ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి వర్గంలో 25 మంది మంత్రులు ఉన్నారు. దీనిలో ముఖ్యమంత్రి, ఉప ము ఖ్యమంత్రి పోస్టులు పక్కన పెడితే.. 23 మంది మినిస్టర్లు అవకాశం దక్కించుకున్నారు. వీరిలోనూ జనసేన కు చెందిన ఇద్దరు, బీజేపీకి చెందిన ఒకరిని పక్కన పెడితే.. మరో 20 మంది అచ్చంగా టీడీపీ కి చెందిన మంత్రులే ఉన్నారు. వీరిపైనే సీఎం చంద్రబాబుకు చాలా ఆశలు ఉన్నాయి. అనేక వడపోతలు, సామాజిక వర్గాల సమీకరణలను పరిగణనలోకి తీసుకుని వారికి చాన్స్ ఇచ్చారు.
ఎంతో మంది నాయకులు మంత్రి పదవులు ఆశించినా.. వారిని పక్కన పెట్టిన చంద్రబాబు.. ఏరికోరి యు వ నాయకులను, తొలిసారి విజయం దక్కించుకున్నవారిని కూడా తన టీంలో చేర్చుకున్నారు. వీరంతా దూకుడుగా పనిచేస్తారని ఆశించారు. అయితే.. మంత్రులుగా ఉన్న వారిలో కొందరు యాక్టివ్‌గా ఉంటే.. మరికొందరు దీనిని ప్రొఫెషనల్‌గా భావిస్తున్నారు. అంటే.. దీనిని ఉద్యోగంగా భావిస్తున్నారన్నది సీఎం చంద్రబాబు స్వయంగా చెబుతున్నమాట.
వాస్తవానికి మంత్రి అంటే.. పర్మినెంట్ ఎంప్లాయిమెంటు కాదు. ఇది జీతంతో కూడిన పొలిటికల్ ఎంప్లాయిమెంటు. ప్రత్యర్థులను ప్రజలకు దూరం చేయడం ద్వారా.. అధికార పార్టీ ప్రజలకు దగ్గరై.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని.. దక్కించుకున్న పదవులు. వీటిని మళ్లీ మళ్లీ కాపాడుకోవాలన్నా.. మరోసారి సర్కారు ను ఏర్పాటు చేసుకోవాలన్నా.. ప్రత్యర్థులను సాధ్యమైనంత వరకు ప్రజలకు దూరంగా ఉంచే ప్రయత్నా లు చేయాలి. అది మాట రూపంలోనో.. ప్రజలను ఆకట్టుకునే పనులు చేయడం ద్వారానో చేయాలి.
ఈ విషయంలోనే 6-8 మంది టీడీపీ మంత్రులు వెనుకబడుతున్నారని చంద్రబాబు చెబుతున్నారు. వీరిలో కొల్లు రవీంద్ర, మండపల్లి శ్రీనివాసరెడ్డి, బీసీ జనార్ధన్‌రెడ్డి, కొలుసు పార్థసారథి, మహమ్మద్ ఫరూక్, సవిత వంటి వారు తొలి వరుసలో ఉన్నారన్నది సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. పనితీరు ఆధారంగా వీరికి మంచి మార్కులు ఉన్నా.. ప్రత్యర్థిని కట్టడి చేయడంలో మాత్రం వీరు వెనుకాడుతున్నారని.. బలమైన రాజకీయాలు చేయలేకపోతున్నారని సీఎం చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. అందుకే.. వీరి విషయంలో అంతర్మథనం చెబుతున్నారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates