ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిం దే. ఆయన ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్తే.. అక్కడి వాతావరణం, అక్కడి ప్రజలతో తనకు సంబంధం ఉందని.. తన చిన్నప్పుడు ..పుట్టి పెరిగానని.. చదువుకున్నానని.. కాలేజీకి వెళ్లానని ఇలా.. ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడుకు వెళ్లినా.. నెల్లూరులో పర్యటించినా.. హైదరాబాద్‌లో ప్రసంగించినా.. పవన్ కల్యాణ్.. చెబుతున్న మాట ఇదే. తనకు ఆ ప్రాంతంతో సంబంధం ఉందని చెబుతారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో యాంటీ ప్రచారం చేస్తూ వుంటారు.
అయితే.. ఇప్పటి వరకు ఈ వ్యాఖ్యలపై స్పందించని పవన్ కల్యాణ్..తాజాగా రియాక్ట్ అయ్యారు. హరిహర వీరమల్లు సినిమా ప్రెమోషన్‌లో భాగంగా విశాఖపట్నంలో నిర్వహించిన ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో లైట్‌గా రాజకీయాలను కూడా ఆయన టచ్ చేశారు. తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టారు. “నాపై కొందరు విమర్శలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో కూడా కామెంట్లు పెడుతుంటారు. వాటిని నేను లెక్కచేయను. కానీ.. నేను చెప్పేది ఒక్కటే.. నాపేరు పవన్.. అంటే అందరికీ తెలిసిందే(వాయువు/గాలి). కాబట్టి నేను లేని చోటే లేదు. ఈ మాట ప్రధాని అంతటి నాయకుడే చెప్పారు. కాబట్టి నేనేమీ బాధపడను. తక్కువ బుద్దిఉన్నవారు.. కూపస్థ మండూకాల మాదిరిగా ఆలోచన చేస్తారు” అని వ్యాఖ్యానించారు.
ఇక, తనకు ఇవ్వడమే తెలుసునని.. తీసుకోవడం రాదని పవన్ చెప్పారు. తను ఇప్పటి వరకు ఏ సినిమాకు ప్రెమోషన్ చేసుకోలేదన్నారు. “రండి.. నా సినిమా చూడండి.. అని నేను పిలవను. నేను పిలవకపోయినా.. నా అభిమానులు సినిమాకు వస్తారని నాకు తెలుసు. అందుకే ధైర్యం. అయితే.. ఈ సినిమా ప్రారంభమై చాలా ఏళ్లు అయింది. అందుకే.. నిర్మాతల కోసం ప్రెమోషన్ కార్యక్రమాలకు వస్తున్నా” అని వ్యాఖ్యానించారు. తనకు అన్ని రకాలుగా గురువు రచయిత సత్యానంద్ అని పేర్కొన్నారు. ఆయన నుంచే ధైర్యం.. సాహసం, ఎదిరించడం, పోరాడడం, ప్రశ్నించడం వంటివి నేర్చుకున్నట్టు పవన్ కల్యాణ్ వివరించారు. ఇవి తనకు రాజకీయాల్లో ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. కాగా.. హరిహర వీరమల్లు సినిమా.. గురువారం విడుదల కానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates