తమిళనాడులో ఇండియా కూటమి లోక్ సభ స్థానాలు అన్నింటినీ క్లీన్‌స్వీప్ చేసింది. అధికార డీఎంకే సారథ్యంలో బరిలోకి దిగిన ఆ కూటమి గత సార్వత్రిక ఎన్నికలను మించి ఫలితాలను సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాలను ఇండియా కూటమి కైవసం చేసుకుంది. కూటమి హవా ముందు ఏఐఏడీఎంకే, ఎన్డీయే కూటమి తేలిపోయింది. ఆ రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాలకు గానూ 22 చోట్ల గెలుపొందిన డీఎంకే తన పట్టును నిలుపుకొన్నది. …
Read More »కర్ణాటకలో కాంగ్రెస్ కు ఝలక్
కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. రాష్ట్రంలోని 28 స్థానాలకుగానూ 17 సీట్లను ప్రతిపక్ష బీజేపీ కైవసం చేసుకున్నది. అధికార కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాల్తకు మాత్రమే పరిమితం అయింది. బీజేపీ మిత్రపక్షం జేడీఎస్ రెండు చోట్ల గెలిచింది. గెలిచిన వారిలో మాజీ సీఎంలు బసవరాజ్ బొమ్మై, హెచ్డీ కుమారస్వామి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే అల్లుడు రాధాక్రిష్ణ దొడ్డమణి ఉన్నారు. …
Read More »ఒడిశాలో బీజేపీ సర్కార్.. నవీన్‌బాబు ఓటమి!
ఒడిశాలో సంచలనం చోటు చేసుకుంది. ఇక్కడ పాతిక సంవత్సరాలుగా రాజ్యమేలుతున్న ముఖ్యమంత్రి నవీన్ బాబు ఇంటి ముఖం పట్టారు. ఆయన పాలనకు ప్రజలు వ్యతిరేక ఓటు వేశారు. పలితంగా అసలు కలలో కూడా ఊహించని విధంగా ఒడిశాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 80 స్థానాల్లో విజయం దక్కించుకున్న ఆ పార్టీ మరో 5 నుంచి 6 స్థానాలు దక్కించుకునే అవకా శం ఉంది. ఇక, ఇప్పటి వరకు అధికారంలో ఉన్న …
Read More »18 జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ !
‘వై నాట్ 175’ అన్న వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రజలు షాక్ ఇచ్చారు. ఏపీలోని 26 జిల్లాల్లో 18 జిల్లాల్లో అయితే వైసీపీ ఖాతా కూడా తెరవలేదు.కేవలం 10 స్థానాలకు పరిమితం అయింది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఈసారి వైసీపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. వీటితో పాటు శ్రీకాకుళం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, …
Read More »‘పిన్నెల్లి’ పీచే మూడ్ !
పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అధికార వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓటమి పాలయ్యాడు. టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందారెడ్డి చేతిలో 33,318 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బ్రహ్మానందా రెడ్డికి 122413 ఓట్లు రాగా పిన్నెల్లికి 89095 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన పిన్నెల్లి 2009 నుంచి ఒకసారి కాంగ్రెస్, రెండుసార్లు 2014,2019 లలో వైసీపీ …
Read More »ఏపీ ఫలితాలపై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై తొలిసారిగా స్పందించిన రేవంత్ రెడ్డి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు అభినందనలు తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దామని సూచించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకొని రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథం వైపు ముందుకు సాగేలా అడుగులు …
Read More »జగన్ నాకు శత్రువు కాదు: పవన్
ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారిగా ఎన్నికల ఫలితాలపై స్పందించారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో మాట్లాడిన పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి చీకటి రోజుల పోయాయని, ప్రజలు చారిత్రక తీర్పునిచ్చారని పవన్ అన్నారు. వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని పవన్ హామీనిచ్చారు. ప్రజలు తనకు చాలా పెద్ద బాధ్యతనిచ్చారని పవన్ అన్నారు. ఈ విజయం జనసేనది కాదని, …
Read More »టీటీడీ చైర్మన్ ఔట్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవికి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించమంటూ టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి భూమన లేఖ రాశారు. గత ఆగస్టులో భూమన టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో తిరుపతి నుండి పోటీ చేసిన భూమన కుమారుడు అభినయ్ రెడ్డి ఓటమి పాలయ్యాడు. ఆయన తిరుపతి నుంచి పోటీ చేశారు కానీ జనసేన …
Read More »తొలిప్రేమను గుర్తు చేసిన విజయం
100 శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గంటల వ్యవధిలోనే మంగళగిరిలో ఉన్న పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను, అభిమానులను కలుసుకున్నారు. వాళ్లకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకున్నారు. దీని కోసమే హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆఘమేఘాల మీద గన్నవరం వచ్చిన పవన్ కు క్యాడర్ నుంచి ఘన స్వాగతం …
Read More »కేంద్రంలోనూ కింగ్ మేకర్‌గా చంద్రబాబు!
ఏపీలో అప్రతిహత విజయం దక్కించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలోనూ కీలకం కానున్నారు. ఎందు కంటే.. కేంద్రంలో తమకు ఈ సారి 400 సీట్లు పక్కా అని చెప్పుకొన్న బీజేపీకి ప్రజలు 250-270 మధ్య పరిమితం చేయనున్నా రు. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్లు కూడా.. అలానే ఉన్నాయి. మరోవైపు.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అసలు ప్రభావం చూపించదని బీజేపీ నేతలు అనుకున్నా.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ …
Read More »అన్యాయం జరిగింది..ఆధారాల్లేవ్: జగన్
ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో అధికార పార్టీ వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వైసీపీ ఓటమి పాలవడం ఆ పార్టీ నేతలకు షాకిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలలో ఓటమి తర్వాత వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ తొలిసారిగా ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఇటువంటి ఫలితం వస్తుందని ఊహించలేదని జగన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కోట్లాదిమందికి సంక్షేమం అందించామని, …
Read More »విప్లవమా.. తిరుగుబాటా.. ఏపీలో ఏం జరిగింది?
సునామీని మించిన ఓట్ల వరద.. గంగా ప్రవాహాన్ని మించిన ఫలితాల వెల్లువ.. చూస్తే.. ఏపీలో ఏం జరిగింది? విప్లవమా? లేక ప్రజల తిరుగుబాటా? అనేది ఆసక్తిగా మారింది. 1970లలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. పార్టీలతో సంబంధం లేకుండా.. ప్రశ్నించిన వారిని జైళ్లకు తరిమికొట్టారు. దీంతో జైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. దీనిని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు తిరస్కరించారు. ఆమె తీసుకున్న నిర్ణయాలను తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. …
Read More »