‘రప్పా.. రప్పా.. నరుకుతాం!’ అనే డైలాగు ఇటీవల కాలంలో వైసీపీ నాయకుల నుంచి తరచుగా వినిపి స్తున్న విషయం తెలిసిందే. వారిపై విమర్శలు కూడా అంతే జోరుగా వస్తున్నాయి. అయితే.. తాజాగా టీడీ పీకి చెందిన సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇవే వ్యాఖ్యలతో వైసీపీ నాయకు డికి వార్నింగ్ ఇచ్చారు. రెండు రోజుల కిందట వైసీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి తాడిపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన పాదయాత్రలో పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే బైరెడ్డి టీడీపీ నాయకులపై విమర్శలు చేశారు. ముఖ్యంగా జేసీ వర్గానికి బైరెడ్డి హెచ్చరికలు కూడా చేశారు. ఈ పరిణామాలపై స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. నీ ఊరుకు నా ఊరు ఎంత దూరమో.. నా ఊరికి నీ ఊరు కూడా అంతే దూరం. నువ్వు మా దగ్గరకు వచ్చి బెదిరిస్తే.. నీ దగ్గరకు వచ్చి మేం బెది రించలేమా?.. బెదిరించడం కాదు.. నీకు రప్పారప్పా సినిమా నే అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రాత్రిపూట కన్ను కొడితే పని జరిగిపోద్ది! అని జేసీ హెచ్చరించారు.
అయితే.. వైసీపీ నాయకుల మాదిరిగా బజారు భాష తాము మాట్లాడబోమని జేసీ చెప్పారు. వైసీపీ నాయకుల మాదిరి.. బండబూతులు తిడితే.. మాకు ఏమొస్తుంది. పైగా మా నాయకుడు అరుస్తాడు(చంద్రబాబు). నీలాంటి వాళ్లని ఎంతో మందిని చూశా. నువ్వెంత. బచ్చాగాడివి. నా గడ్డం, నా నెత్తి నెరిసిపోయింది. నువ్వు నన్ను అనేటోడివా? నీకు టికెట్టు ఇచ్చేందుకు మీ నాయకుడే వెనుకాడుతున్నాడు. నువ్వా నన్ను ఎక్కిరిచ్చేది. మంచిగా పనిచేస్తే.. ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే.. ఇట్నే ఉంటావు. చూసుకో! అని తనదైన శైలిలో జేసీ వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates