మోడీతో ఢీ అంటే ఢీ అన్న‌.. స‌త్య‌పాల్‌.. క‌న్నుమూత‌

స‌త్య‌పాల్ మాలిక్‌.. జ‌మ్ము క‌శ్మీర్ కు కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేశారు. మంగ‌ళ‌వారం అనారోగ్య కార‌ణాల‌తో ఆయ‌న క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 79 సంవ‌త్స‌రాలు. గ‌తంలో లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యుడి గా కూడా ప‌నిచేసిన స‌త్య‌పాల్ మాలిక్‌.. రెండే మూడు మాసాల కింద‌టి వ‌ర‌కు జాతీయ మీడియా లో ప్ర‌ధా న వార్త‌గా నిలిచారు. గ‌త‌కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉన్న ఆయ‌న ఇంట్లో రెండు వారాల కింద‌ట సీబీఐ అధికారులు దాడులు చేశారు. లెక్క చూప‌ని న‌గ‌దు అంటూ.. 30 ల‌క్ష‌ల సొమ్మును స్వాధీనం చేసుకున్నా రు.

ఈ ఒత్తిడితో ఆయ‌న అనారోగ్యం పాల‌య్యార‌నేది కుటుంబ స‌భ్యులు చెబుతున్న మాట‌. ఇదిలావుంటే.. అస‌లు స‌త్య‌పాల్ మాలిక్ ఎవ‌రు? ఎందుకు వివాదం అయ్యారు? అస‌లు హాట్ టాపిక్‌గా ఎలా మారారు? అనేది ఆస‌క్తిక‌రం. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌న్మించిన స‌త్య‌పాల్‌.. న్యాయ విద్య అభ్య‌సించారు. అనంత‌రం.. రాజ కీయాల్లోకి వ‌చ్చారు. త‌ర్వాత‌.. పార్టీలు మారుతూ.. 2012 నాటికి ఆయ‌న బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి గా కూడా ప‌నిచేశారు. ఆర్ఎస్ఎస్‌లో కొంత వ‌ర‌కు ప‌నిచేశారు. ఇది .. 2014 త‌ర్వాత‌.. కీల‌క మ‌లుపు తిరిగింది.

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కేంద్రంలో ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. మాలిక్ ద‌శ తిరిగింది. ఆయ‌న‌ను జ‌మ్ము క‌శ్మీ ర్ స‌హా.. మేఘాల‌య‌, గోవా, బిహార్‌, ఒడిశా రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మించారు. అయితే.. ఆ త‌ర్వాత అనూహ్యంగా ప్ర‌ధాని మోడీతో మాలిక్ విభేదించారు. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థ‌ల అధిప‌తులు.. ముఖేష్ అంబానీ, అదానీల‌కు దోచిపెడుతున్నార‌ని వ్యాఖ్యానించారు. అదేస‌మ‌యంలో మోడీ మంత్రి వ‌ర్గంలో అవినీతిప‌రులు ఉన్నార‌ని.. మోడీ వారిని వెనుకేసుకువ‌స్తున్నార‌ని కూడా మాలిక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మ‌రీ ముఖ్యంగా.. ప్ర‌ధాని మోడీ వైఫ‌ల్యం కార‌ణంగానే పుల్వామా(జ‌మ్ము క‌శ్మీర్‌లోని)లో ఉగ్ర‌వాద‌ దాడి జ‌రిగింద‌ని సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేశారు. దీంతో కేంద్రానికి- స‌త్య‌పాల్ మాలిక్‌కు మ‌ధ్య అంత‌రం పెరిగి పోయింది. అనంత‌ర ప‌రిణామాల్లో మాలిక్‌పై అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయంటూ.. సీబీఐ అధికారులు ఆయ‌న నివాసంపైదాడి చేశారు. ఇది కూడా వివాదానికి దారితీసింది. ఈ కేసు కొన‌సాగుతున్న క్ర‌మంలోనే మాలిక్ క‌న్నుమూశారు.