Political News

చంద్ర‌బాబు నాకు గురువ‌ని ఎవ‌డ‌న్నాడు: రేవంత్

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “చంద్ర‌బాబు నాకు గురువ‌ని ఎవ‌డ‌న్నాడు. బుద్ధి లేని గాడిద కొడుకు” అని తీవ్ర‌స్థాయిలో స్పందించారు. తాజాగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల నేప‌థ్యంలో రేవంత్ రెడ్డిని ఎన్డీ టీవీ సంస్థ ఇంట‌ర్వ్యూ చేసింది. ఈ స‌మయంలో చంద్ర‌బాబు గురించి ప్ర‌స్తావిస్తూ..ఏపీలో మీ గురువు చంద్ర‌బాబు పోటీ చేస్తున్నారు. శిష్యుడిగా మీ స‌హ‌కారం ఏమైనా ఉంటుందా? అన్న ప్ర‌శ్న‌కు రేవంత్ …

Read More »

పవన్‌కు బంపర్ మెజారిటీ?

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారం కూడా సమయం లేదు. ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తాను పోటీ చేసే నియోజకవర్గం ఎంపికలో ఎంతో కసరత్తు చేశాకే పిఠాపురంను ఎంచుకున్నారు పవన్. కానీ ఇక్కడ పవన్ గెలవగలడా అనే విషయమై మొదట్లో కొంత సందేహాలు …

Read More »

మహాసేన రాజేష్.. మళ్లీ యుటర్న్

మహాసేన పేరుతో మీడియా సంస్థను నెలకొల్పి దళితుల కోసం బలంగా వాయిస్ వినిపిస్తూ మంచి పేరు సంపాదించిన వ్యక్తి రాజేష్. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అతను వీడియోలు చేసిన సంగతి తెలిసిందే. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే రాజేష్ ఆ పార్టీకి పూర్తి వ్యతిరేకిగా మారిపోయారు. వైసీపీకి వ్యతిరేకంగా బలంగా వాయిస్ వినిపిస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా నిలుస్తూ జనసేనలోకి …

Read More »

నా దగ్గర డబ్బు లేదు-జగన్

దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన అధికారిక ఆస్తులే వందల కోట్లయితే అనధికార ఆస్తుల సంగతేంటో చెప్పాల్సిన పని లేదు. అలాంటి వ్యక్తి తన దగ్గర డబ్బు లేదని ఎన్నికల ప్రచారంలో చెప్పుకోవడం విశేషం. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ మాట్లాడుతూ.. డబ్బుల పంపకాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నా దగ్గర చంద్రబాబు లాగా డబ్బులు లేవు. ఆయన …

Read More »

నారా లోకేష్ కోసం.. రోడ్డెక్కిన‌ నంద‌మూరి కుటుంబం !

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ఆయ‌న ఓడిపోయారు. అయినా ప‌ట్టుబ‌ట్టి.. ఇక్క‌డే పోటీ చేయాల‌ని… గెల‌వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇప్ప‌టికే నాలుగేళ్లుగా ఆయ‌న ఇక్క‌డి ప్ర‌జ‌లతో మ‌మేకమ‌య్యా రు. ఎన్నిక‌ల‌కు ముందు పాద‌యాత్ర చేశారు. ప్ర‌జ‌ల‌కు సాయం కూడా చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న గెలుపును కాంక్షిస్తూ.. ఆయ‌న స‌తీమ‌ణి బ్రాహ్మ‌ణి కూడా …

Read More »

అంబటికి మళ్లీ అల్లుడి కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ ఇటీవల పెట్టిన వీడియో ఎంత వైరల్ అయిందో తెలిసిందే. అంబటి అంతటి నీచ నికృష్టుడిని తాను ఇంత వరకు చూడలేదంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు గౌతమ్. అంబటికి ఓటేస్తే జరిగే నష్టం గురించి జనాలకు వివరిస్తూ హెచ్చరిక జారీ చేశారు. దీనికి అంబటి కూడా దీటుగానే స్పందించారు. ఒక ప్రెస్ మీట్ పెట్టి తన అల్లుడికి కూతురు …

Read More »

