మిథున్ అరెస్టుతో వైసీపీకి న‌ష్టమెంత‌.. !

వైసీపీ కీల‌క నాయ‌కుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్టు చేయ‌డం.. రాజ‌మండ్రి జైలుకు పంపిం చ‌డం కేవ‌లం 36 గంట‌ల్లోనే జ‌రిగిపోయాయి. ఇది అనూహ్య‌మ‌నే చెప్పాలి. మ‌ద్యం కుంభ‌కోణాన్ని విచారి స్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 11 మందినిఅరెస్టు చేసినా.. ఇలా 36 గంట‌ల్లోనే నిర్ణ‌యం తీసుకున్న ప‌రిస్థితి లేదు. కానీ.. మిథున్‌రెడ్డి విష‌యంలో మాత్రం అధికారులు ప‌క్కా ఆధారాలు ఉండ‌బ‌ట్టే ఇలా అరెస్టు చేశార‌ని చెబుతున్నారు.

ఇక‌, ప్ర‌స్తుతం మిథున్ రెడ్డి రాజ‌మండ్రి కేంద్ర కారాగారంలోనే ఉన్నారు. ఆగ‌స్టు 1వ తేదీ వ‌ర‌కు ఏసీబీ కో ర్టు ఆయ‌న‌కు రిమాండ్ విధించింది. ఈ ప‌రిణామాల‌పై.. వైసీపీ నాయ‌కుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ చ్చింది. పార్టీలో జ‌గ‌న్ టీంగా.. లేదా.. జ‌గ‌న్ ప‌ద‌వులు ఇచ్చిన వారు మాత్ర‌మే స్పందించారు. మిగిలిన నా య‌కులు.. ముఖ్యంగా త‌ట‌స్థంగా ఉన్న నాయ‌కులు ఎవ‌రూ పెద్దగా రియాక్ట్ కాలేదు. మ‌రోవైపు.. రెడ్డి సామాజిక వ‌ర్గంలోనూ ఈ ప్ర‌భావం పెద్ద‌గా క‌నిపించ‌లేదు.

అంటే.. కూట‌మి ప్ర‌భుత్వం రెడ్ల‌ పై క‌క్ష తీర్చుకుంటోంద‌ని.. రెడ్లంటే.. చంద్ర‌బాబుకు ప‌డ‌ర‌ని.. రాజ‌కీ యంగా వారిని అణిచేసేందుకు ఇబ్బందులు పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. వైసీపీలోని ఓ వ‌ర్గం నాయ‌కులు చెప్పినా.. అది రెడ్డి సామాజిక వ‌ర్గంపై పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. రెడ్డి సామాజిక వ‌ర్గం.. త‌మ‌పై జ‌రిగిన దాడిగా.. లేక‌.. త‌మ వ‌ర్గాన్ని అణిచేసేందుకు చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నంగా కూడా వారు భావించ‌డం లేదు. కేసును కేసు రూపంలోనే చూస్తున్నారు.

సో.. ఈ విష‌యంలో వైసీపీ ఆశించినట్టుగా రెడ్ల పోల‌రైజేష‌న్ అయితే జ‌ర‌గ‌లేదు. ఇక‌, చిత్తూరు స‌హా.. సీమ రాజ‌కీయాల్లో అయినా.. ఏదైనా సింప‌తీ వ‌చ్చిందా? అంటే.. ఆ న‌లుగురు క‌లిసివ‌చ్చే నాయ‌కులు మిన‌హా పెద్ది రెడ్డి కుటుంబానికి తాజా ప‌రిణామంతో ఎలాంటి సింప‌తీ ప్ర‌త్యేకంగా రాలేద‌న్న‌ది ప‌రిశీల‌కులు చెబు తున్న మాట‌. ఇది వైసీపీపైనా ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు. పుంగ‌నూరులో బోడే రామ‌చంద్ర, స‌హా టీడీపీ నాయ‌కులు సంబ‌రాలు చేసుకున్నారు. ఇక‌, పెద్దిరెడ్డిని స‌మ‌ర్థించేవారు.. కూడా పెద్ద‌గా రియాక్ట్ కాలేదు. సో..ఎలా చూసుకున్నా.. వైసీపీకి ప్ల‌స్ అయితే.. లేదు.