ఏపీ రాజధాని.. అమరావతి నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు శరవేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. 33 వేల ఎకరాలకు తోడు మరో 44 వేల ఎకరాలను కూడా సమీకరిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు వారు తాము పుట్టిన నేలకు రుణం తీర్చుకునే అవకాశాన్ని కూడా చంద్రబాబు కల్పిస్తున్నారు. సహజంగానే చాలా మంది పుట్టి పెరిగిన నేలకు ఏమైనా చేయాలని భావిస్తారు. వారి వారి సొంత ప్రాంతాల్లో ఏదో ఒక కార్యక్ర మం ద్వారా ఈ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తారు.
ఇలానే ఇప్పుడు.. అమరావతి కోసం కూడా సాయం చేసేందుకు ముందుకు రావాలని బావించే వారికి ఏపీ ప్రభుత్వం అద్భుతమైన అవకాశం కల్పించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు.. అమరావతి కోసం.. పరోక్షంగా స్వేదం చిందించేందుకు ప్రభుత్వం ఛాన్స్ ఇచ్చింది. ప్రత్యక్షంగా ఈ మహాక్రతువులో పాలు పంచుకునే అవకాశం లేనివారికి.. పరోక్షంగా భాగస్వామ్యం కల్పిం చేందుకు సర్కారు సిద్ధమైంది. ఇంటికో పువ్వు ఈశ్వరుడికి ఓ మాల.. అన్న చందంగా.. అమరావతిలో భాగస్వామ్యమయ్యేందుకు ముందుకు రావొచ్చు.
ఎలా?
అమరావతి నిర్మాణానికి ఎక్కడి నుంచైనా ఎవరైనా.. భాగస్వామ్యం కావాలని అనుకునే వారు.. రూ.10 నుం చి ఎంతైనా విరాళంగా ఇచ్చే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దీనికిగాను.. ఆన్‌లైన్ పోర్టల్‌ను సీఆర్ డీఏ ప్రారంభించింది. ‘crda.ap.gov.in’లోకి వెళ్తే.. రాజధాని విరాళం పేరుతో(డొనేషన్ టు అమరావతి) ఒక లింకు కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయగానే.. క్యూఆర్ కోడ్ వస్తుంది. దీనిని స్కాన్‌చేసి మీరు చెల్లించాల్సిన మొత్తం జమ చేయవచ్చు. అనంతరం.. మీ పేరుతో ఆటోమేటిక్‌గా ఓ రశీదు వస్తుంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం ఉంటుంది. మరి ఇంకెందుకాలస్యం.. రాజధాని నిర్మాణానికి తలోచేయి వేద్దాం.!
Gulte Telugu Telugu Political and Movie News Updates