  త‌మ్ముణ్ని గెలిపించండి.. ప‌వ‌న్ కోసం చిరు ప్ర‌చారం

పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. విజ‌యం కోసం.. మెగా కుటుంబం రోడ్డెక్కిన విష‌యం తెలిసిందే. నాగ‌బాబు, ఆయ‌న సతీమ‌ణి, కుమారుడు, మేన‌ల్లుడు ఇలా.. వ‌రుస పెట్టి చాలా మంది మెగా కుటుంబానికి చెందిన హీరోలు, న‌టులు పిఠాపురంలో ప‌వ‌న్ గెలుపు కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో మెగా స్టార్ చిరంజీవి కూడా రంగంలోకి దిగుతున్నార‌ని.. మే 7న ఆయ‌న పిఠాపురం వ‌స్తున్నార‌ని.. పెద్ద …

Read More »

టాలీవుడ్ కదలికతో జనసేన టీడీపీకి బలం 

ఎన్నికలు ఇంకో వారం రోజుల్లో జరగనుండగా ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏపీ అధికారి పార్టీని గద్దె దించి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న టిడిపి జనసేన కూటమికి మద్దతు దక్కుతున్న వైనాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ రోజు పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవే స్వయంగా పిఠాపురంలో తన తమ్ముడికి ఓటు వేయమని వీడియో మెసేజ్ రూపంలో పిలుపు ఇవ్వడం ఒక్కసారిగా సంచలనంగా …

Read More »

జ‌గ‌న్‌లో ఓట‌మి భ‌యానికిది సంకేత‌మా?

ఆంధ్ర‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకో వార‌మే స‌మ‌యం ఉంది. ఈ ఎన్నిక‌లు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు, అటు ప్ర‌తిప‌క్ష టీడీపీ-జ‌న‌సేన‌ల‌కు ఎంత కీల‌క‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఓడితే ఇరు వ‌ర్గాల భ‌విత‌వ్యం ప్ర‌మాదంలో ప‌డుతుంది. అందుకే ఎన్నిక‌ల కోసం సర్వ‌శ‌క్తులూ ఒడ్డుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఏకంగా 151 సీట్లు గెలిచి అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్.. ఈసారి తీవ్ర వ్య‌తిరేక‌త మ‌ధ్య ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తున్నారు. తన‌పై …

Read More »

ప‌థ‌కాల మాట ఎత్తొద్దు: జ‌గ‌న్‌కు ఈసీ షాక్‌!

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌స్తావించ‌డానికి వీల్లేద‌ని తాజాగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏపీ అధికార పార్టీ వైసీపీకి చేతులు కాళ్లు క‌ట్టేసి న‌ట్టు అయింది. ప్ర‌స్తుతం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ప్ర‌స్తావించ‌రాద‌ని తేల్చి చెప్పింది. అదేవిధంగా ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వ‌డానికి వీల్లేద‌ని ఎన్నిక‌ల సంఘం తేల్చి చెప్పింది. ఈ …

Read More »

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ ‘ప్ర‌జాగ‌ళం’లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో ఉండ‌డంతో ఈ స‌భ‌కు రాలేదు. అయితే.. ఈ స‌భ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పాల్గొన్నారు. మ‌రి కూట‌మి పార్టీల కీల‌క నేత లేక‌పోతే..ఎలా అనుకున్నారా? ఇక్క‌డే నారా లోకేష్ ఆ భ‌ర్తీ పూర్తి చేశారు. ఈ రాజ‌మండ్రి స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, నారా లోకేష్ మాత్ర‌మే పాల్గొన్నారు.ఇక‌, మోడీ …

Read More »

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ అధికారంలోకి వ‌రుస‌గా మూడోసారి రానుంద‌ని తెలిపారు. రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. భార‌త్ త్వ‌ర‌లోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా అవ‌త‌రించ‌నుంద‌ని చెప్పారు. అన‌కాప‌ల్లి బెల్లం అంత‌ర్జాతీయ ఖ్యాతి పొందింద‌ని.. అలాంటి తీయ‌టి ప్ర‌భుత్వ‌మే ఏపీలో ఏర్ప‌డ‌నుంద‌ని చెప్పారు. జూన్ 4న వ‌చ్చే ఫ‌లితాలు.. …

Read More »