుత్ సౌకర్యం ఇచ్చే దాకా, వారికి పట్టాలు మంజూరు చేయించే వరకు కూడా.. కొట ప్రస్థానం ముందుకు సాగింది. ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించి.. నేడు కొండ ప్రాంతాలపై విద్యుత్తు వెలుగు విరజిమ్ముతున్నాయి.
3) అవినీతికి దూరం: అప్పట్లో ఎమ్మెల్యేలు.. అంటే.. డబ్బులు లేకుండా పనులు చేసేవారు కాదు. కోట మాత్రం.. ఈ విషయంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరించారు. పార్టీపరంగా కార్యకర్తల సమీకరణ విషయంలో డబ్బులు ఖర్చు చేసే నాయకులను నిలువరించారు. తద్వారా.. నాయకులు ప్రజల నుంచి డబ్బులు వసులు చేసే కార్యక్రమాన్ని పక్కన పెట్టారు. అవినీతి రహిత రాజకీయాలు కావాలని అనేక సందర్భాల్లో చెప్పారు. అయితే.. అవి సాగవని.. మార్పు సాధ్యం కాదని గుర్తించిన ఆయన సైలెంట్‌గా తప్పుకొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates