ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఇది చరిత్రాత్మక రోజు అని అభివర్ణించారు. ప్రజల పట్టుదల, నిర్ణయాత్మక శైలి వంటివి పోలింగ్ సమయంలో స్పష్టంగా కనిపిస్తున్నాయని.. ఇవి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరిన క్యూలలో ఎంతో ఓపికగా వేచి ఉన్నారని.. తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆయా …
Read More »ఏపీలో అశాంతి రేపిన ప్రశాంత ఎన్నికలు!
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. కొన్ని జిల్లాల్లో మాత్రం అశాంతి రేపింది. ఈవీఎంల ధ్వంసం నుంచి కార్లను తగల బెట్టడం.. నాయకులపైనా.. పోలింగ్ ఏజెంట్లపైనా కూడా దాడులు చేయడం.. కర్రలు, కత్తులు ఇతరత్రా ఆయుధాలను ప్రయోగించడం వంటివి ఏపీ ఎన్నికల్లో కనిపించింది. గుంటూరు జిల్లా పల్నాడులోని నాలుగు నియోజకవర్గాలు, అనంతపురం జిల్లా తాడిపత్రి, …
Read More »ఎమ్మెల్యే-చెంపదెబ్బ.. నేషనల్ ట్రెండింగ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో రిపోర్ట్ అవుతున్నాయి. ఐతే ఒక ఉదంతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్.. సుధాకర్ అనే ఓటరు మీద చేయి చేసుకోగా.. అతను తిరిగి ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టడం హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే అనుచరులు వెంటనే ఆ వ్యక్తిని చితకబాదినా.. ఎమ్మెల్యేను ఓటరు …
Read More »జైలుకు వెళ్లకుండా మీరే నన్ను కాపాడాలి: కేజ్రీవాల్
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు. “పోలింగ్ సమయంలో ప్రచారం చేసుకునేందుకు నేను జైలు నుంచి బయటకు వచ్చాను. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత..జూన్ 1న నేను మళ్లీజైలుకు వెళ్లాలి. నేను జైలుకు వెళ్లకుండా ఉండాలంటే.. మీరే నన్ను కాపాడాలి“ అని ఆయన పిలుపునిచ్చారు. ఐదో దశలో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఏడు పార్లమెంటు …
Read More »ఏపీలో బెట్టింగ్ మార్కెట్ ఏం చెబుతోంది?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ తెలుగువారి చూపంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీదనే. అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై పెద్ద ఎత్తున జరుగుతోంది. ఏ ఇద్దరు తెలుగు వారు కలిసినా వారి మాటల్లో మొదట వచ్చేది ఎన్నికల అంశమే. అంతలా తెలుగువారి జీవితాల్లో భాగంగా మారిన ఈ ఎన్నికలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వనున్నది ఓటర్లు ఈ రోజు తీర్పు ఇవ్వనున్నారు. ఈవీఎంలలో నిక్షిప్తమయ్యే ఓటర్ల తీర్పు …
Read More »ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన ఓటరు !
నాయకుడు అంటే నలుగురికి ఆదర్శంగా నిలవాలి. అందునా ప్రజాప్రతినిధి అంటే మరింత బాధ్యతతో వ్యవహరించాలి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన తాను అందరికీ అతీతం అనుకుంటే తెనాలి ఎమ్మెల్యేకు జరిగిన పరాభవమే ఎదురవుతుంది. ఓటు వేయడానికి వెళ్లిన తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ అక్కడ లైన్లో నిలబడిన ఓటర్లను పట్టించుకోకుండా నేరుగా లోపలికి వెళ్తుండగా అక్కడ ఉన్న ఓటరు అభ్యంతరం చెప్పాడు. ఇంత మంది క్యూలో నిల్చుంటే …
Read More »పల్నాడులో ఆ 4 నియోజకవర్గాలు హాట్ హాట్!
కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారుల వరకు కూడా.. అనేక జాగ్రత్తలు తీసుకున్నా రు. అధికారులను మార్చేశారు. అంతేకాదు.. చీమ చిటుక్కుమన్నా పట్టేసేలా వ్యవస్థను తీసుకువచ్చారు. అన్ని పోలింగ్ బూతులను వెబ్ క్యాస్టింగ్ చేశారు. అంటే.. ఇక్కడ ప్రతిదీ రికార్డు చేశారు. అయినా.. ఆగడాలు.. ఆగలేదు. దాడులకు బ్రేక్ పడలేదు. అదే.. ఎప్పుడూ.. హాట్ టాపిక్‌గా ఉండే.. పల్నాడు ప్రాంతం. ఇక్కడి నాలుగు నియోజకవర్గాలను కేంద్ర ఎన్నికల …
Read More »కీలక నియోజకవర్గాల్లో ఓటర్ల బారులు…. సంకేతం ఏంటి?
రాష్ట్రంలో కీలక నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో అనూహ్యమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచే ఆయా నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ బూతుల్లోనూ పెద్ద ఎత్తున ఓట్లర్లు బారులు తీరారు. కొన్ని కొన్ని బూతుల్లో అయితే.. రెండేసి వరుసల్లో ఓటర్లు బారులు తీరారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి ఆసక్తిగా మారింది. పిఠాపురం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచివంగా గీత పోటీలో …
Read More »చంద్రబాబు మాస్ వార్నింగ్… ఎవరిని ఉద్దేశించి?
టీడీపీ అధినేత చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఉండవల్లిలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన తర్వాత.. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు జిల్లాలోని ఒకటి రెండు నియోజకవర్గాలు సహా.. కడపలోని కమలాపురం నియోజకవర్గంలోనూ.. స్వల్ప ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రెంటచింతల(పల్నాడు)లో వైసీపీ, టీడీపీ పోలింగ్ ఏజంట్లు గాయపడ్డారు. ఇక్కడ స్వల్ప ఉద్రిక్తతలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు సరికాదని.. ప్రజాస్వామ్య పండుగను …
Read More »కడపలో రికార్డు స్థాయి పోలింగ్.. అక్క చెల్లెళ్ల ఎఫెక్టేనా?
ఏపీలో జరుగుతున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటి రెండు జిల్లాలు మినహా.. మిగిలిన జిల్లాల్లో పోలింగ్ ప్రక్రియ ఆశాజనకంగానే సాగుతోంది. ఉదయం 5-6 మధ్యే పోలింగ్ బూతుల ముందు ఓటర్లు బారులు తీరారు. నిర్దేశిత సమయం ప్రకారం ఉదయం 7 గంటలకు.. పోలింగ్ ప్రారంభమైంది. కొన్ని కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మిగిలిన చోట ఇబ్బందులు లేకుండానే ప్రక్రియ సాగిపోయింది. అయితే.. చిత్రంగా గత 2019 ఎన్నికల సమయంలో ఉదయం …
Read More »పవన్ ఫస్ట్ టైమ్.. సతీసమేతంగా ఓటేశారు..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే.. గతానికి భిన్నంగా ఆయన ఈ సారి భార్యతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయడం విశేషం. మంగళగిరిలోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులకు, పోలింగ్ సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు. తాగునీటి వసతి కల్పించాలని.. టెంట్లు ఇంకా ఎక్కువ వేయాలని సూచించారు. అదేవిధంగా కేంద్రాల ముందు ప్రజలు బారులు …
Read More »ఓటేసిన బాబు దంపతులు.. స్పెషల్ ఏంటంటే!
టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సతీమణి నారా భువనేశ్వరి దంపతులు.. తమ ఓటు హక్కును విని యోగించుకున్నారు. అయితే.. ఇందులో స్పెషల్ ఏంటంటే.. చంద్రబాబు దంపతులు తమ కుమారుడు, పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ కోసం తొలి ఓటు వేయాలని అనుకున్నారు. కానీ, స్వల్ప ఆలస్యంతో మూడో ఓటు వేయాల్సి వచ్చింది. మొత్తానికి సోమవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారం భం కావడంతో ఇక్కడ భారీ …
Read More »